Tuesday, 30 August 2016

సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు భూమిపూజ

సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు భూమిపూజ 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ లో మంచినీటి సౌకర్యార్థం సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయుటకై రెబ్బెన సర్పంచ్ పి వెంకటమ్మ  శంకు స్థాపన భూమి పూజచేశారు అనంతరం వారు మాట్లాడుతు గ్రామంలో మంచినీటి కోసం సొలార్పంపుసెట్ల ను ఏర్పాటు చేయుటకు భూమిపూజచేశామని 5000 లీటర్ల సమర్ధం గల నీటి ట్యాంకును ప్రభుత్వం నిర్మిస్తుందని విద్యుత్ అంతరాయాలను అధికమిచడానికి సోలార్ పపంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రానున్న రోజుల్లో అన్ని గ్రామాలలో సౌరవిద్యుత్ వినియోగానికి ప్రభుత్వం కృషిచేస్తుందని వారు తెలిపారు.

నేలకొండపల్లి లో రజకుల గ్రామా బైస్కరణ ను ఎత్తివేయాలి

నేలకొండపల్లి లో రజకుల గ్రామా బైస్కరణ ను ఎత్తివేయాలి 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెంలో రజకులను  గ్రామ  బైస్కరణ చేయడం సమంజేశం కాదని వాళ్ళు తిరిగి మల్లి గ్రామా పున ప్రవేశానికి  అనుమతి కల్పిపేయించి గ్రామస్తుల పై చర్యలు తీసుకోవాలని రెబ్బెన రాజిక కులస్తులు మంగళవారం తహసీల్దార్ రమేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతు ఆ గ్రామములో ఉన్న 10 రాజిక కుటుంబాలు ఉండగా వారిలో వృద్దులు చిన్నపిల్లలు మినహా మిగిలినవారు ఆ గ్రామ ఆచారం ప్రకారం ముచాలమ్మ పండగసందర్భంగా అమ్మవారికి సల్లకుండలు తీసుకెళ్లడానికి గ్రామపెద్దలు ఆదేశించగా ఆగ్రామ రజకులు తిరస్కరించడంతో ఊరి పెద్దలు ఆగ్రహించి వారిని ఎలాంటి కులవృత్తి పనులకు హ్వానించకూడ దని నిర్ణయించారు . అలాగే గ్రామపెద్దల మాటలు కాదని ఎవరైనా వారికీ సహకరించినట్లైతే 1000రూ జరిమానా విధిస్తామనడం సమంజేశం కాదని అన్నారు అధికారులు చొరువతీసుకొని రజకులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాస్ , సంగం శ్రీనివాస్ , శ్రీకాంత్ , విజయకుమార్ , శంకర్  రజినీకాంత్ , సుధాకర్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ; ఐకెపి విఓఏ లు

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ; ఐకెపి విఓఏ లు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు మరియు పండగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఐకెపి విఓ ఏ ల చాలిచాలని జీతాలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని  డివిజన్ ఉపాధ్యక్షుడు గజ్జెలి భీమేష్ అన్నారు . సెప్టెంబర్ 2వ తేది న కేంద్ర రాష్ట్ర కార్మికులు చేపట్టే సమ్మె లో  ఐకెపి గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ లో పనిచేస్తున్న విఓఏ లు కుడా బాగస్వాములౌతామని మంగళవారం నాడు గౌతమి మండల సమాఖ్య రెబ్బెన కార్యాలయంలో ఎపియం వెంకటరమణ కు సమ్మె  నోటిస్ అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండ చాలీచాలని బకాయి జీతాలతో నిరంతరం అన్ని రకాల పనులు చేయించుకుంటూ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం అన్నారు . గ్రామాల్లో  విఓఏ లు స్వయం సహాయక సంఘాల పనులతో పాటు డిపార్ట్ మెంట్ కు సంబందించిన ఇంకా ఇతర అనేక పనులు నిర్వహిస్తున్నారు . వీరికి నెలకు 2000/-ల చొప్పున చెల్లిస్తామని 2013 మే 30 న సెర్ప్ నుండి సర్క్యులర్ జారీ అయింది . కానీ నేటికీ వేతనాలు విడుదల కాలేదన్నారు , స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్బంగా అనేక సభల్లో విఓఏ లకు వేతనం 5000/-రూ లకు పెంచుతామని ప్రకటించారు . ఇచ్చిన హామీలను అమలు చేసి విఓఏ ల  న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు  .   డిమాండ్స్  :- 2013 జూన్ నుండి 38 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి , ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా పెంచుతానన్న రూ .  5000/-లు వేతనం పెంచాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ,ఆరోగ్యబీమా సదుపాయం కల్పించాలి ,సెర్ప్ హెచ్ . ఆర్  ను వర్తింపచేయాలి ,సంఘాలకు వి ఎల్ ఆర్ వడ్డీలేని రుణాలు 10 లక్షల వరకు పొడిగించాలి ,చనిపోయిన విఓఏ కుటుంబాల సభ్యులకు ప్రమాద బీమా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో డోంగ్రీ తిరుపతి , క్రిష్ణ , శ్రీకాంత్ , రవి , శ్రీనివాస్ , ,శంకర్ ,చంద్రశేఖర్ ,ch తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Monday, 29 August 2016

ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను ఆధిరోహించా వచ్చు- కలెక్టర్

ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను ఆధిరోహించా వచ్చు- కలెక్టర్ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించి వచ్చని పరికిపండ్ల నరహరి అన్నారు . సోమవారం మధ్యప్రదేశ్ లోని ఇందూర్ కలెక్టర్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పేద కుటుంబానికి చెంది వారే ఉంటారని , ఉపాధ్యాయులు విద్యార్హులను ప్రోత్సహించి , వారిని అభివృద్ధి పరచాలని తెలిపారు. నేటి విద్యార్థులే భారత దేశానికి రక్షా అని తెలిపారు .  పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని , ఉపాధ్యాయులు వారికి చేయూత నివ్వాలని పేర్కొన్నారు .పలువురు నాయకులు కలెక్టర్ నరహరిని సన్మానించారు. ఈయన ఆలయ వారధి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు . ఈ ఫౌండేషన్ పేద విద్యార్థుల సహాయార్థం కోసమేనని అన్నారు .  ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి బాబురావు , ఎం పి  పి  సంజీవ్ కుమార్ , వైస్ ఎం పి  పి  రేణుక , ఎం ఈ ఓ వెంకటేశ్వరా స్వామి , తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి ,ఏ ఎం సి వైస్ ప్రసిడెంట్ కుందారపు శంకరమ్మ,  ప్రదానోపాధ్యాయురాలు స్వర్ణలత , ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు .  

ప్రమోషన్లు పొందిన రెవిన్యూ సిబ్బందికి సన్మానం

ప్రమోషన్లు పొందిన రెవిన్యూ సిబ్బందికి సన్మానం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ని రెవిన్యూ సిబ్బంది నలుగురిని తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ సోమవారం ఘనంగా సన్మానించారు . మండల కేంద్రములో విల్లెజ్ రెవిన్యూ అసిస్టెన్స్ గా గతా కొన్ని సంవత్సరాలుగా పనులు చేసి అధికారుల మన్ననలు పొందారు . దుర్గం దేవాజి, డోంగ్రి గణపతి , దుర్గం గంటయ్య , గోగర్ల రమేష్ లకు ఉన్నత పదవి గ్రామ కార్య దర్శిగా ప్రమోషన్ లు పొందారు . వీరిని పుష్ప గుచ్చ్చాలతో , శాలువాలతో రెవిన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు . ఈ సందర్బంగా తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలోని రైతుల సమస్యలను పకడ్బందీ గా తెలుసుకొని వారికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసి పెట్టాలని అన్నారు . వారు చేసిన సేవలను కొనియాడారు . ఈ కార్య క్రమములో డిప్యూటీ తహశీల్ధార్ రామ్మోహన్ రావు , సిబ్బంది యంలాల్ , శంకర్ జోహార్ , తదితరులు ఉన్నారు . 

పాసిగామ్ లో పశు వైద్యం

పాసిగామ్ లో పశు వైద్యం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం లోని  గంగపుర్ గ్రామా పంచాయత్ లోని పాసిగాం మరియు వరదలగూడెం లలో పశువైద్య శిబిరం నిర్వహించి 815 మేకలు మరియు 674 గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణి చేయడం జరిగింది. ముఖ్య అతిధిగా  సర్పంచ్ రవీందర్ గారు హాజరయ్యారు . మంచిర్యాల డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్  డా . కుమారస్వామి గారు నట్టల నివారణ మందు పంపిణి కార్యక్రమమును ఆకస్మిక తనిఖీ చేశారు . రైతులకు నట్టల నివారణ మందు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు . రైతులకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన చేకూర్చి వాటి నివారణ చర్యలను గూర్చి తెలియజేసారు . రైతులు  తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సరైన కాలంలో టీకాలు వేసుకొని పశువులను వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి అని తెలియజేశారు.

Sunday, 28 August 2016

ఇంట్లో ఎవరులేని సమయంలో యువతి పై అత్యాచారం

                       ఇంట్లో ఎవరులేని సమయంలో యువతి పై అత్యాచారం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఇంట్లో ఎవరులేని సమయంలో  ఇంటి పక్కనున్న తన మేనకోడలు పై బలవంతంగా అత్యాచారం చేసిన కీచకుడు మేనమామ పై యువతి తల్లిదండ్రులు రెబ్బెన పొలుసులకు పిర్యాదు చేశారు,  దింతో ఊట టీనా పోలీసులు కిష్టాపూర్ గ్రామానికి చేరుకొని సంఘటన స్థల పూర్వాపరాలను పరిశీలించారు.  అనంతరం సంఘటనకు పాల్పడ్డ గోలేటిరామయ్య పై కేసు నమోదు చేసిన్నట్లు సి ఐ కర్ణాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే  శనివారం రోజు రామ చంద్రయ్య వారి భార్యతో పొలం పనులకు వెళ్లగా తన ఇంటిపక్కనే ఉన్న గోలేటి రామయ్య 38 సంవత్సరాల వ్యక్తి పక్కనే ఉన్న చంద్రయ్య ఇంట్లో ఎవరు లేరనే విషయాన్నీ గమనించి, చంద్రయ్య రెండవ కూతురైన మానసిక వికలాంగురాలి పై బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు, దింతో పోలీసులు  ఐపీసీ 376 ప్రకరం నిందుడిపై కేసు నమోదు చేస్తున్నట్లు మరియు  నిందుతుడు పరారీలో ఉన్నట్లు  తాండూర్  సి ఐ కర్ణాకర్  తెలిపారు.

Saturday, 27 August 2016

మార్కెట్ కమిటీ అధ్యర్యంలో పశువైద్య శిబిరం

మార్కెట్ కమిటీ అధ్యర్యంలో పశువైద్య శిబిరం 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో నక్కలా గూడెం లో పశు వైద్య శిబిరాన్ని శనివారం ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ  ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది పశు వైద్య  శిబిరం నిర్వాయించారు.  గ్రామపంచాయితిలో  వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా 290ఆవులకు జబ్బ వాపు టీకాలు ,118 గేదెలకు గొంతు గురుక టీకాలు,252 మేకలకు నట్టల మందు,లివర్ టానిక్ ఎవ్వడమైంది . ఇందులో 60 మంది రైతులు ఇట్టి వైద్య సేవలను పొందారు మొత్తం 660 పశువులకు పశు వైద్యాది కారి అన్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ గంధం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 మండలాలు గలవు ప్రతి మండలం లో ఒక్కొక్క పశు  వైద్య శిబిరము నిర్వహించుటకు గాను మార్కెటింగ్ శాఖ వారు నిధులు మంజూరి ఎవ్వడమైంది . ఇట్టి అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాలని సూచించారు.మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పశు వైద్య సేవలను పొందుచు పశువులను సంరక్షించుకున్నప్పుడే వాటిని వ్యవసాయంలో వినియోగించుకొనే వీలవుతుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ రావ్ ,గ్రామా సర్పంచ్ పెసర వెంకటమ్మ , పి .ఏ .సి . ఎస్ డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ  పశువైద్యాధికారి సాగర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీ తోట విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 25 August 2016

మత్సకారుల హక్కుల తో పాటు ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలి

మత్సకారుల హక్కుల తో పాటు  ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని అలాగే మత్సకారుల హక్కులను కల్పించాలని తెలంగాణ ముదిరాజ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కలపల్లి వెనకటేశ్వర్లు అన్నారు   గురువారం రెబ్బెన మండలంలోని అతిధి గృహం లో రెబ్బెన ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షలు పెసరు మధునయ్య ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ముదిరాజ్ బంధువుల ఆత్మీయ సదస్సు లో కొరివి కృష్ణస్వామి 123వ జయంతిని జరుపుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బిసిడి గృపు లొంచి ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని  అన్నారు  మత్స కారులకు సబ్సిడీ రుణ సదుపాయం,భీమా పథకం వర్తిస్తుంది అని అన్నారు ఉపాధి పనులు కల్పించాలని అన్నారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో చేపల పెంపకాన్ని పెంచవచ్చు అని, ముదిరాజ్ సంఘం ద్వారా ఉపాధి పొందవచ్చునని అన్నారు. హరితహారంలో  ముదిరాజులు ముందుండి విజవంతం చేశారు మత్సశాఖ సంచాలకుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ నిర్మల్ వారికీ సమష్యలు తెలపటం జరిగింది కావున ఇతరులు చెరువులలో చేపలు వేసిన, అనాదికారికంగా ఎలాంటి చర్యలు తీసుకున్న అవి చెల్లవని అధికారికంగా మత్సశాఖవారు ముదిరాజులకు హక్కులు కల్పించే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే సమష్యలు అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి పేట మల్లయ్య , గోలేటి అధ్యక్షుడు ఎర్రం మల్లేష్, ముదిరాజ్, కార్యదర్శి పిల్లి మధు ముదిరాజ్ ,చిత్రగుప్తుడు, కాలివేణి రాజెందర్ ముదిరాజ్, మూడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్, సందీప్ కుమార్, పోతిరెడ్డి రమేష్, లక్ష్మణ్, స్వామి, మహేష్ మూడెడ్ల రమేష్, రాజు, సాయి, రాజేష్  టి రాజయ్య, డి కనకరాజు    తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి - బోగే ఉపేందర్

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి - బోగే ఉపేందర్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వెతిరేక విధానలను, దోపిడీ బానిసత్వ విధానాలకు వ్యతిరేకం గా సెప్టెంబర్ 2న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని గురువారం ఏ ఐ టి యూ సి  బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. దేశం లో రాష్ట్రము లో పని చేస్తున్న కార్మికులకు కనీసవేతనం 18వేలు ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్టు ఔట్  సోర్సింగ్ లను రద్దు చేసి రెగ్యులర్  చేయాలనీ అన్నారు. పనితో కూడిన సమన వేతనం ఇవ్వాలన్నారు కేంద్ర ప్రభుత్వ స్కిం లలో  పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణను నిలిపివేయరన్నారు. ప్రభుత్వ కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటాల అమ్మకాన్ని ఆపాలన్నారు. 45రోజుల్లో కార్మికుల సంఘాల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. మాట్లాడుతూ ప్రభుత్వ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా దోపిడీ, బానిసత్వ విధానాలను అవలంభిస్తుందన్నారు. ప్రజల ఐక్యత, దేశ సమగ్రతల పరిరక్షణకై సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తుందన్నారు. ఈ సమ్మె అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Wednesday, 24 August 2016

క్లోరినేషన్ లోపముతో తండాలో విష జరాలు


క్లోరినేషన్ లోపముతో తండాలో విష జరాలు 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వర్ష కాలంలో మురికి కాలువలు శుభ్రం చేయకుండా ఉన్నందున రెబ్బెన మండలంలో గోలేటి గ్రామ పంచాయతీ లో ని గొల్ల గూడా , కైరిగూడ మొదలగు తండాలలో సీజనల్ వ్యాధులతో విష జరాల బారిన తండావాసులు పడుతున్నారని వి టి డి ఏ మండల వైస్ చేర్మెన్ బానోత్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు తండాలలో మురికి కాలువలకు క్లోరినేషన్ , బావులు , చేతి పంపులు లకు బ్లీచింగ్ పౌడర్ చెల్లకుండా ఉన్నందు వల్లనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి  చిత్ర పటానికి పాలాభిషేకం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  భారత్ జెనాథ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గోదావరి బ్యారేజీలపై తెలంగాణ ముఖ్యమంత్రి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒపందాలు కుదిరినందుకు రెబ్బెన బి జెపి నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మహారాష్ట్ర గవర్నర్ చిత్ర పటానికి  బుధవారం పాలాభిషేకం చేసారు సహక రించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  బిజెపి మండల అధ్యక్షుడు కె బాలకృష్ణ , టౌన్ అధ్యక్షుడు యం మధుకర్ , ప్రధాన కార్యదర్శి జి చక్రపాణి  , శాఖ అధ్యక్షులు  పి మల్లేష్ తదితరలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య అధికారి లేక ఇబందులు

ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య అధికారి లేక ఇబందులు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య అధికారి లేక ప్రజలు ఇబంది పడుతున్నారని జె యం బి గిరిజన సేవ సంఘ్  ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్  ఒక ప్రకటనలో తెలిపారు గత కొన్నిరోజులుగా ఆసుపత్రికి వైద్యులు రాక మండల ప్రజలు తీర్వ ఇబందులు పడుతున్నారని, బుధవారం ఉదయం గంగాపూర్ నుండి ఓ మహిళ ప్రసవవేదనతో రాగ ఆసుపత్రి సిబంది ఉన్నత వైద్య అధికారి లేరు మరియు  ఆసుపత్రిలో సరియయిన మౌలిక సదుపాయాలు లేవని పంపించేశారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి శాశ్వత వైద్య అధికారిని నియమించి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు.  

గిరిజనులకు రాజంగంలో కలిపించిన చట్టాలను అమలు చేయాలి ; గిరిజన సేవ సంఘ్ ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్

గిరిజనులకు రాజంగంలో కలిపించిన చట్టాలను అమలు చేయాలి ;
గిరిజన సేవ సంఘ్  ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ఆదివాసుల గిరిజనులకు అన్నిరకాల ఉద్యోగాలు  ఇస్తు రాజంగంలో కలిపించిన గిరిజన చట్టాలను అమలు చేయాలని జె యం బి గిరిజన సేవ సంఘ్  ఆసిఫాబాద్ కన్వీనర్ చోవాన్ సంతోష్ అన్నారు బుధవారం ఆదివాసీ సమస్యలపై రెబ్బెన ఉప తహసీల్దార్ రాంమోహన్ రావు  కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఆదివాసి గిరిజనులను నిర్వహితులను చేసే టైగర్ జూన్ ఓపెన్ క్యాస్ట్ , బారి నీటిపారుదల ప్రాజెక్టులను వెంటనే రద్దు చేయాలి , జీ ఓ యం యస్ నంబర్ 3 ని అమలు చేస్తు అన్ని రకాల ఉద్యోగాలను ఆదివాసీ గిరిజనులకు మాత్రమే ఇవ్వాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తి స్థాయి వసతులు కల్పిస్తు అలాగే క్రొత్తగా ఏర్పడిన కొమరం భీమ్ జిల్లాలో గిరిజన కోసం ఐ టి డి ఎ ను ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సేవ సంఘ్  ఆసిఫాబాద్  కో కన్వీనర్ బానోత్ తిరుపతి, నాయకులు  సతీష్ , వినయ్ , శ్రీనివాస్ , సుబ్బారావు , కైలాష్ తదితరాలు ఉన్నారు.

విద్యార్థులకు బస్సు సౌకర్యం కలిపించాలి; పుదారి సాయికిరణ్

విద్యార్థులకు బస్సు సౌకర్యం కలిపించాలి; పుదారి సాయికిరణ్ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బన మండల కేంద్రం నుండి జక్కులపల్లి గ్రామానికి మధ్యాహ్నం వేళలో ఆర్ టి సి బస్సు నడపాలని , గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ఎ ఐ ఎస్ ఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయికిరణ్ అన్నారు . అఖిల భారత విద్యార్థి సమాఖ్య అద్వర్యం లో రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ కు వినతి అందజేశారు . అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఉదయం పాఠశాల మధ్యాహ్నం వేళలో కళాశాల నడపడం వలన విద్యార్థులు జక్కులపల్లి నారాయణపూర్ కిష్టాపూర్ కొమురవెల్లి గ్రామాల నుండి విద్యార్థులు సుమారు వందమంది ఉదయం పూట బస్సు లో రావడం జరుగుతుందని తిరుగు ప్రయాణానికి బస్సు లేకపోవడం వళ్ళ విధ్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ వాహనాలను ఆశ్రహించడం వలన ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు . కళాశాలలో మద్యాహ్న భోజన పధకం అమలులో లేనందున ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొన్నదని విద్యార్థుల సమస్యను అర్ధం చేసుకొని ఆర్ టి సి బస్సు నడిపించేలా కృషి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలనీ అన్నారు.ఈ దారుల్లో బస్సు ప్రయాణించడం వలన విద్యార్థులతో పాటు పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు . ఈ కార్యక్రమాం లో ఎ ఐ ఎస్ ఫ్ మండల నాయకులు పడాల సంపత్ జాడిసాయి శేఖర్ సందీప్ విద్యార్థులు పాల్గొన్నారు .    

Sunday, 21 August 2016

మాజీ మంత్రి విగ్రహ స్థాపనను అడ్డుకొవడం సరి కాదు ; జడ్పీటీసీ అజమేరా బాపూరావు


 మాజీ మంత్రి  విగ్రహ స్థాపనను అడ్డుకొవడం సరి కాదు ; జడ్పీటీసీ అజమేరా బాపూరావు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); స్వర్గీయ మాజీ మంత్రి కోట్నక్ భీం రావు విగ్రహ స్థాపనను అడ్డుకొవడం  సమంజసం కాదని రెబ్బెన జడ్పీటీసీ సభ్యుడు అజమేరా బాపూరావు అన్నారు . ఆదివారం రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మాజీమంత్రి కోట్నక్ భీం రావు పేద బడుగు బలిహి నగిరిక   ప్రజల కోసం  ఆనాడుఎంతో సేవ చెసారని మహనీయుల విగ్రహ స్థాపనకు అనుమతులు కావాలని సాకుతో అడ్డుపడడం  సరికాదని అలాగే  ఆసిఫాబాద్ లో  అనుమతులు జారీ చేసి విగ్రహ స్థాపనకు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో సర్పంచులు పేసరి వెంకటమ్మ ,భీమేష్ ,తెరాస మండల అధ్యక్షులు పోటు  శ్రీధర్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్, తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ , గుడిసెల వెంకన్న గౌడ్ ,దుర్గం సోమయ్య ,నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Thursday, 18 August 2016

