పాసిగామ్ లో పశు వైద్యం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం లోని గంగపుర్ గ్రామా పంచాయత్ లోని పాసిగాం మరియు వరదలగూడెం లలో పశువైద్య శిబిరం నిర్వహించి 815 మేకలు మరియు 674 గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణి చేయడం జరిగింది. ముఖ్య అతిధిగా సర్పంచ్ రవీందర్ గారు హాజరయ్యారు . మంచిర్యాల డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ డా . కుమారస్వామి గారు నట్టల నివారణ మందు పంపిణి కార్యక్రమమును ఆకస్మిక తనిఖీ చేశారు . రైతులకు నట్టల నివారణ మందు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు . రైతులకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన చేకూర్చి వాటి నివారణ చర్యలను గూర్చి తెలియజేసారు . రైతులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సరైన కాలంలో టీకాలు వేసుకొని పశువులను వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి అని తెలియజేశారు.
No comments:
Post a Comment