Tuesday, 9 August 2016

ఎఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ ప్రధాన కార్యదర్శి ఎన్నిక


ఎఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ ప్రధాన కార్యదర్శి  ఎన్నిక 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);   అసిఫాబాద్ లోని ఎస్ టియూభవన్ లో జరిగిన ఎఐఎస్ఎఫ్ డివిజన్ స్థాయి విస్తృత సమావేశంలో ఎఐఎస్ఎఫ్  అసిఫాబాద్ డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్, జిల్లా  ఉపాధ్యక్షులు  ఆత్మకూరి ప్రశాంత్ తెలియజేసారు . ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోలేటి కి చెందిన ప్రస్తుత రెబ్బెన మండల కార్యదర్శి పూదరి సాయికిరణ్ ను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేసారు .  డివిజన్ అధ్యక్షులుగా వాంకిడి మండలానికి చెందిన బావునే వికాస్ ను ఎన్నుకున్నారు .  పూదరి సాయికిరణ్ 2012లో ఎఐఎస్ఎఫ్ లో చేరి ఎఐఎస్ఎఫ్ కాలేజీ  ఇంఛార్జ్ గా , గోలేటి పట్టణ ,రెబ్బెన మండల ఉపాధ్యక్షుడిగా, ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ,విద్యార్ధి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని సమస్యల పరిష్కరాలని కృషి చేసినందుకే డివిజన్ బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని వారు అన్నారు ఈ సందర్భంగా పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎఐఎస్ఎఫ్ బలోపేతానికి , విద్యార్థుల సమస్యలు త్ తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యదర్శి రవీందర్ గారికి ,ప్రశాంత్ ,బోగే ఉపేందర్ లకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్  సభ్యులు కస్తూరి రవి , సలీమ్ , హరీష్,సందీప్,తిరుపతి, సంజయ్ ,పవన్ కుమార్  పాల్గొన్నారు.

No comments:

Post a Comment