రాఖీ తో సోదర భావం పెరుగుతుంది ;ఏమ్మెల్యే కోవా లక్ష్మి

రాఖీ తో సోదర భావం పెరుగుతుంది ;ఏమ్మెల్యే కోవా లక్ష్మి


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాఖీ పౌర్ణమి సందర్బంగా ఆసిఫాబాద్ ఏమ్మెల్యే కోవా లక్ష్మి ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ రాఖీ కట్టి చిన్న నాటి  బంధాన్ని  గుర్తింపుగా రాఖీతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే  కోవ లక్ష్మి మాట్లాడుతూ ఈ రాఖీ బంధాన్ని సోదర భావం తో ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదర భావం తో అక్క చెల్లెలా అన్న తమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయని అంటనికి ఈ రక్షా బంధానికి  నిదర్శనంమని అన్నారు. దూర ప్రాంతాలనుంచి అక్కాచెల్లెళ్లు ఇల్లాలకు చేరి  అన్నతమ్ములుతో పండగ రోజున సుఖ సంతోషాలతో వుంటారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366జయంతి ఘన వేడుకలు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366జయంతి ఘన వేడుకలు  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన లోని అర్అండ్ బీ అతిదీ గృహంలో  గురువారం నాడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366 జయంతి పురస్కరించుకొని  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణా గౌడ సంఘ జిల్లా ఇంచార్జి కే.అంజనేయుల గౌడ్ మాట్లాడుతూ  ఆనాటి మొగలుల కలం లో పంటల పై వేసే పన్ను కంటే కళ్ళు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బి.సి కులాలు దళిత వర్గాలు ఏకం చేసి జమిందారులు, సుబెదరులు ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్న ది  అన్నారు.ఈ  కార్యక్రమం లో ముక్య అతిధి గా జడ్పీటీసీ బాబురావు  మరియు రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ,ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఆసిఫాబాద్ నియోజక కన్వేయర్ మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఉపసర్పంచ్ బొమినేని శ్రీధర్కుమార్, మండల యువజన గౌరవ అధ్యక్షులు  అన్నపూర్ణ శాంతి కుమార్ గౌడ్,జిల్లా కోశాధికారి కొయ్యడ రాజగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు మహేష్ గౌడ్, యువజన మండల అధ్యక్షులు  మడ్డి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి నారాయణ గౌడ్ ,   బొంగు నరసింగ రావు,డైరెక్టర్ మధనయ్య  ,ఆసిఫాబాద్ మార్కెట్ డైరెక్టర్ పళ్ళ రాజేశ్వర్ , తెరాస టౌన్ ఆద్యషుడు రాపర్తి అశోక్ , బొమ్మినేని సత్యనారాయణ ,గౌడ సాంగ నాయకులూ గుడిసెల వెంకటేశ్వర్ గౌడ్ , తాళ్లపల్లి కృష్ణ గౌడ్ ,తాళ్ల శ్రీనివాస్ గౌడ్,  తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు.

Wednesday, 17 August 2016

కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు వి ర్ ఏ ల సమస్యలపై వినతి

  కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు వి ర్ ఏ ల సమస్యలపై వినతి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ , కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2016, సెప్టెంబర్ 2 న దేశ వ్యాప్త సమ్మె చేయాలనీ కేంద్ర కార్మిక సంగాల , ఉద్యోగ ఫెడరేషన్లు , ప్రభుత్వ రంగ సంస్థలు ఐక్యంగా ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 2 రెబ్బెన వి.ర్.ఏ లు సమ్మెచేయనున్నారని బుధవారం  స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో ఉప తహసీల్దార్ రామ్ మోహన్ రావు కి వినతిపత్రం సమర్పించారు . అనంతరం సి ఐ టి యూ సి జిల్లా   కమిటీ సభ్యులు కృష్ణమ చారి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని వి . ర్ ఏ ల కు కనీస వ్యత నం నెలకు 18, 000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అర్హత కలిగిన వారికీ ప్రమోషన్ లు  ఇవ్వాలని పి . ఎఫ్ , ఈ . ఎస్ . ఐ ,బోనస్ చట్టాలను అమలు చేసి అందరికి పెన్షన్ అందేలా చూడాలన్నారు . ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డివిజన్ వి. ర్ . ఏ  ల అధ్యక్షులు ఎస్ . డి.  అఙ్గార్  అలీ , వి . ర్ ఏల సంఘము  అధ్యక్షులు కే . వెంకటేశం వి . ర్ ఏలు పోషమల్లు , నానయ్య , రాజలింగు , రాజు , తిరుమల  లు తదితరులు పాల్గొన్నారు . 

లారీ ఓనర్ అసోసియేషన్ సమావేశం

లారీ ఓనర్ అసోసియేషన్ సమావేశం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బనలో శ్రీ వెంకటేశ్వర లారీ ఓనర్ అసోసియేషన్ సమావేశం ఆరు మండలల యాజమాన్యం సమక్షములో బుధవారం నాడు జరుగిది. లారీ ఓనర్  అధ్యక్షులు పి.వి  దుర్గ రావు మాట్లాడుతూ ప్రస్తుతంగుత్తేదారులు ఇస్తున్న రేట్లు డ్రైవర్ జీతాలు ,ఫైనాన్స్ కి సరిపోవడం లేదు.పెరిగిన లారీల యొక్క పనిముట్ల ధరలు లారీల యజమానులు భారం అవుతున్నాయి.కావున పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి రేట్లు పెంచడం జరుగుతుందనన్నారు  గుత్తేదారులు యాజమాన్యం సమస్యలపై మరియు అసోసియేషన్ వారుఏర్పాటు చేసిన గిట్టు బాటు రేట్లపై  నిర్ణయాలు తీసుకొన్నారు.  ఈ సమావేశానికి తిర్యాణి ,రెబ్బెన ,ఆసిఫాబాద్ , కాగజ్ నగర్ ,తాండూర్ , బెల్లంపలికి   ఆరు మండలాల లారీ యజమాన్యులు  కే . రత్నాకర్ రావు,ఉప్పు రాజ్ కుమార్ , గాజుల దేవయ్య ,ఇడిదినేని తిరుపతి ,నవీన్ జైస్వాల్ ,పోటు శ్రీధర్ రెడ్డి ,చక్రపాణి ,తిర్యాణి రాజయ్య ,సిరంగి శంకర్ ,బంకప్రసాద్ ,మండల ప్రసాద్ తోపాటు తదితరులు పాల్గొన్నారు . 

బేషరతుగా వేతనాలు చెల్లించండి --ఎహ్ ఎం ఎస్

బేషరతుగా వేతనాలు చెల్లించండి --ఎహ్ ఎం ఎస్



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణా ఉద్యమము  సందర్హంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నా అత్యవసర విధులు నిర్వహించిన సంగరేణి కార్మికులకు వేంటనే వేతనాలు చెల్లించాలని ఎహ్ ఎం ఎస్ సెంట్రల్ ఉపాధ్యాక్షుడు టి మణిరామ్ సింగ్ అన్నారు . మంగళ వారము నాడు గోలేటి లోని సివిల్ డిపార్ట్ మెంట్ ముందు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు . అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అత్యవసర విధులు నిర్వహించే కార్మికులు లేకుంటే సింగరేణి సంస్థకు కోట్లలో నష్టం వాటిల్లదని పేర్కొన్నారు . తప్పకుండ వేతనాలు చెల్లించాలని అన్నారు . ఈ కాయక్రమములో నాయకులు ఖాదర్ , సుదర్శన్ , జీవం జోయల్ ఆంజనేయులు గౌడ్ లు ఉన్నారు . 

గోలేటి రజక యువజన సంఘ కార్యవర్గ ఎన్నిక

గోలేటి రజక యువజన సంఘ కార్యవర్గ ఎన్నిక 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలం లోని గోలేటి గ్రామం లో మంగళవారం నాడు యువజన రజక సంఘ కమిటీ ఎన్నుకోవడం జరిగింది  అని రాష్ట్ర రజక సంఘ అధ్యక్షలు కడ్తాల మల్లయ్య తెలిపారు . యువజన అధ్యక్షలు గా జనగామ విజయ్ కుమార్ ని ఉప అధ్యక్షలు గా సాయి కిరణ్ ప్రధాన కార్యదర్శి గా రంజిత్ కుమార్ కార్యదర్శిగా అజయ్ కోశాధికారి గా రవీందర్ ప్రచార కార్యదర్శి గా సీతారాం అలాగే కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు

ఎబివిపి విద్యార్ధి సంఘ నాయకులు నల్లా బ్యాడ్జ్ లతో నిరసన

ఎబివిపి విద్యార్ధి సంఘ నాయకులు నల్లా బ్యాడ్జ్ లతో నిరసన 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఏబీవీపీ విద్యార్ధి సంగం నాయకులూ మంగళవారం రెబ్బెన లో అంబెడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో  నిరసన వ్యక్తం చేసారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు ఎంసెట్ పేపర్ లీకేజ్ కు కారణమైన వాళ్ళని శిక్షించాలని, ప్రభుత్వం  విద్యార్థులకు   ఫీజు రేయింబర్సమెంట్  వెంటనే అమలు చేయాలనీ లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ఏబీవీపీ మండల్ కన్వేయర్ అరుణ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా నాయకులూ సాయి,శ్రీకాంత్,అనిల్, తదితరులు పాల్గొన్నారు .   

మహిళా విభాగం నుంచి కుంధారపు శంకరమ్మకు ఘనసన్మానం

 మహిళా విభాగం నుంచి కుంధారపు శంకరమ్మకు ఘనసన్మానం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ ప్రభుత్వం లో గత 12 సం నుంచి మహిళా విభాగం నుంచి చురుకుగా కార్యనిర్వహణ పాల్గొనటంవలన ప్రభుత్వం గుర్తించి కుంధారపు శంకరమ్మకు ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం  సంతోషకరమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ జే బి ప్రమీల న్యాయవాది అన్నారు.  రెబ్బెన లో  ఆమె స్వగృహం నందు  మంగళవారం  కుంధారపు శంకరమ్మకు  ఘనసన్మానం చేశారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించి యీలాంటి మరెన్నో పదవులు రావాలని మహిళా విభాగం నుండి కోరుకుంటున్నారు .  ఈ  సందర్బంగా జంపల్లి భారతి , కనకలక్ష్మి ,రాజేశ్వరి , సుజాత , స్వరూప , పద్మ , లతా , రజిత,అమృత,పోషమ్మ ,మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. 

Monday, 15 August 2016

ఐడియా నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్ వారు విద్య సామాగ్రి పంపిణి


ఐడియా నెట్వర్క్  డిస్ట్రిబ్యూటర్ వారు పేద విద్య సామాగ్రి పంపిణి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రెబ్బెన మండలంలోని పులికుంట గ్రామంలో మండల పరిషత్ పాఠశాల లో ఐడియా నెట్వర్క్  డిస్ట్రిబ్యూటర్ వారు  నటరాజ్ చేతుల మీదగా  పేద విద్యార్థులకు పుస్తకాలూ ,నోట్ బుక్స్ ,పెన్నులు ,పెన్సిళ్లు ,రబ్బర్లు ,చాక్ మార్ లు పంపిణి చేసారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత అబ్యాసంలో అగ్రస్థానాన్ని చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్.ఎం.సి చైర్మన్ టి.పోశన్న,ప్రధాన ఉపాద్యాయుడు టి.శ్రీనివాస్ ,ఉపాద్యాయుడు బి.శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్తులు బుర్సా పొసమల్లు ,టేకం బీమయ్య తదితరులు పాల్గొన్నారు.

గుప్త నిధుల కలకలంతో అధికారుల పరిశీలన

గుప్త  నిధుల కలకలంతో అధికారుల పరిశీలన


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములోని ఎల్లమ్మ చెరువు క్రింద గుప్తా నిధులు దొరికినట్లు ఆదివారము కలకలం రేగిన విషయం అందరికి తెలిసినదే. రెబ్బెన గ్రామములోని ఎల్లమ్మ చెరువు క్రింద రెండవ విడుత మిషిన్ కాకతీయ  పనులలో ప్రొక్లైన్లలతో చెరువు కట్టాదిగువన  మట్టిని తోడుతూ ఉండగా రెండు బిందెలు దొరికినట్లు గ్రామస్తులు అనుకుంటుండగా పత్రికలలో వచ్చినా  కథానానికి స్పందించిన  తహశీల్ దార్ బండారి రమేష్ గౌడ్ ఎస్.ఐ దారం సురేష్ లు గుప్తా నిధులు దొరికాయి అని భావిస్తున్న ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు ఆప్రాంతంలో దొరికినటువంటి కుండా పెంకులు డంగు సున్నం ను సేకరించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు గ్రామస్థుల కథనం ప్రకారం గత మార్చి నెలలో ప్రొక్లైన్లతో పాత చెరువు కట్ట కింద మట్టి తోడుతూ ఉండగా ఆయాకట్టు రైతులు అడ్డు పడి  సబ్ కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ఐన కానీ సదరు కాంట్రాక్టరు, ఇరిగేషన్ జూనియర్ ఇంజనీర్ వినకుండ  చెరువు కట్ట దిగువన మట్టిని  తోడించినట్లు రైతులు తెలిపారు.చెరువు కట్ట దిగువన పంటలు వేస్తున్న రైతులకు డంగు సున్నం తో కఠిన కట్టడాలు కనబడటంతో ఆ ప్రాంతంలో గుప్తా నిధులు దొరికి ఉంటాయని అనుకుంటున్నారు ఆ నోటా ఈ నోటా అనుకుంటూ ఉండగా   డంగు సున్నముతో ఆనవాలు కనబడుతున్న ప్రదేశానికి సోమవారం ప్రజా ప్రతినిధులు చెరువు కట్టకు వెళ్లి డెంగు  సున్నముతో ఉన్నా గోలేములను చూసి గుసగుసలు చెప్పు కుంటున్నారు. మిషన్ కాకతీయ  . చెరువు కట్టపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.      

మన చేయూత ఫౌండేషన్ వారు పుస్తకాలు పంపిణి


మన చేయూత ఫౌండేషన్ వారు పుస్తకాలు పంపిణి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ''మన చేయూత ఫౌండేషన్ -రెబ్బెన '' ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆగష్టు 15 సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 6వ తరగతి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ ,గణిత ,సామాన్య ,సాంఘిక  పాఠ్య పుస్తకాలు పంపిణి చేసినట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. మండలంలోమరిన్ని సేవ కార్యక్రమాల్లో ముందుంటామన్నారు . ఈ మన చేయూత ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఎమ్ . దేవేందర్ ,ఎ. పాపయ్య ,సునీల్ ,మహేందర్, సందీప్, సమీర్, జమీర్, మహేష్ లు  ఉన్నారు.

రెబ్బెనలో జెండా వేడుకలు

రెబ్బెనలో జెండా వేడుకలు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని తహశిల్దార్ కార్యలయంలో  సోమావారం ఎమార్వో రమేష్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఆయన ఈ సందర్భంగా 70వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ఎస్సై డి . సురేష్  ఆధ్వర్యంలో  భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ ,ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్.జడ్పిటిసి బాబురావు తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు. అలాగే మండలంలోని కార్యాలయాలలో జెండాలు ఎగరవేశారు గోలేటి బెల్లంపల్లి ఏరియా లోని జీఎం రవిశంకర్ జెండాను ఎగరవేశి కార్మికులు ,కార్మికుల కుటుంబాలకు  70వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

Sunday, 14 August 2016

రెబ్బెనలో గుప్త నిధుల కలకలం ........ ?

రెబ్బెనలో గుప్త  నిధుల కలకలం ........ ?



Add caption

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మందలములోని ఓ చెరువు క్రింద గుప్తా నిధులు దొరికినట్లు ఆదివారము కలకలం రేపింది . రెబ్బెన గ్రామములోని ఎల్లమ్మ చెరువు క్రింద రెండవ విడుత మిషన్కాకతీయ పనులలో ప్రొక్లైన్లలతో చెరువు కట్టాను తోడుతూ ఉండగా రెండు బిందెలు దొరికినట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు . గత మార్చి నెలలో ప్రొక్లైన్లతో పాత   చెరువు కట్టాను తోడుతూ ఉండగా ఆయా కట్టు రైతులు అడ్డు పడి  సబ్ కలెక్టర్ కు పిర్యాదు చేశారు . ఐన కానీ సదరు కాంట్రాక్టరు, ఇరిగేషన్ జె యి వినకుండ  చెరువు కట్టాను తోడించినట్లు రైతులు ఆరోపించారు. అక్కడ డంగు సున్నముతో కట్టించినట్లు 2 గోలేములు తీసినట్లు ఆనవాలు కనబడుతున్నాయి . దీంతో ఆది వారం రెబ్బెన ప్రజలు తండోపతండాలుగా చెరువు కట్టకు వెళ్లి డెంగు  సున్నముతో ఉన్నా గోలేములను చూసి గుసగుసలు చెప్పు కుంటున్నారు . మిషన్ కాకతీయ  . చెరువు కట్టపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు .               

17న ఓనర్ అసోసియేషన్ సమావేశం

17న ఓనర్ అసోసియేషన్ సమావేశం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నెల 17వ తేదీన శ్రీ వెంకటేశ్వర లారీ ఓనర్ అసోసియేషన్ వారు సమావేశం జరుగుతున్నట్లు ఓనర్  అధ్యక్షులు పి.వి  దుర్గ రావు ఒక ప్రకటనలో తెలిపారు . 17న జరిగే సమావేశంలో యాజమాన్యం సమస్యలపై మరియు అసోసియేషన్ వారుఏర్పాటు చేసిన గిట్టు బాటు రేట్లపై  నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి తిర్యాణి ,రెబ్బెన ,ఆసిఫాబాద్ , కాగజ్ నగర్ ,తాండూర్ , బెల్లంపలికి   ఆరు మండలాల లారీ యజమాన్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

జయ శంకర్ ఆశయాఅభివృద్ధిని సాదిద్దాం ;కోదండరాం

 జయ శంకర్  ఆశయాఅభివృద్ధిని సాదిద్దాం ;కోదండరాం

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రత్యేక  తెలంగాణ  సాధించుకున్న అన్నివర్గాల  అభివృద్ధి కొరకు జయశంకర్ ఆశయాలను నెరవేరుద్దామని ప్రొపెసర్ కోదండరాం అన్నారు. రెబ్బెన అతిధి గృహంలో జె.ఏ .సి విద్యావంతుల ఏర్పాటు చేసిన  ప్రో . జయశంకర్ జయంతి సదస్సు లో ముఖ్య అతిధిగా జె . ఏ  .సి చైర్మన్ ప్రో. కోదండరాం మాట్లాడారు.ప్రత్యేక  తెలంగాణ  సాధించుకుని రెండు సంవత్సరాల నాలుగు నెలలు కవస్తాస్తున్న అన్నివర్గాలకు సమన్యాయం జరగట్లేదు అని , జయశంకర్ ఆశయాలను విద్యావంతులు , మేధావులు ముందుకు నడచి  నెరవేర్చాలని అన్నారు . తెలంగాణ మూడు తరాల ఉద్యమానికి ముందు నడిచి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ,నిధులు,నియామకాలలో జరిగిన అన్యాయాలను ఎదురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo సాదించుకున్నాము.విద్య, ఆరోగ్యం , వ్యవసాయం పరిశ్రమలు అభివృద్ధి ఏర్పాటు కై విద్యావంతులు , మేధావులు విద్యార్ధిసంఘ నాయకులూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి జారవేయాలి . అలాగే నిరోద్యగా యువతీ యువకులకు ఉద్యోగాలను కల్పించాలి ,సింగరేణిలో ఓపెన్ కాస్ట్ విధానాన్ని తొలగించి నిరోద్యుగులకు ఉపాధి కల్పించేలా భూ అంతర గనులను ప్రోత్సహించి నిర్వహించాలి . అలాగే సింగరేణి యాజమాన్యం పరిసర ప్రాంత గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు. ఈ సందర్బంగా విద్యావంతులు , ఉద్యమకారులు సంఘo అధ్యక్షులు దుర్గం రవీందర్ ఉద్యమకారులను ఆదుకోవాలని అన్నారు . అదే విదంగా సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను పునురుద్ధరించాలని సింగరేణి సన్స్  అండ్ అసోసియన్ అధ్యక్షులు మల్లికార్జున  వినతి పత్రం ఇచ్చారు . జిల్లాల విభజన జరుగుతున్న సంగర్భాంగా నల్గొండ, వరంగల్ జిల్లాలో ఏదైనా ఒకదానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని రాష్ట్ర రజాకారుల సంగం అధ్యక్షులు కడతల మలయ్య వినతి పత్రం సమర్పించారు. టి.వి.వి. రాష్ట్ర అధ్యక్షులు గురజాల రవీందర్ , టి.వి.వి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చంద్రశేఖర్, టి.వి.వి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్.కమల్,టి.వి.వి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం విస్తారు, టి.వి.వి జిల్లా మహిళా కన్వినర్ ఎస్.లక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్ధి సంఘల నాయకులూ, మేధావులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 13 August 2016

వెదురు బొంగుల వ్యాన్ పట్టివేత

వెదురు బొంగుల వ్యాన్ పట్టివేత
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలంలో కొండపల్లి  గ్రామం ప్రధాన రహదారి నందు    గురువారం  రాత్రి   ఏ పి 01వై 9044 నంబర్ గల వ్యాన్ ను  పటుకునట్లు బీట్ ఆఫీసర్ ఆతరుద్దీన్ తెలిపారు.  బీట్ ఆఫీసర్ తెలిపిన వివరాలు ప్రకారం బబాపూర్ నుంచీ కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వైపు వస్తుండగా ఆసిఫాబాద్ చెక్ పోస్టులో అడవి సిబ్బంది ఆపడానికి ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోయిన వెదురు బొంగుల వ్యాన్  వాహనం అటవి శాఖా సిబంది తెలిపిన సమాచారం ప్రకారం కొండపెల్లి గ్రామ సమీపంలో కాపుకాసి పట్టుకున్నామని బీట్ ఆఫీసర్ తెలిపారు.

ఎ బివిపి రెబ్బెన మండల కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్

ఎ బివిపి రెబ్బెన మండల కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్ 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యావ్యవస్థను ప్రభుత్వ మే భ్రష్టు పట్టిస్తుందని ఎ బివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంజిత్ కుమార్ అన్నారు. ఎ బివిపి జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సమావేశానికి జిల్లా కన్వీవీనర్ చిలుముల కృష్ణ దేవరాయలు ఆడ్తక్షత వహించారు ఈ సందర్భంగా రెబ్బెన మండల కాన్షినర్ జుమ్మిడి అరుణ్ కుమార్ ను ఎ నుకోవడం జరిగింది ఈ సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు విద్య సమస్యలపై నిరంతరం పోరాడుతాం అన్నారు అలాగే  కృతజ్ఞతలు తెలిపారు.

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ; దుర్గం రవిందర్

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ; దుర్గం రవిందర్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని దుర్గం రవిందర్ అన్నారు  అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ ఐ ఎస్ ఎఫ్ )81వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం  నాడు రెబ్బెన బసు ప్రయాణ ప్రాంగణంలో జెడ ఆవిష్కరణ  చేశారు. అనంతరం ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ మాట్లాడుతు సమశీల ఉద్యమాల సారథి విద్యార్ధి లోకానికి స్ఫూర్తి , చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు సాగె  ఎ ఐ ఎస్ ఎఫ్  81వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నామన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వవలు అవలంబిస్తున్న విద్యావ్యతిరేక ద్వాంద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని , అందరికి సమాన విద్య , ఉచితవిద్య అందించాలని పాలకులు పేద , బడుగు , బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షల మార్చారని , ప్రభుత్వ విద్యాసంస్థలలో సౌకర్యాలు కల్పించకుండా పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాల లను రేషనైలేజేషన్ పేరుతో మూసివేస్తామని పాలకులు అనడం సమంజేశం కాదని వారు అన్నారు  రాష్ర్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని విద్య సవంత్సరం మొదలై 3 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు అమలు చేలేదని కేవలము హామీలకే పరిమితమయ్యాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని నెపంతో రేష్నయిలెజం చేసి మూసివేస్తున్నారని ప్రయివేటు విద్యాసముస్థలలో అధిక ఫీజులను  అరికట్టాలని, అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజినల్ కార్యదర్శి పుదారి సాయి అధ్యక్షులు కె రవికుమార్ , ఉపాధ్యక్షులు శేఖర్ ,   మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ నాయకులు సంపత్ , సందీప్ , గౌతమ్,  సాయి , రాజు , తిరుపతి , శ్రీనివాస్ , మహేష్  కళాశాల విద్యార్థులు తదితరాలు పాల్గొన్నారు. 

Friday, 12 August 2016

ఎ ఐ ఎస్ ఎఫ్ 80వ వార్షికోత్సవంని ఘనంగా జరుపుకోవాలి ; దుర్గం రవిందర్

ఎ ఐ ఎస్ ఎఫ్ 80వ వార్షికోత్సవంని ఘనంగా జరుపుకోవాలి ; దుర్గం రవిందర్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎ ఐ ఎస్ ఎఫ్ )80వ వార్షికోత్సవం ముగింపు ఉత్సవాల గోడ పతులు ను గురువారం నాడు రెబ్బెన  జూనియర్ కళాశాలలో విడుదల చేశారు అనంతరం ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ మరియు డివిజినల్ కార్యదర్శి పుదారి సాయి మాట్లాడుతు సమశీల ఉద్యమాల సారథి విద్యార్ధి లోకానికి స్ఫూర్తి , చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు సాగె  ఎ ఐ ఎస్ ఎఫ్  80వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు రాష్ర్ట్ర ప్రభుత్వం కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని విద్య సవంత్సరం మొదలై 3 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు అమలు చేలేదని కేవలము హామీలకే పరిమితమయ్యాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని నెపంతో రేష్నయిలెజం చేసి మూసివేస్తున్నారని ప్రయివేటు విద్యాసముస్థలలో అధిక ఫీజులను  అరికట్టాలని, అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు మహిపాల్ నాయకులు సంపత్ , సందీప్ , గౌతమ్ , కళాశాల విద్యార్థులు తదితరాలు పాల్గొన్నారు.

Tuesday, 9 August 2016

వాగు కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

వాగు కుంటలో  పడి ఇద్దరు చిన్నారులు మృతి 



ఇద్దరు విద్యార్థులు పి లక్ష్మి (7) జి శిరీష (8) 3 తరగతి చదువుతున్న వీరు  ఆడుకోవడానికి వెళ్లిగా  వాగు కుంటలో పడి చనిపోవడంతో  రెబ్బెన మండలంలోని కొండపెల్లి  గ్రామపంచాయితీలోని నేర్పెల్లి  (మద్దికుంట) గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఉపాద్యాయుడు నాగరాజు మండల ఉపాధ్యాయ సమావేశం కొరకు విద్యార్థులను 12గంటలకే మధ్యాహన భోజనం కార్యక్రమాన్ని ముగించి పాఠశాలకు తాళం పెట్టి వెళ్లడంతో విద్యార్థులు మహాలక్ష్మి , మౌనిక , లక్ష్మి , శిరీష , రంజిత మండల్ , జొశ్న మండల్ కలిసి వాగు ప్రాంతానికి  ఆడుకోవడానికి వాగు నీళ్ళలోకి నడుస్తూ లోతుగా ఉన్న గుంతలో పడి మునిగి పోతుండగా మహాలక్ష్మి (12) చాకచౌఖ్యంగా సమీపంలో ఉన్న వెదురు బొంగును తీసుకొని నీటిలో మునిపోతున్న చిన్నారులకు అందించగా రంజిత , జొశ్న లు వెదురు బొంగును పట్టుకోవడంతో మహాలక్ష్మి బొంగును బయటకు లాగి ఇద్దరు చిన్నారులను కాపాడింది. అలాగే మిగతా ఇద్దరు చిన్నారులను కాపాడే ప్రయత్నంలో వెదురు బొంగు నీటిలో వేసింది కాని అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి పోయారని గమననించి సమీపంలో ఉన్న స్థానికులకు తెలుపగా వాళ్ళు ఇరువురిని వెలికి తీసి ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. ఈ దుర్ఘటన మండల విద్యాధికారుల నిర్లక్ష్యం వలన జరిగిందని మండల ఉపాధ్యాయుల సమావేశం ఉందని ముందుగా తెలిసిన కూడా ఉపాధ్యాయురాలు సంధ్యారాణి సెలవు పై వెళ్లగా ఉన్న ఒక్క ఉపాద్యాయుడు సమావేశానికి వెళ్లాలనే ఉద్దేశంలో మధ్యాహ్నం భోజనం తరువాత పాఠశాలను వదిలిపెట్టడంతో నే చిన్నారులకు ఈ దుస్థి జరిగి ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని విద్యార్ధి  ఐక్యవిద్యార్ధి సంఘాల నాయకులు రాస్త రోకో చేసి  ఈ మరణానికి  కారకులైన ఉపాధ్యాయులను వెంటనే విడులనుండి తొలగించాలని  డిమాండ్ చేశారు. ఈ సంఘటన స్థలానికి తహసీల్దార్ రమేష్ గౌడ్ పరిశీలించి విద్యార్థుల తలిదండ్రులను ఓదార్చారు. జడ్ పిటిసి బాబురావు , టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి , రెబ్బెన ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ , స్థానిక సర్పంచ్ మంతుమేర టౌన్ అధ్యక్షుడు ఆర్ అశోక్ , వట్టివాగు చేర్మెన్ పెంటయ్య , ఖైర్గం సర్పంచ్ వెంకన్న , సుదర్శన్ గౌడ్ లు  బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరగా తహసీల్దార్ స్పందించి కుటుంబానికి ఎకరం నర ఎకరం నర ప్రభుత్వ భూములను అందిస్తామని అన్నారు. విద్యార్ధి ఐక్య సంఘ నాయకులు ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు కె సాయి, ఎ ఐ వై  యాప్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగె ఉపెందర్లు బాధిత కుటుంబికులకు నష్ట పరిహారంతో పాటు సాహసం చేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడిన మహాలక్ష్మిని గుర్తించి రాష్ట్ర సహస బాలిక హవార్డును ప్రదానం చేయాలనీ డిమాండ్ చేసారు      

విద్యుత్ షాట్ సర్కిట్ తో 4గృహాలు ద్వాంసం తీరని ఆస్థి నష్టం


విద్యుత్  షాట్   సర్కిట్ తో 4గృహాలు ద్వాంసం తీరని ఆస్థి నష్టం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యుత్ షాట్ సర్కిట్ తో గ్యాస్ సిలిండర్లు పేలి 4 పెంకుటిండ్లు కాలిపోయి తీరని ఆస్థి నష్టం జరిగింది ఈ దుస్థితి    రెబ్బెన మండలంలో ని గంగాపూర్ లో మంగవారం చోటు చేసుకుంది.గంగాపూర్ కు చెందిన గుర్లె లచ్చయ్య వారి కుమారులు బాబురావు , రమేష్ , సత్తయ్య  ఇండ్లు ప్రక్క ప్రక్కన ఉండడం వలన విద్యుత్ షాట్ సర్కిట్ తో ఉదయం సుమారు 10గంటల ప్రాతంలో వంటపనులు ముగించుకొని ఇంట్లోని వారందరు పొలం పనులకు వెళ్లగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు . ఈ సంఘటన స్థలానికి మండల తహసీల్దార్ బండారు రమేష్ గౌడ్ చేరుకోని  బాధితులను పరామర్శించి ఆస్థి  నష్టటం గురించి ఆరా తీశారు. బాధితులకు తీరని నష్టము జరిగిందని  కట్టు బట్టలు తప్ప వేరే ఏమి మిగులలేదని రేషన్ డీలర్ శంకర్ ను పిలిచి కుటుంబానికి 20కిలోల బియ్యం , కిరోషిన్ నూనె మరియు చెక్కర తక్షణమే అందించాలని ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించారు.ధాన్యం బస్తాలు , నగదు, నగలు ,  ఎరువులు , విలువైన సామగ్రి వాటివిలువ సుమారు 11లక్షల 66వేలు ఉంటుందని అంచనా వేశారు.   

సమ్మె కాలపు వేతనాలకు ఆంక్షలు విధించవద్దు

సమ్మె కాలపు వేతనాలకు ఆంక్షలు విధించవద్దు 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సకల జనుల సమ్మె కాలపు వేతనాలకు ఎలాంటి ఆంక్షలు విధించకుండా సింగరేణి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని ఎహ్ ఎం ఎస్ రీజియన్ ఉపాధ్యాయుడు మని రామ్ సింగ్ అన్నారు .గోలేటిలో  విలేకర్ల సమావేశములో ఆయన మాట్లాడుతూ సింగరేణి లో అత్యవసర కార్మికులకు ఆంక్షలు విధించి వారికి అన్యాయం చేయ వద్దని అన్నారు . వారు పనులు చేయకుంటే ఘనులు మొత్తం మూత పడతాయని ఆయన అన్నారు అందరికి వేతనాలు చెల్లించకుంటే ఆందోళనలు చేపడతామని తెలిపారు . ఈ కార్య క్రమములో నాయకులు ఆంజనేయులు గౌడ్ , తిరుపతి , అబ్దుల్ ఖాదర్ , ఉపేందర్ , రవి లతో పాటు తడి తరులు ఉన్నారు . . 

అంగన్వాడీ కేంద్రములో కలకలం రేపిన నాగు పాము

అంగన్వాడీ కేంద్రములో కలకలం రేపిన నాగు పాము 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండల కేంద్రములో సబ్  స్టేషన్ సమీపములో గల అంగన్వాడీ కేంద్రములో సోమవారం నాగు పాము కలకలం రేపింది . అంగన్వాడీ గదిలో ఆయా పద్మ శుబ్రము చేయడానికి వెళ్లగా పాము బుసకొట్టగా  బయటికి   పరుగు తీసింది . గది  మూలన కోడిగ్రుడ్లు పెట్టి ఉన్నాయి .గ్రుడ్లను తాగుతూ మూలాన ఉన్నట్లు ఆమె తెలిపారు .     ఇరుగు పొరుగు వారు వఛ్చి పాము ను చూసి అతి జాగత్తగా కర్రలతో చంపేశారు .  ప్రమాదం తప్పడంతో  వారు  ఊపీరి పీల్చుకున్నారు 

ఎఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ ప్రధాన కార్యదర్శి ఎన్నిక


ఎఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ ప్రధాన కార్యదర్శి  ఎన్నిక 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);   అసిఫాబాద్ లోని ఎస్ టియూభవన్ లో జరిగిన ఎఐఎస్ఎఫ్ డివిజన్ స్థాయి విస్తృత సమావేశంలో ఎఐఎస్ఎఫ్  అసిఫాబాద్ డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్, జిల్లా  ఉపాధ్యక్షులు  ఆత్మకూరి ప్రశాంత్ తెలియజేసారు . ఎఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోలేటి కి చెందిన ప్రస్తుత రెబ్బెన మండల కార్యదర్శి పూదరి సాయికిరణ్ ను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలియజేసారు .  డివిజన్ అధ్యక్షులుగా వాంకిడి మండలానికి చెందిన బావునే వికాస్ ను ఎన్నుకున్నారు .  పూదరి సాయికిరణ్ 2012లో ఎఐఎస్ఎఫ్ లో చేరి ఎఐఎస్ఎఫ్ కాలేజీ  ఇంఛార్జ్ గా , గోలేటి పట్టణ ,రెబ్బెన మండల ఉపాధ్యక్షుడిగా, ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ,విద్యార్ధి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని సమస్యల పరిష్కరాలని కృషి చేసినందుకే డివిజన్ బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని వారు అన్నారు ఈ సందర్భంగా పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎఐఎస్ఎఫ్ బలోపేతానికి , విద్యార్థుల సమస్యలు త్ తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యదర్శి రవీందర్ గారికి ,ప్రశాంత్ ,బోగే ఉపేందర్ లకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్  సభ్యులు కస్తూరి రవి , సలీమ్ , హరీష్,సందీప్,తిరుపతి, సంజయ్ ,పవన్ కుమార్  పాల్గొన్నారు.

నులిపురుగుల పై అవగాహనా సదస్సు


నులిపురుగుల పై అవగాహనా సదస్సు


జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్బంగా స్థానిక ఎం ఇ  ఓ కార్యాలయములో సోమవారం డాక్టర్ హైందవి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు . నులి పురుగులు రాకుండా విద్యార్ధి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు . అంగన్వాడీ కార్యకర్తలు , ఏ ఎన్  ఎం లు , ఉపాధ్యాయుల కు ప్రత్యకంగా శిక్షణ ఇచ్చ్చారు . ఈ కార్య క్రమములోఆసుపత్రి సిబ్బంది పావని , కమలాకర్ లు ఉన్నారు .

Sunday, 7 August 2016

మొక్కలే జీవనాధారం - టి ఆర్ ఎస్ మండల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి

మొక్కలే జీవనాధారం - టి ఆర్ ఎస్ మండల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలు భావితరాలకు జీవనాధారమని మండల టి ఆర్ ఎస్ అధ్యక్షుడు పోటు  శ్రీధర్ రెడ్డి అన్నారు . 1996-97 ఎస్ ఎస్ సి బ్యాచ్ కు చెందిన  సింగరేణి పాఠశాల విద్యార్థులు ఆదివారం రెబ్బెన మండలంలోని గోలేటిలో  కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెట్లు నరికి వేయడముతో కాలుష్యం పెరిగిందని తెలిపారు ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటితే ఊరంతా వనముల తయారు అవుతుందని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి కె సి ఆర్ హరితహారము నుఉద్యమంలా తీసికెళ్ళి రాష్ట్రాన్నే పచ్చని వనముల మార్చాలనే ఆలోచనతో ఉన్నారని అన్నారు , ఇప్పటికే మండలములో ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ  లక్ష్మి ఆధ్వర్యములోవేలాది మొక్కలు నాటామని పేర్కొన్నారు. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడానికి   ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్ , ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి  లు కంకణం కట్టుకున్నట్లు పేర్కొన్నారు . అభివృద్ధి పనులు , సంక్షేమ పథకాలను ఎన్నో చేశారని తెలిపారు . ఈ కార్య క్రమములో కె నవీన్ కుమార్ , పత్యేమ్   కృష్ణ , రవికుమార్ , ఏ నవీన్ కుమార్ , స్వామి , శ్రీనివాస్ కుమారస్వామి , రజినివాస్  లు ఉన్నారు.

ఎస్ వి ఇంగీష్ మీడియం లో హరిత హారం

ఎస్ వి ఇంగీష్ మీడియం లో  హరిత హారం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నాగుల పంచమి పండగ రోజు ప్రత్యకంగా మండలములోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పాఠశాల యాజమాన్యం , విద్యార్థులు మొక్కలు నాటారు . ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీకొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శుభ కార్యాలయాలకు , పండగలకు, పుట్టిన రోజులకు  ఒక్క మొక్క నాటినట్లయితే  ఊరంతా హరితంగా మారుతుందని అన్నారు .ప్రతి గ్రామము లో ఈవిధంగా మొక్కలు నాటితే రాష్ట్రమంతా పచ్చని వనముల తయారు అవుతానందని తెలిపారు . దీంతో ముఖ్యమంత్రి కె సి ఆర్ కళలు కన్నా బంగారు తెలంగాణా హరిత వనంగా మారుతుందని పేర్కొన్నారు . రెబ్బెన మండలములో ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవ  లక్ష్మి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట  వేస్తూ , హరిత హారాన్ని ఉద్యమంలా  తీసుకెళ్తున్నారని అన్నారు.