ముర్రు పాలు ఎంతో శ్రేష్టం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కన్నతల్లి ముర్రుపాలు బిడ్డకువెంటనే తాగించాలని అవి ఎంతో శ్రేష్టకరమని గంగాపూర్ సర్పంచ్ రవీందర్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్బంగా గంగాపూర్‌లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ముర్రు పాలలో లభించే పోషకాలు రోగనిరోధక శక్తి లభిస్తుందని , ఎదిగే బిడ్డలకు కావాల్సిన తల్లిపాలలో సమృద్దిగా లభిస్తాయన్నారు. ముర్రుపాలతో శిశువు వ్యాధి నిరోదక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా రెబ్బెన , నంబాల గ్రామాల్లో కూడ తల్లిపాల వారోత్సవాల సదస్సులు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి రవీందర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మీ, హెల్త్ సూపర్ వైజర్ పావని, ప్రధానోపాధ్యాయుడు వామనమూర్తి , అంగన్‌వాడీ టీచర్లు, ప్రమీల, పుష్ప భారతి, వత్సల, బాలమ్మ, వనిత, సువర్ణ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment