Saturday, 29 September 2018

వట్టివాగు ప్రాజెక్య్త నీరు విడుదల చేయాలి

రెబ్బెన ; రెబ్బెన మండలంలోని వట్టివాగు ప్రాజెక్య్త నుండి వరిపంటకు నీరు విడుదల చేయాలని శనివారం రైతులు  రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం  సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్ట్ నీటిని నమ్ముకొని మండలంలోని నక్కలగూడ, పుంజుమ్మెరా గూడా, ఇందిరా నగర్, రెబ్బెన, సింగల్ గూడ,  గ్రామాలలోని రైతులు  సుమారు 350  ఎకరాలు సాగు చేస్తున్నారని  గత 20 రోజులుగా డిస్ట్రిబ్యూషన్ 9 నుండి 12 వరకు గల పంటపొలాలకు నీటిని విడుదల చేయడం లేదని, సంభందిత అధికారులకు ఎన్నిసారు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని , కావున వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  రైతులు వనమాల మురళి, సుదర్శన్ గౌడ్  రావుజీ. వాడై శివరాం,సురేష్, ఓ సురేష్, తిరుపతి, భీంరావు, రాజు, మురళి గోపీచంద్, శంకర్, బాలాజీ, అజ్మీరా రమేష్, వెంకటేశ్వర గౌడ్, ఎల్ రమేష్, కొత్రాంగిహన్మంతు, తదితర వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.   

Friday, 28 September 2018

అందరికీ విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించాలి


రెబ్బెన ;  దేశంలో ఉన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున 111వ జయంతి వేడుకలు సందర్భంగా రెబ్బెనలోని డిగ్రీ కళాశాలలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కొరకు పొత్తిళ్ళలోనే పిడికిలి బిగించి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ అని అన్నారు. చిన్న వయస్సులోనే స్వాతంత్ర్యం కొరకు ఉరి కొయ్యకు వేలాడిన వీరుడని అన్నారు. నేటి యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉండి అవినీతికి,మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ గ్యారెంటీ ఎప్లాయిమెంట్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కొశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి,AITUC జిల్లా కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా కొరతని వెంటనే తీర్చాలి

రెబ్బెన ; రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతని వెంటనే తీర్చాలని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్ డిమాండ్ చేశారు.  రెబ్బెన మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చిందని, రైతులు సకాలంలో పంటలకు యూరియా వెయ్యలేక ఇబ్బంది పడుతున్నారని, ఈ సీజన్లో లో వరుణ దేముడు కరుణించినా ప్రభుత్వం , అధికారుల నిర్లక్ష్యంతో పంటలు సరిగా  ఎదగని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో   నంబాల   ఎం.పి.టి.సి సభ్యులు కోవూరు శ్రీ నివాస్, పి.ఎ.సి.ఎస్ ఛైర్మన్ గాజుల రవీందర్, వైస్ ఛైర్మన్ వెంకటేషం చారి, బి.సి సెల్ నాయకులు వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.

Thursday, 27 September 2018

పీజీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 27 ; రెబ్బెన  మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ &సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును అక్టోబర్ 1 వరకు పెంచుతూ కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ జి వీరన్న ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని,  కో_ఆర్డినేటర్ పూదరి మల్లేష్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ &సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం లో నిర్వహిస్తున్న కోర్సులలో ప్రవేశానికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అంగన్వాడీ కార్యకర్తలు యువతీ యువకులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు 

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజి 103 జయంతి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 27 ; కొండ లక్ష్మణ్ బాపూజి 103 జయంతి ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహంలో   చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా ఎస్ టి  సెల్ అధ్యక్షులు లావుడ్యా రమేష్ .మాట్లాడుతూ గతంలో అసిఫాబాద్ ముట్ట మొదటి ఎం ఎల్ ఏ   గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి పదవిని కూడా వదులుకొని  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన. విషయాన్ని గుర్తు చేసుకొని అతనిని  కొనియాడారు ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు  దుర్గం రాజేష్  ఎన్  ఎస్ యు ఐ మండల అధ్యక్షులు పుదరి హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గాజుల సతయ్య బనేష్ గాంధే, సంతోష్ దేవరకొండ, సంతోష్, .తార చంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Wednesday, 26 September 2018

ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి ; ఎమ్మెల్సీ పురాణం సతీష్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 26 ;  ప్రజలకు సంక్షేమ పథకాలను గడిచిన నాలుగేండ్ల నుండి ప్రవేశ పెడుతు అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి అని ఎమ్మెల్సీ పురాణం సతీష్, తాజా మాజీ ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి లు  అన్నారు.  బుధవారం     .రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో   ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తెరాస పార్టీలోకి చేరిన వారిని ఎమ్మెల్యే కోవా లక్ష్మి,ఎమ్మెల్సీ పురాణం సతీష్ వారికీ  తెరాస కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెరాస ప్రభుత్వం చేపట్టిన కల్యాణ లక్ష్మి పథకం, ఆసరా పింఛను, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ,24 గంటల కరెంటు,విద్య,రోడ్ల సదుపాయం, రైతు బంధు పథకం ద్వారా  ప్రతి రైతుకు ఎకరానికి 4 వేలు పంట పెట్టుబడి సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలందరికి తెరాస ప్రభుత్వం అండగా ఉందన్నారు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కోవలక్ష్మి కి ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అన్నారు.  రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తాము అన్నారు. గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు ఇది చేస్తాం అది చేస్తాం అని మాటలు చెప్పి మభ్య పెట్టి ఓట్లు దండుకొని పదవిని అనుభవించేవారు తప్ప వారు ప్రజలకు, చేసింది ఏమి లేదని ఘాటుగా విమర్శించారు. ఇప్పడికి అభివృద్ధిని ఓర్వలేక ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటే విపక్ష నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతు తెరాస పై విమర్శలు చేస్తున్నారు అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా ప్రతి గ్రామానికి రోడ్లు,నీటి సౌకర్యం తెరాస ప్రభుత్వం కలిపిస్తుంది అని అన్నారు. అదేవిదంగా గత ప్రభుత్వాలు ఏ రోజు  ఆడబిడ్డ పెళ్లి కోసం ఆలోచించ లేదని నేడు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డ పెళ్లి కోసం లక్ష రూపాయలు అందజేస్తుంది అన్నారు.రైతులకు ఎకరానికి రెండు పంటలకు 8 వేలు  పంట పెట్టుబడికోసం రైతు బంధు పథకం ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. .ఈ కార్యక్రమంలో  ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్,జడ్పిటిసి అజ్మీర బాపురావు,టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ, తెరాస పార్టీ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,నాయకులు చెన్నె సోమశేఖర్, రామన్న, పళ్ళ రాజేశ్వర్,వాస్, ఎంపిటిసిలు  తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 25 September 2018

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ స్టడీ సెంటర్ ను రెబ్బెనలోనే కొనసాగించాలీ


 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ;   అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ స్టడీ సెంటర్ ను రెబ్బెనలోనే కొనసాగించాలని ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున రెబ్బెన తహసిల్దార్ సాయన్నకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం రవీందర్ మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ కొనసాగడం వల్ల సుమారు వేయి మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని అన్నారు. రెబ్బెనలో స్టడీ సెంటర్ ఉండడం వల్ల రెబ్బెన,తాండూర్,బెల్లంపల్లి,మంచిర్యాల నుండి రెబ్బెన స్టడీ సెంటర్ లో అడ్మిషన్లు తీసుకున్నారని అన్నారు. యూనివర్సిటీ అధికారులు స్టడీ సెంటర్ ను రెబ్బెన నుండి కాగజ్ నగర్ కు తరలించడం వల్ల దూర ప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ స్టడీ సెంటర్ ను రెబ్బెనలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కొశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి లు పాల్గొన్నారు.

పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 102 జన్మదిన వేడుకలు

 
 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ;  పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 102 జన్మదిన వేడుకలు ను మంగళవారం  రెబ్బెన మండలం  బీజేపీ  అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ  ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్ జడ్పీటీసీ ఆదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ అజమీర రామ్ నాయక్  మాట్లాడుతూ దేశంలో జరుగుతున్నా అసాంఘిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా  పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ స్థాపించి  అనేక సేవలను చేసారని , స్వాతంత్రోద్యమంలో జనసంఘ్ పాత్ర ఎంతో  ప్రశంసనీయమని అన్నారు. కుందారపు బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి  చేపట్టిన ప్రజా సంక్షేమ పనులను గమనించి చాలామంది యువకులు బీజేపీ లో చేరుతున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో , చక్రపాణి, ఇగురపు  సంజీవ్,యలమంచిలి సునీల్ చౌదరి , వెంకటేష్, రాంబాబు, మల్లేష్, సుదర్శన్ గౌడ్   తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల వాడకం నిర్వహణ పై అవగాహన


 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ;  స్వచ్ఛ తా హీ సేవా కార్యక్రమం లో భాగంగా మంగళవారం రెబ్బెన మండలం  తుంగెడ గ్రామపచాయతీ లొ  స్వచ్ భారత్ మిషన్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రశాంత్ కుమార్, జిల్లా హెచ్ ఆర్ డి  ఫణి కుమార్, ల ఆధ్వర్యంలో  హై స్కూల్ విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మరియు నిర్వహణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు ఇంటింటికి మరుగు దొడ్ల వాడకంపై  అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణా, స్పెషల్ ఆఫీసర్ సంజీవ్, పాఠశాల ఉపాధ్యాయులు,    యూత్ అధ్యక్షులు పుదరి హరీష్  లుపాల్గొన్నారు.

Friday, 21 September 2018

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ;  రెబ్బెన మండలం నంబాలపంచాయతీపరిధిలోని మన్నెగూడకు చెందిన మాడే   మాంతయ్య   ప్రమాదవశాత్తు గ్రామ శివారులోగల కొత్త చెరువులో  పడి  మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై ఢీకొండ రమేష్  శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బుధవారం  మధ్యాన్నం  తన వదిన   ఇంటినుంచి బయటకు వెళ్లి  తిరిగి రాకపోవడంతో ఇంట్లోని వారు వెతకగా శుక్రవారం  నంబాల కొత్త చెరువులో చనిపోయి ఉండాగా గమనించి నట్లు తెలిపారు. మృతిని కొడుకు  మాడే  సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ;   అఖిల భారత విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఈ నెల 19 నుండి 21 వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన దుర్గం రవీందర్ ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన దుర్గం రవీందర్ మాట్లాడుతూ 2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జిగా, 2009 నుండి 2013 వరకు రెబ్బెన మండల కార్యదర్శి గా, 13 నుండి 2015 వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా, 2015 నుండి 2016 వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా, 2016 నుండి 2017 వరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బధ్యతలు నిర్వహించి విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, జిల్లాల పునర్విభజన అనంతరం 2017లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగిందని తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నందున రాష్ట్ర కార్యవర్గంలో రెండవసారి స్థానం లభించిందని అన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నిక చేసినందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రెండవ సారి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించడంతో తనపై మరింత బధ్యత పెరిగిందని అన్నారు.రవీందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికవడంతో జిల్లా ఉపాధ్యాక్షుడు పూదరి సాయి,కొశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి,మండల అధ్యక్షుడు జాడి సాయి హర్షం వ్యక్తం చేశారు.

బిత్తి రోడు లఘు చిత్రం గోడ ప్ర తులు విడుదల


బిత్తి రోడు లఘు చిత్రం వీడియో చూడవచ్చు
 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ; మన  జిందగీ  వారు నిర్మించిన బిత్తి రోడు లఘు చిత్రం తాల్లూకా గోడ ప్రతులను శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో  విడుదల  చేశారు.  అనంతరం లఘుచిత్ర దర్శకుడు  ఇగురాపు రాజశేఖర్ మాట్లాడుతూ యువత మూఢ నమ్మకాలను, దొంగ బాబాలను నమ్మి మోసపోవద్దని జీవితంలో  తమ కష్టాన్ని నమ్ముకుని అభివృద్ధి సాధించాలనే సందేశంతో  యువతలో మార్పు తీసుకురావడం కోసం ఈ చిత్రాలను తీయటం జరుగుతుందన్నారు. నూతనంగా తీయబోయే లఘు చిత్రాలలో  కొత్తవారికి  అవకాశం  ఇస్తామని ఆసక్తి ఉన్నవారు  8106548249 నెంబర్ పై  సంప్రదించవచ్చని కోరారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ, స్వామి, మహేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ 6 వర్ధంతి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ;    పద్మశాలి సేవా సంగం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ గారి 6 వర్ధంతి ని పద్మశాలి సంగం బెజ్జుర్ లో మండల అధ్యక్షులు సామల తిరుపతి, ప్రధాన కార్యదర్శి కనుకుట్ల వెంకటేష్,లు శుక్రవారం నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామల పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్,సామల రాజన్న, ప్రచార కార్యదర్శి సామల శ్రీకాంత్, సామల వెంకటేష్,కార్యదర్శులు,కనుకుట్ల శ్రీనివాస్, పర్శ గణేష్,రమేష్,హనుమంతు,పద్మశాలి కులభంధవులు, మరియు అభిమాన నాయకులు జిల్లాల సుధాకర్ గౌడ్,సందీప్,అశోక్, సంతోష్,శంకర్ లు పాల్గొన్నారు. 

Thursday, 20 September 2018

నవయుగ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదము

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ;  రెబ్బెన  మండల కేంద్రంలో గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద నవయుగ  గణేష్ మండలి వారు ఏర్పాటు చేసిన  గణేష్ మండపం వద్ద గురువారం అన్నదాన  కార్యక్రమం   నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు భోజన ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసారు.

జాతీయ పోషణ మాసోత్సవ అవగాహన ర్యాలీ

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ;  జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం జరగకుండా చైతన్యవంతులను చేసి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని  ఏ  పి  ఎం వెంకటరమణ శర్మ అన్నారు. గురువారం ఇందిరా క్రాంతి పథకం గౌతమి మండల సమైక్య ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అభియాన్    కార్యక్రమంలో భాగంగా  తెలియజేశారు పోషక ఆహారము త్రాగునీరు పరిశుభ్రతపై అవగాహన కల్పించుటకు ప్రతి గ్రామ సంఘ మహిళలు అంగన్వాడీ టీచర్లు బాధ్యత తీసుకొని ఇంటింటికి శుభ్రతకు సంబంధించిన విషయములు తతెలియజేయాలని కోరారు ఈ జన చైతన్యమే ద్వారా పిల్లలు సోదర సోదరిమణులు సంపూర్ణ చైతన్యవంతులు కావాలని తెలిపి అందరి చేత పోషణ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్స్ చిట్టెమ్మ సరోజ rajkumar డి పి ఎం అన్నజి సి సి లు హనుమంతురావు తిరుపతి కాశయ్య శంకర్ స్వరూప మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి కార్యదర్శి ప్రేమల గ్రామ సంఘ అధ్యక్షురాలు అంగన్వాడీ టీచర్లు ఐకేపీ సిబ్బంది   పాల్గొన్నారు.

క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆడాలి ; డిజిఎం పర్సనల్ జె కిరణ్

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ;  క్రీడాకారులు అందరు క్రీడా స్పూర్తితో ఆడి కంపెనీ స్థాయిలో బెల్లంపల్లి ఏరియా జట్లు   ప్రథమ స్థాయిలో నిలవాలని  ఫైనాన్స్ మేనేజర్ బి శ్రీధర్ ,   డిజిఎం పర్సనల్ జె  కిరణ్  లు అన్నారు.  గురువారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా రెబ్బెన మండలం  గోలేటిభీమన్న  స్టేడియం లో  బెల్లంపల్లి డబ్ల్యు డి ఎస్ అండ్ ఏ ఆధ్వీర్యంలో   నియర్ బై ఏరియా కబడ్డీ  మరియు కల్చరల్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు మరియు కళాకారులు మంచి ప్రతిభ చూపాలని అన్నారు.  ఈ పోటీలలో   కంపెనీ స్థాయిలో పాల్గొనే జట్లను ఎంపిక చేయడం జరిగిందని   తెలిపారు   కంపెనీ స్థాయికి ఎంపిక అయిన క్రీడాకారులు  మరియు కళాకారులను బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీ కే రవి శంకర్ అభినందించారు కల్చరల్ పోటీ లకు జడ్జీలు గా  బి రాజా రామ్,   సుదర్శన్ లు  వ్యవహరించగా కబడ్డీ పోటీలకు శ్రీ సతీష్ వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో  డి వై పి ఎం రాజేశ్వర్,   హెచ్ రమేష్ అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్ వైజర్    శ్రీ జిపి చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 19 September 2018

18 సంవత్సరాలు నిండిన అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలలి


  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రెబ్బెన తహసీల్దార్ సాయన్న అన్నారు. బుధవారం రెబ్బెన ఆర్ట్స్ నద్ సైన్స్ కళాశాల ఎన్  ఎస్ ఎస్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓటరు నమోదు అవగాహన సదస్సులో ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు . గ్రామీణ ప్రాంతాల లోని ప్రతి ఒక్క రు  తన పేరు ఓటరు జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని , లేనట్లయితే బూత్ స్థాయి అధికారి దృష్టికి తీసుకుని వెళ్ళి నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  ఎం ఏ జాకిర్ ఉస్మాని,  కోఆర్డినేటర్ మల్లేష్, అధ్యాపకులు దేవాజి, మల్లేష్, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పి జి కోర్స్ ల ప్రారంభం

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాకతీయ దూర విద్య కేంద్రం నిర్వహించే వివిధ పి  జి  కోర్స్ లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల కరెస్పాండంట్ శ్రీనివాస రాజు ,  ప్రిన్సిపాల్  ఎం ఏ జాకిర్ ఉస్మాని లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన గ్రామీణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రారంభించబోయే కోర్స్ ల వివరాలు ఎం ఏ  సోషియాలజీ, రురల్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీష్,, హిందీ,   ఎం కామ్  లు ఉన్నాయని అన్నారు. అభ్యర్థులు ఈ నెల 27 లోపు దరఖాస్తులు పొందవచ్చని అన్నారు. పార్టీ వివరాలకు కోఆర్డినేటర్ మల్లేష్ ను  చరవాణి ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. 

ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్నిసందర్శించిన రీజినల్ డైరెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; రెబ్బెన మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం వైద్య  ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్  ప్రభావతి, లెప్రసి  మరియు ఎయిడ్స్ డైరెక్టర్ జాన్సన్ లు సందర్శించారు. ఆసుపత్రి రికార్డు లు, సిబ్బంది హాజరు పై విచారించారు. ఈ సందర్భంగా రెబ్బెన తెరాస నాయకులూ మోడెమ్   సుదర్శన్ గౌడ్, ,చెన్న  సోమశేఖర్ లు రెబ్బెన ఆరోగ్య  కేంద్రాన్ని 30 పడకల  ఆసుపత్రి  గా చేయాలని, 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉండేటట్లు   చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులూ,  ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సబ్సిడీ రుణాలు మంజూరైన వారికి వెంటనే చెల్లించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; బీసీ ఎస్ సీ   సబ్సిడీ రుణాలు మంజూరైన వారికి వెంటనే చెల్లించాలని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ , సి పి  ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాడి గణేష్ లు  డిమాండ్ చేశారు. బుధవారం  రెబ్బెన మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. గత సంవత్సర కాలం నుంచి బ్యాంకు లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయక పోవడంతో  దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారని అన్నారు.ప్రభుత్వం ఎస్ సి బి సి సబ్సిడీ రుణాలు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష వైఖరితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు చల్లూరి అశోక్, నాయకులూ పగిది మహేందర్ తదితరులు పాల్గొన్నారు.   

Tuesday, 18 September 2018

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అల్పాహారం పంపిణి


 కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 18 ;  రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి మన్యం పద్మఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్పాహారం ఉప్మా  పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు. మండలంలోని వివిధ గ్రామాలనుంచి ప్రతి మంగళవారం పరీక్షల నిమిత్తమై  వచ్చే గర్భిణీ స్త్రీలకు    అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్నిప్రజాహిత  కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి  ఆస్పత్రి సిబ్బంది భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, కాంత లీల తదితరులు పాల్గొన్నారు.

ప్రణయ్ ఆత్మ శాంతి కోసం క్రొవొత్తుల ర్యాలీ

 కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 18 ;  రెబ్బెన ; కులం వివక్ష కారణంగా పరువు హత్యకు గురైన   ప్రణయ్ ఆత్మ శాంతి కోసం  మంగళవారం రెబ్బెన ప్రధాన రహదారి పై అంబెడ్కర్ విగ్రహం  వరకు  క్రొవొత్తుల ర్యాలీ   కుల మతాలకు  అతీతంగా నిర్వహించారు .ప్రణయ్  కుటుంబానికి న్యాయం జరగాలని సమాజంలో కులవివక్ష నశించాలని డిమాండ్ చేశారు.   కులం, పరువు  కారణంగా ఏ భారత బిడ్డ గురికాకుండా  కుల రహిత సమాజాన్ని ఏర్పరచాలని డిమాండ్ చేసారు. ఆ హత్య మానవత్వం పై  ఒక మచ్చ అని  నాయకుల అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య రాష్ట్ర నాయకులూ గోగర్ల శోభన్ బాబు, రెబ్బెన మండల ఎస్ టి నాయకులూ గోగర్ల రాజేష్, గోపాలకృష్ణ ,  టి దేవేందర్, లింగంపల్లి ప్రభాకర్, సుధాకర్, పోశం, సోమయ్య, చిరంజీవి గౌడ్, నవీన్ జైవాల్,బొమ్మినేని శ్రీధర్ కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

  కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 18 ;  రెబ్బెన ; మండలంలోని నంబాల గ్రామంలో చేపల వేటకు వెళ్లి ఎరుగటి పోషమల్లు(38) అనే వ్యక్తి మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్  తెలిపారు. ఆయన తెలిపిన  వివరాల ప్రకారం మంగళవారం ఉదయం మృతిచెందిన వ్యక్తి , అల్లుడు రాజ్ కుమార్ ,మాంతయ్య లు చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లారు. నీరు ఎక్కువగా ఉండడంతో అందులో మునిగి చనిపోయినట్లు తెలిపారు. భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

డెంగ్యు జ్వరంతో చిన్నారి మృతి


  కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 18 ;  రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రంలో   డెంగ్యు    జ్వరంతో చిన్నారి శ్రేష్ఠ(5)  సోమవారం రాత్రి చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. వారుతెలిపిన వివరాల ప్రకారం చంద్రశేఖర్, దీపికల కుమార్తె గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించినట్లు, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించిట్లు  తెలిపారు.  చక్కాగా ఆడుతూ పాడుతూ ఉండే పాప హఠాత్మరణానికి బంధువులు,పరిచయస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

కాంట్రీబ్యూటరీ పింఛన్ రద్దు.మధ్యంతర భృతి .పి ఆర్ సి అమలు చేయాలి



   కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 18 ;  రెబ్బెన  ; కాంట్రీబ్యూటరీ పింఛన్ రద్దు.మధ్యంతర భృతి .పి  ఆర్ సి   అమలు చేయాలని ఎస్ సి ఎస్ టి   ఉపాధ్యాయ సంఘం కుంరంభీం జిల్లా అధ్యక్షులు మేడి చరణ్ దాస్,  ఎస్ టి యు  జిల్లా ఉపాధ్యక్షులు  చునార్కర్ తుకారం  లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ .ఉపాధ్యాయ సంఘాల  పిలుపు మేరకు మంగళవారం రెబ్బెన   జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల  ఉపాధ్యాయులు  మధ్యాన్న భోజన సమయములో  నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి  కెసిఆర్  ఉద్యోగ .ఉపాధ్యాయులకు ఇచ్చిన  హామీలను నెరవేర్చలన్నారు.  ఈకార్యక్రమములో  జి  భానేశ్    మరియు పాఠశాల ఉపాధ్యాయులు మొహమ్మద్  అనీస్  కె ఉదయ్. ప్రభాకరరావు .జమున దాస్.  వశిం అహమ్మద్.గోపాల్ . శంకర్లింగం . శ్రీదేవి . సుదేవి. పుష్పాలత .పార్వతి .శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

Monday, 17 September 2018

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

 కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 17 ;  రెబ్బెన ; క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ఎస్ ఈ సివిల్ కె సత్యనారాయణ అన్నారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి భీమన్న స్టేడియం లో బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో డిపార్ట్మెంటల్ హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి     ముఖ్యఅతిథిగా  పాల్గొని  హాకీ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడాకారులు స్పోర్ట్స్ స్పిరిట్ తో ఆడాలని అన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికి కాకుండా ఉద్యోగులలో క్రీడాసక్తిని పెంపొందిస్తున్నదని అన్నారు.  ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్ టిబిజికెఎస్ ఏరియా  వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు, డివైపిఎం ఎల్ రామశాస్ట్రీ, స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చంద్రకుమార్, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ కుమార స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దిన సందర్బంగా జండా ఆవిష్కరణ

  కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 17 ;  రెబ్బెన ; తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను  విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా  చేపెట్టే వరకు  నిరసన కార్యక్రమాలు చేపడతామని    కొమురం బీమ్  జిల్లా బీజేపీ   ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు.  సోమవారం  రెబ్బన మండలం లోని గోలేటి బీజేపీ కార్యాలయం లో  జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమం లో    నాయకులూ  తదితరులు పాల్గొన్నారు.

Sunday, 16 September 2018

ప్రశాంతం గా ముగిసిన వి ఆర్ ఓ పరీక్ష

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్16 ;  తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం  నిర్వహించిన వి ఆర్ ఓ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెబ్బెన మండల కేంద్రంలో 3 పరీక్ష  కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ పాఠశాల కేంద్రంలో 183 మంది అబ్యదులకు 63 మంది, రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 300 మందికి 110, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240 మందికి 82 మంది హాజరైనట్లు ఆయా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెంట్లుతెలిపారు. రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మూర్తి ఆధ్వర్యంలో ఎస్సై దీకొండ  రమేష్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బీసీ సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్16 ; బీసీ సబ్సిడీ రుణాలు వెంటనే  మంజూరు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ , బీజేవైఎం జిల్లా కార్యదర్శి బత్తిని  రాము లు  డిమాండ్ చేశారు. రెబ్బెన మండలం గోలేటి లో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ  గత నాలుగు నెలల నుంచి దరఖాస్తు  చేసుకొన్న వారందరికీ రుణాలు ఇస్తామంటున్న అధికారులు  ఎప్పుడు ఇస్తారో తెలపాలన్నారు. ప్రతిరోజూ ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తిరిగి తిరిగి వేసారి పోతున్నారని  అన్నారు. బి సి రుణాలు కేవలం పత్రికా ప్రకటనలకే అరిమితమయ్యాయని, ఈ విధంగా జాప్యం చేయడం వలన అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.  ఇప్పటికైనా  అధికారులు వెంటనే రుణాలు ఇవ్వాలని  లేని పక్షంలో తీవ్రక్స్టైలో  ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీసీ సంఘం నాయకులు మోర్లే నరేందర్, లేకురి సుధాకర్, ఏర్రం మల్లేష్,తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 15 September 2018

వి ఆర్ ఓ పరీక్షకు సార్వ౦ సిద్ధం

 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; టి ఎస్ పి ఎస్ సి వారు రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  ఆదివారం  నిర్వహించే వి ఆర్ ఓ  పరీక్షా కేంద్రాన్ని శనివారం రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి, ఎస్సై దీకొండ  రమేష్ లు సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షకు సర్వం సిద్ధం చేశామని కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని తెలిపారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. త్రాగు నీటి సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు చీఫ్ సూపరింటెండెంట్ గా ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని, అడిషనల్ చీఫ్ సూపెరింటెండ్లుగా మల్లేష్, స్వప్నలు వ్యవహరిస్తున్నారని  తెలిపారు. 

విద్యార్థినులు రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; విద్యార్థినులు రాజ్యాంగం తమకు కల్పించిన రక్షణ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం  రెబ్బెన జూనియర్ కళాశాలలో షీ   టీం లపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినులను, మహిళలను ఎవరైనా మానసికంగాకానీ,సోషల్ మీడియాద్వారాకాని, , లైంగికంగాకాని, వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇటువంటి హింసకు గురైనవారు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆన్నారు. విద్యార్దినులు  మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాను మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కళాశాల అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు.

స్వచ్ఛతాహి కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు ముందుండాలి ; జీఎం రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ;  స్వచ్ఛతాహి కార్యక్రమంలో సింగరేణి  ఉద్యోగులు  ముందుండాలని జీఎం  రవిశంకర్ అన్నారు. శనివారం  బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి బస్సు స్టాండ్ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమానికి  జీఎం  కే రవిశంకర్ ముఖ్య  అతిధి గా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఆలా చేసినట్లయితేనే మనం భావి తరాలకు స్వచ్ఛ భారత్  ను అందించగలమని అన్నారు. హెల్త్ ఆఫీసర్ లలిత పరిశుభ్రత పైతీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో దఁగన్  పర్సనల్ జె  కిరణ్, ఎస్ ఓ టూ జీఎం  సాయి బాబా , ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణాచారి, సీనియర్ సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ కుమారస్వామి ,డీపీఎం లు సుదర్శనం, రామశాస్ట్రీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సింగరేణి ఆతాల విద్యార్థులు పాల్గొన్నరు.

ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర మహసభలకు తరలిరాండి ; జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; అఖిల భారత విద్యార్థి సమాఖ్య  తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహసభలకు   విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. ఈ నెల 19,20,21 తేదీలలో  రంగారెడ్డి జిల్లాలో జరిగే  మహసభల పోస్టర్లను శనివారం  రెబ్బెనలో ఆవిష్కరించిన అనంతరం  మాట్లాడుతూ కేంద్రంలోబీజేపీ  రాష్ట్రంలో తెరాస  ప్రభుత్వాలు విద్య వ్యాపారీకరణ,కార్పొరేటికరణ,కాషాయీకరణను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో విద్యారంగానికి అనేక హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు హమీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కెజి టూ పిజి ఉచిత విద్య హమీ అమలు చేయకుండా అసెంబ్లీని రద్దు చేసినకెసిఆర్  కు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షులు పూదరి సాయి, జిల్లా కోశాధికారి కస్తూరి రవికుమార్,డివిజన్ ఉపాధ్యాక్షులు పర్వతి సాయి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి ; మాజీ శాసన సభ్యులు ఆత్రం సక్కు

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని  మాజీ శాసన సభ్యులు ఆత్రం సక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్రావు లు అన్నారు. ఏ  ఐ టి సీ ,టి పి  సి సి  పిలుపు మేరకు శనివారం రెబ్బెన మండలం గంగాపూర్, తుంగెడ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ  కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించాలని కోరారు. తెరాస పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వారికి  తగిన బుడ్డి చెప్పాలని  అన్నారు.   ఈ సందర్భంగా పలువురు నాయకులు, యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు, ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ  కోవూరు శ్రీనివాస్, పి.ఎ.సి.ఎస్ వైస్ ఛైర్మన్ వెంకటేశం చారి  , బి.సి సెల్ నాయకులు వెంకన్న, పూదరి హరీష్, ఎల్ .రమేష్ , గంగయ్య,  దుర్గం రాజేష్, పూదరి రాజు, సంతోష్ సంఘం బానయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల నమోదు

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; బూత్ లెవెల్ అధికారులు గ్రామ  పంచాయతీ కార్యాలయంలో ఆదివారం అందుబాటులో ఉంటారని కావున  ప్రజలు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సాయన్నశనివారం  తెలిపారు.  టి ఎస్ పి  ఎస్ సీ   నిర్వహించే వి ఆర్ ఏ , వి ఆర్ ఓ   పరీక్షలు  ఆదివారం ఉండడంతో రెబ్బెన మండలం లోని 249, 250, 252 బూత్ లు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నందున  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Friday, 14 September 2018

ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి


 రెబ్బెన ; ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ   కోవూరు శ్రీనివాస్ లు  అన్నారు.    ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ , టి ఎస్ పి  సి  పిలుపు మేరకు రెబ్బెన మండలం వంకులం, కొండపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ  కార్యక్రమం  నిర్వహించడం జరిగిందని తెలిపారు.   ఈ కార్యక్రమంలో వంకులం గ్రామ అధ్యక్షులు కాశీనాధ్, కొబ్రగొడ మొండయ్య, మాజీ సర్పంచ్ ప్రేమ్  దాస్ , మాజీ సర్పంచ్ మాంతుమేర, వడై తిరుపతి, యూత్ నాయకులు శ్రీనివాస్, పి.ఎ.సి.ఎస్ ఛైర్మన్ గాజుల రవీందర్,అనిశెట్టి వెంకన్న, దుర్గం రాజేష్, పూదరి రాజు, సంఘం బానయ్య తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 12 September 2018

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు : రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్12 ; సోషల్ మీడియాలో  మతపరమైన, రాజకీయ  పరమైన వ్యాఖ్యలు, చేయకుండా నిగ్రహం పాటించాలని   రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ అన్నారు.  బుధవారం రెబ్బెన పోలీస్  స్టేషన్ లో  మండలంలోని  అన్నిసోషల్  గ్రూపుల అడ్మిన్ లను సమావేశ పరచి మాట్లాడారు.  వాట్స్ అప్ లో అనాలోచితంగా రెచ్చగొట్టే మెసేజెస్ లు వ్యాఖ్యలు మత పరమయిన రెచ్చగొట్టే సందేశాలు వ్యాఖ్యలు ఎన్నికల పార్టీల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. సోషల్ మీడియాని ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా,  ఆలోచన శక్తిని పెంపొందించేలా ఉపయోగించాలని అన్నారు. ఇతరుల మనోభావాలను గాయపరిచేలా ఉండకూడదని అన్నారు.. రాబోయే ఎన్నికలను, పండుగలను      దృష్టిలో ఉంచుకొని ఎవరిని నొప్పియ్యని  మండల అభివృద్ధికి సంబందించిన  వార్తలు వంటివి పంపగలరు .  సభ్యులు ఓపికతో ప్రవర్తించి ఒక మంచి గ్రూప్ గ నడవాలని అన్నారు. . ఎవరిని ఏ పార్టీని విమర్శించకుండా సమస్యలపై దృష్టి పెడదాం . మండలంలోని ప్రజల   మేలు కోసం ప్రయత్నించాలన్నారు.  .నలుగురికి ఉపయోగపడేలా గ్రూప్ ని వాడాలని  . అనాలోచిత మెస్సగెస్ పెట్టుట ఫార్వర్డ్ చేయుట ఊరిలో అల్లర్లకు దారితీస్తాయి. అందువల్ల మెసెజ్ లు పెట్టినవారితో పాటు అడ్మిన్స్ కూడా కేసుల పాలు అవుతారు  ఇటువంటి .సందేశాలు పోలీసులు విశ్లేషణలో ఉంటాయని కావున జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్12 ; బెల్లలంపల్లి సింగరేణి ఏరియా రెబ్బెన మండలం గోలేటిలో  డిస్పెన్సరీ లో  బుధవారం మట్టి గణపతి ప్రతిమల పంపిణి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని  సింగరేణి జీఎం  కే రవిశంకర్ ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టర్ అఫ్ పారిస్  తో తయారు చేసిన గణపతి ప్రతిమలు పర్యావరణానికి హాని చేస్తాయని అన్నారు.కావున ప్రజలు మట్టితో చేసిన విగ్రహాలను పూజించడం  అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో వీధి  విధికి విగ్రహాలు ప్రతిష్ట చేసేకంటే  అందరు కలసి ఒకే విగ్రహాన్నిప్రతిష్ట  చేసుకొంటే అందరిలో ఐకమత్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సి హెచ్ శ్రీనివాస్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు. 

ఏ ఐ ఎస్ ఎఫ్ కుమురం భీం జిల్లా కమిటీ ఎన్నిక

 
 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్12 ; రెబ్బెన మండలం   గోలేటిలోని కె.ఎల్.మహేంధ్ర భవన్ లోమంగళవారం జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య  జిల్లా ద్వితీయ మహసభల్లో జిల్లా కమిటీని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ స్టాలిన్ గారి ఆద్వర్యంలో ఎన్నుకోవడం జరిగిందని  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ బుధవారం  తెలిపారు. నూతనంగా ఎన్నికైన నాయకత్వం విద్యా కాషాయీకరణ,వ్యాపారీకరణ,కార్పొరేటికరణ పైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షునిగా బి .వికాస్ ఉపాధ్యాక్షులుగా: పూదరి సాయి, ప్రధాన కార్యదర్శిగా దుర్గం రవీందర్, సహయ కార్యదర్శిగా: నికొడె తిరుపతి,కోశాధికారిగా కస్తూరి రవికుమార్, అలాగే 21 మంది కౌన్సిల్ సభ్యులను, 11 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. దుర్గం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పైన పోరాటం కొనసాగిస్తామని, కెజి టూ పిజి ఉచిత విద్యకై పోరాటం చేస్తామని అన్నారు. జిల్లాలో డిఈవొ లేక విద్యారంగం మరుగునపడుతుందని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,పాలిటెక్నిక్,ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలని,జిల్లాలో విద్యాభివృద్ధికై ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి,సిపిఐ జిల్లా పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

Tuesday, 11 September 2018

నిరుద్యోగులను, విద్యార్థులను వంచించిన తెరాసకు బుద్ధి చెప్పాలి ; ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం అశోక్ స్టాలిన్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11   నిరుద్యోగ విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అవేమి చేయకుండా  వంచించిన  తెరాస అధినేత కెసిఆర్ కు తగిన బుడ్డి చెప్పాలని ఏ  ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం అశోక్ స్టాలిన్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి లోని అమరజీవి కొమురం బీమ్ ప్రాంగణంలో జరిగిన ఏ  ఐ ఎస్ ఎఫ్ కొమురంభీం జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిధిగా  పాల్గొని మాట్లాడారు. అమరవీరుల త్యాగాలతో సిద్దించిన తెలంగాణా ను   కేవలం కెసిఆర్ కుటుంబ పాలనకే పరిమితం చేశారన్నారు. పార్టీ 5 సంవత్సరాలు పాలించమని అధికారమిస్తే సమస్యలను పరిష్కరించలేక ఇంకా 9 నెలల సమయం మిగిలి ఉండాగానే శాసన సభను రద్దు చేసి భాద్యతా రాహిత్యంగా పలాయనం చిత్తగించారన్నారు. ఎన్నికల ముందు చేసిన కే జి టూ పి  జి   ఉచిత విద్య, లక్ష ఉద్యోగాల భర్తీ, తదితర హామీలను గాలికి వదిలేశారని అన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. 31 జిల్లాలకు పూర్తి స్థాయి  నియమించలేదని అన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి, పేదలకు డబల్ బెడ్ రూమ్ నులని చెప్పి, మోసగించిన కెసిఆర్ కు ప్రజలు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.  అంతకు ముందు ఏ  ఐ ఎస్ ఎఫ్  జిల్లా మాజీ నాయకులూ బోగే ఉపేందర్ శ్వేతాఅరుణ పతాకాన్ని ఎగుర వేసి మహాసభలనుప్రారంభించారు. ఈ సభలో ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్, సి పి  ఐ పట్టణ  నాయకులు  బి జగ్గయ్య,  నాయకులూ బోగే ప్రకాష్, పూదరి సాయి, రవికుమార్, ఎన్  తిరుపతి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. 

అభివృద్ధిని చేసి చూపించిన పార్టీ తెరాస: ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11  రాష్ట్రంలో అభివృద్ధిని  చేసి చూపించిన పార్టీ తెరాస అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, అన్నారు. మంగళవారం  రెబ్బెన  మండలం గోలేటి గ్రామ పరిధిలోని దుగ్గాపూర్, గోలేటి గ్రామాలలో సి సి రోడ్ పనులను ప్రారంభించారు. ఖైర్ గూడా  గ్రామం వద్ద 5 కోట్లతో  రోడ్  బ్రిడ్జి పనులను కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు.  అనంతరం మాట్లాడుతూ మండలాన్ని దత్తత తీసు కొని గ్రామా గ్రామాన సి సి రోడ్లను వేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అని వర్గాల ప్రజలను సమ దృష్టితో అభివృద్ధి పరిచారని అన్నారు. గడచినా నాలుగేళ్లలో ఇప్పటి వరకు ఏ  ప్రభుతం చేయని అభివృద్ధిని చేశామని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెరాస పార్టీని  గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా  మాజీ ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి లు జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు,  తెరాస మండల సాధ్యక్షులు పోటు  శ్రీధర్ రెడ్డి, తెరాస నాయకులూ     బొమ్మినేని శ్రీధర్ కుమార్,  మస్క రమేష్,రాజేశ్వర్, సంగం శ్రీను, సాంబ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

ఓటర్ జాబితాను సిద్ధం చేయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11  రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ జాబితాను ఈనెల  25  వ తేదీకల్లా సిద్ధంచేయాలని రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్న అన్నారు. మంగళవారం   రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన బూత్ లెవెల్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు  . బూత్ లెవెల్ అధికారులు ఫారం 6,5 లతోపాటు  వయస్సు నిర్ధారణ కోసం జనన ధృవీకరణ లేదా 10 వ / 8 వ / 5 వ ప్రామాణిక మార్క్ షీట్ లేదా పాస్పోర్ట్ (ఇండియన్) లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డులను తీసుకోవచ్చని అన్నారు. జనవరి 1,2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకునేటట్లు బూత్ లెవెల్ అధికారులు కృషి చేయాలన్నారు. అక్టోబర్ 6 వరకు ఈ సమావేశంలో ఆర్ ఐ ఊర్మిళ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి నారాయణ, ప్రమీల , బాలమ్మ, ఇందిరా, లక్ష్మి, రమ, నిర్మల, భారతి, కళావతి, లత, తిరుపతమ్మతదితరులు పాల్గొన్నారు. 

పాము కాటుతో మహిళా మృతి


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11 ;  రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలో   పాము  కాటుకు గురై మహిళ  మృతిచెందిందని రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ తెలిపారు. ఆయన  తెలిపిన వివరాల ప్రకారం కరెంటు పోవడంతో సోమవారం రాత్రి దీపం వెలిగించే క్రమంలో చౌదరి శారద (22) చేతిపై పాము కాటువేసిందని, రెబ్బెన ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తరలించగా వైద్యులు  అందుబాటులో లేకపోవడంతో బెల్లంపల్లికి అక్కడనుంచి మంచిర్యాల తరలించగా మంచిర్యాలలో డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారన్నారు. భర్త భీంరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి  శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసిఫాబాద్ తరలించినట్లు తెలిపారు. రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాధమిక  ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, పాముకాటుకు మందులు అందుబాటులో ఉంటె తన భార్య బ్రతికేదని భర్త భీం రావు , బంధువులు రోదిస్తూ తెలిపారు. 

Friday, 7 September 2018

కోవలక్ష్మి అభిర్దిత్వంపై వెల్లువెత్తిన హర్షం ;;; తెరాస శ్రేణులు భారీ బైక్ ర్యాలీ

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 ; ప్రజా సంక్షేమం  అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక   తెలంగాణా రాష్ట్ర సమితి  అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , మాజీ ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి లు  అన్నారు. శుక్రవారం అసిఫాబాద్ నియోజక వర్గం నుండి 2019 'సాధారణ ఎన్నికలలో  తెరాస పార్టీ అభ్యర్థిగా మాజీ ఎం ఎల్ ఏ   కోవ లక్ష్మిని  ప్రకటించినందుకు    రెబ్బెన మండల కేంద్రంలో తెరాస శ్రేణులు భారీ   బైక్ ర్యాలీతో హైదేరాబద్ నుండి వస్తున్న కోవలక్ష్మి కి స్వాగతం పలికి  ప్రధాన రహదారి వెంబడి ఎమ్మెల్యే స్వగృహం వరకు భారీ ఎత్తున   ర్యాలీ గాతోడ్కొని వెళ్లారు.  రెబ్బెన మండల కేంద్రములో ఇంటింటా  మిఠాయిలు పంచు కొని నోరు తీపి చేసుకున్నారు. వారి  ఆనందాన్నిఅట పాటలతో వ్యక్త పరిచారు. ర్యాలీ   ప్రారంభ సమయంలో బాణాసంచాకాల్చారు.  ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ తెరాస అధ్యక్షులు కెసిఆర్  తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిబాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

దృష్టి సమస్యలున్న ప్రజలకు వారి ప్రాంతాలలోనే ఉచిత కంటి పరీక్షలు


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 ; రెబ్బెన మండలం గోలేటి సింగరేణి సేవాభవన్  లో కంటివెలుగు శిబిరాన్నిశుక్రవారం  సింగరేణి జీఎం కె  రవిశంకర్ ప్రారంభించి మాట్లాడారు. దృష్టి  సమస్యలున్న  ప్రజలకు వారి వారి ప్రాంతాలలోనే ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను సమకూర్చడమే లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.  సంస్థ తరపున శిబిరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గోలేటిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, డీపీయం  రామశాస్ట్రీ,  కంటివెలుగు ప్రోగ్రాం  ఆఫీసర్ డాక్టర్ సీతారాం, డాక్టర్ మాధురి,  దూత్ క్లారా, మొయిన్, కమలాకర్, రేణుక, ఆసుపత్రి సిబ్బంది, ఆశ వర్కర్ లు పాల్గొన్నారు.

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 క్రీడాకారులు  పోటీలలో  ప్రతిభ కనపరచి జాతీయ  స్థాయి  కోల్  ఇండియా పోటీలలో రాణించి  సంస్థకు పెరుతేవాలని జీఎం  కె  రవిశంకర్ అన్నారు.   శుక్రవారం  సింగరేణి ఏరియా డబ్ల్యూ పి  ఎస్ అండ్ జి ఏ  ఆధ్వర్యంలో  రెబ్బెన  మండలం గోలేటి  భేమన్న స్టేడియం లో ఏరియా 86వ  బాస్కెట్ బాల్  పోటీలను  జీఎం  కె  రవిశంకర్ క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ    క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో ఆడాలని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనపర్చి కోల్  ఇండియా పోటీలలో కూడా  సింగరేణికి పేరుతేవాలని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తే కాకుండా కార్మికులలో క్రీడాసక్తిని ప్రోత్సహహించడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. . ఈ కార్యక్రమంలో   డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, డీపీఎం రామశాస్ట్రీ , రమేష్, కోఆర్డినేటర్ జి పి  చంద్ర కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Thursday, 6 September 2018

అసిఫాబాద్ ఎం ఎల్ ఏ అభ్యర్థి గా మరో సారి కోవ లక్ష్మిని ప్రకటించినదుకు ఆనందోత్సాహాలు




 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 06 ;   అసిఫాబాద్  ఎం ఎల్ ఏ  అభ్యర్థి గా మరో సారి కోవ లక్ష్మిని  ప్రకటించినదుకు  గురువారం  రెబ్బెన మండల కేంద్రంలో తెరాస శ్రేణులు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గోలేటి కెసిఆర్  చిత్రపటానికి లో  పాలాభిషేకంచేసి   . ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ కోవ లక్ష్మి  కి మరో సారి అవకాశం కల్పించి నoదుకు కృతజ్ఞతలు తెలిపారు కోవ లక్ష్మీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గం లోని కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో గెలుపుకోసం కృషిచేస్తామన్నారు. ఈకార్యక్రమాలలో జడ్పీటీసీ బాబురావు, ఎంపీపీ సంజీవకుమార్, కుందారపు శంకరమ్మ,  పోటు శ్రీధర్ రెడ్డి,  నవీన్ జైస్వాల్, బొమ్మినేని శ్రీధర్, వినోద్ జైస్వాల్, చిరంజీవి, భరద్వాజ్, ఉబేదుల్లా,మన్సూర్, జహీర్ బాబా, తిరుపతి, అశోక్, రాజేశ్వరి, టి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు మస్కా రమేష్,   పార్వతి,అశోక్, రాజకుమారి, యోగేష్,బానుప్రసాద్,రవీందర్,విష్ణు సత్యనారాయణ  లు పాల్గొన్నారు.