Thursday, 18 August 2016

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366జయంతి ఘన వేడుకలు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366జయంతి ఘన వేడుకలు  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన లోని అర్అండ్ బీ అతిదీ గృహంలో  గురువారం నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366 జయంతి పురస్కరించుకొని  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణా గౌడ సంఘ జిల్లా ఇంచార్జి కే.అంజనేయుల గౌడ్ మాట్లాడుతూ  ఆనాటి మొగలుల కలం లో పంటల పై వేసే పన్ను కంటే కళ్ళు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బి.సి కులాలు దళిత వర్గాలు ఏకం చేసి జమిందారులు, సుబెదరులు ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న ది  అన్నారు.ఈ  కార్యక్రమం లో ముక్య అతిధి గా జడ్పీటీసీ బాబురావు  మరియు రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఆసిఫాబాద్ నియోజక కన్వేయర్ మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఉపసర్పంచ్ బొమినేని శ్రీధర్కుమార్, మండల యువజన గౌరవ అధ్యక్షులు  అన్నపూర్ణ శాంతి కుమార్ గౌడ్,జిల్లా కోశాధికారి కొయ్యడ రాజగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు మహేష్ గౌడ్, యువజన మండల అధ్యక్షులు  మడ్డి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి నారాయణ గౌడ్ ,   బొంగు నరసింగ రావు,డైరెక్టర్ మధనయ్య  ,ఆసిఫాబాద్ మార్కెట్ డైరెక్టర్ పళ్ళ రాజేశ్వర్ , తెరాస టౌన్ ఆద్యషుడు రాపర్తి అశోక్ , బొమ్మినేని సత్యనారాయణ ,గౌడ సాంగ నాయకులూ గుడిసెల వెంకటేశ్వర్ గౌడ్ , తాళ్లపల్లి కృష్ణ గౌడ్ ,తాళ్ల శ్రీనివాస్ గౌడ్,  తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment