Friday, 5 August 2016

నేడు నాటిన మొక్కలే రేపటి వృక్షాలు; ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి

నేడు  నాటిన మొక్కలే  రేపటి వృక్షాలు;  ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నేడు  నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటికి వృక్షాలు అవుతాయని, వాటితో  ప్రాణవాయువు లభిస్తుందని ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు. శుక్రావారం రెబ్బెన శ్రీ కోదండ రామాలయంలో స్వామి వారిని  దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో మొక్కలను ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి, బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ నాటారు.అనంతరం ఆమె మాట్లాడుతూ  ఈ నాటి మొక్కలే భావి తరాలకు జీవనాధారమని,తెలంగాణ హరితహారంలో  రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టిన హారితహారం కార్యక్రమం సమాజ శ్రేయస్సుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే అడవిని పెంచినట్లయితే వన్యప్రాణుల ను సంరక్షి చి భూగర్భ జలాలు కాపాడుకునే వారిమి అవుతామన్నారు. మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్  మార్కెట్ చెర్మన్ గంధం శ్రీనివాస్,  వైస్  చెర్మన్ కుందారపు శంకరమ్మ, యం పిపి కార్నతం సంజీవ్ కుమార్, జడ్ పిటిసి బాబురావు  , సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,  వైస్ యం పిపి గొడిసెల రేణుక , తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్, యంపిడిఓ సత్యనారాయన సింగ్, వైస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక,తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్,  సర్పంచ్ పెసరి వెంకటమ్మ, నంబాల సర్పంచ్ పి.సుశీల,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ , సింగిల్ విండో డైరెక్టర్  మధునయ్య, టి ఆర్ ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్కా రమేష్ , మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్ డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ,మల్రాజ్ శ్రీనివాస్,  సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు    

No comments:

Post a Comment