Thursday, 25 August 2016

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి - బోగే ఉపేందర్

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి - బోగే ఉపేందర్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వెతిరేక విధానలను, దోపిడీ బానిసత్వ విధానాలకు వ్యతిరేకం గా సెప్టెంబర్ 2న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గురువారం ఏ ఐ టి యూ సి  బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. దేశం లో రాష్ట్రము లో పని చేస్తున్న కార్మికులకు కనీసవేతనం 18వేలు ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు ఔట్  సోర్సింగ్ లను రద్దు చేసి రెగ్యులర్  చేయాలనీ అన్నారు. పనితో కూడిన సమన వేతనం ఇవ్వాలన్నారు కేంద్ర ప్రభుత్వ స్కిం లలో  పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణను నిలిపివేయరన్నారు. ప్రభుత్వ కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటాల అమ్మకాన్ని ఆపాలన్నారు. 45రోజుల్లో కార్మికుల సంఘాల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. మాట్లాడుతూ ప్రభుత్వ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా దోపిడీ, బానిసత్వ విధానాలను అవలంభిస్తుందన్నారు. ప్రజల ఐక్యత, దేశ సమగ్రతల పరిరక్షణకై సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తుందన్నారు. ఈ సమ్మె అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

No comments:

Post a Comment