మత్సకారుల హక్కుల తో పాటు ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని అలాగే మత్సకారుల హక్కులను కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కలపల్లి వెనకటేశ్వర్లు అన్నారు గురువారం రెబ్బెన మండలంలోని అతిధి గృహం లో రెబ్బెన ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షలు పెసరు మధునయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సదస్సు లో కొరివి కృష్ణస్వామి 123వ జయంతిని జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బిసిడి గృపు లొంచి ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని అన్నారు మత్స కారులకు సబ్సిడీ రుణ సదుపాయం,భీమా పథకం వర్తిస్తుంది అని అన్నారు ఉపాధి పనులు కల్పించాలని అన్నారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో చేపల పెంపకాన్ని పెంచవచ్చు అని, ముదిరాజ్ సంఘం ద్వారా ఉపాధి పొందవచ్చునని అన్నారు. హరితహారంలో ముదిరాజులు ముందుండి విజవంతం చేశారు మత్సశాఖ సంచాలకుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ నిర్మల్ వారికీ సమష్యలు తెలపటం జరిగింది కావున ఇతరులు చెరువులలో చేపలు వేసిన, అనాదికారికంగా ఎలాంటి చర్యలు తీసుకున్న అవి చెల్లవని అధికారికంగా మత్సశాఖవారు ముదిరాజులకు హక్కులు కల్పించే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే సమష్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి పేట మల్లయ్య , గోలేటి అధ్యక్షుడు ఎర్రం మల్లేష్, ముదిరాజ్, కార్యదర్శి పిల్లి మధు ముదిరాజ్ ,చిత్రగుప్తుడు, కాలివేణి రాజెందర్ ముదిరాజ్, మూడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్, సందీప్ కుమార్, పోతిరెడ్డి రమేష్, లక్ష్మణ్, స్వామి, మహేష్ మూడెడ్ల రమేష్, రాజు, సాయి, రాజేష్ టి రాజయ్య, డి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment