విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ; దుర్గం రవిందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని దుర్గం రవిందర్ అన్నారు అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ ఐ ఎస్ ఎఫ్ )81వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు రెబ్బెన బసు ప్రయాణ ప్రాంగణంలో జెడ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ మాట్లాడుతు సమశీల ఉద్యమాల సారథి విద్యార్ధి లోకానికి స్ఫూర్తి , చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు సాగె ఎ ఐ ఎస్ ఎఫ్ 81వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నామన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వవలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక ద్వాంద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని , అందరికి సమాన విద్య , ఉచితవిద్య అందించాలని పాలకులు పేద , బడుగు , బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షల మార్చారని , ప్రభుత్వ విద్యాసంస్థలలో సౌకర్యాలు కల్పించకుండా పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాల లను రేషనైలేజేషన్ పేరుతో మూసివేస్తామని పాలకులు అనడం సమంజేశం కాదని వారు అన్నారు రాష్ర్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని విద్య సవంత్సరం మొదలై 3 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు అమలు చేలేదని కేవలము హామీలకే పరిమితమయ్యాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని నెపంతో రేష్నయిలెజం చేసి మూసివేస్తున్నారని ప్రయివేటు విద్యాసముస్థలలో అధిక ఫీజులను అరికట్టాలని, అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజినల్ కార్యదర్శి పుదారి సాయి అధ్యక్షులు కె రవికుమార్ , ఉపాధ్యక్షులు శేఖర్ , మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ నాయకులు సంపత్ , సందీప్ , గౌతమ్, సాయి , రాజు , తిరుపతి , శ్రీనివాస్ , మహేష్ కళాశాల విద్యార్థులు తదితరాలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment