Thursday, 31 August 2017

పనిలో నిబద్ధతే మనకు గుర్తింపు; ఎస్పి సన్ ప్రీత్ సింగ్

పనిలో నిబద్ధతే మనకు గుర్తింపు; ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 31 ;   మన పని తీరు యే మనకు అమోఘమైన గుర్తింపునిస్తుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు, ప్రజా పోలీసులు గా పనిచేసినప్పుడే  చేసిన సేవల కు   గుర్తింపు లబిస్తుందని ఆయన తెలిపారు.గురువారం జిల్లా లోని స్థానిక జిల్లా ఎస్పి క్యాంపు కార్యాలయం  లొ  పదవి విరమణ చేస్తున్న   తిర్యాని పోలీస్ స్టేషన్   ఏ.ఎసై  జే.భోజన్న ను     జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  శాలువ తో సత్కరించి పుష్ప గుచ్ఛము ను అందచేశారు,  వారి యొక్క 37 సంవత్సరాల సర్విస్ లో చేసిన సేవల గురుంచి అడిగి తెలుసుకున్నారు , వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో  ఆనందం తో గడపాలని అబిలాశించారు  మరియు  వారికీ రావలిసిన బెనిఫిట్స్ ను తక్షణం అందిస్తామని ఈ సందర్బంగా  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రంలో ఎస్పిసీసీ దుర్గం శ్రినివాస్, ఎస్బి ఎసై లు శివకుమార్ ,ఎన్.ఐ.బి ఇంచార్జ్ శ్యాం సుందర్, డి.పీ.ఓ. ఉన్నత శ్రేణి సహాయకుడు కేదార సూర్యకాంత్, ఇంతియాజ్,క్యాంపు కార్యాలయ సిబ్బంది కిరణ్ కుమార్ ,కే.సుధాకర్ మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

బెటర్ సొసైటీ సేవా సంస్థ అనాధ పిల్లలకు చేయూత

బెటర్ సొసైటీ సేవా సంస్థ అనాధ పిల్లలకు చేయూత 


   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 31 ;  అనాధ పిల్లల సహాయ నిధి కోసం బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ మరియు  ఓం శ్రీ సాయి యువ గణేష్ మండలి వారి ఆధ్వర్యం లో హైదరాబాద్ అంధ   కళాకారులచే గోలేటి లో ఓం శ్రీ సాయి యువ గణేష్ మండలి వారు ఏర్పాటుచేసిన గణేష్ మండపం  వద్ద ఆట,పాట,మ్యాజిక్ షో, ఇంద్రజాలప్రదర్శన, కార్యక్రమాలు  నిర్వహించడం జరిగింది. అనంతరం అంధ కళాకారులను బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ సభ్యులు సన్మానం చేసి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్, ఉపాధ్యక్షులు రవీందర్,రాజశేఖర్  సభ్యులు , సాయి,తిరుపతి,వెంకటేష్,రాకేశ్,తిరుపతి,సంజయ్,రమేశ్, మరియు వికలాంగుల కమిటీ వారు రమేశ్,సుజాత,నాగమణి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 30 August 2017

భారతీయ జనతా పార్టీ ఎస్ సీ మోర్చా జిల్లా సమావేశం

భారతీయ జనతా పార్టీ ఎస్ సీ  మోర్చా జిల్లా సమావేశం 


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 30 ;   భారతీయ జనతా పార్టీ ఎస్ సీ  మోర్చా జిల్లా సమావేశం బుధవారంనాడు జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడుతూ  కేంద్రప్రభుత్వం నరేంద్ర మోదీగారి నేతృత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోనికి విస్తృతంగా తీసుకువెళ్లాలని ,మోడీగారు ప్రవేశపెట్టిన స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమం, ఎస్ సీ   లు, బి సి లు స్వంతంగా తమా కాళ్లపై నిలువడానికి ఉద్దేశించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి దళితులను మోసంచేస్తున్నారని,,దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి,డబల్ రూమ్ ఇండ్లు లాంటిపథకాలు అన్ని మోసపూరితాలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బి సి మోర్చా అధ్యక్షులు పి  తిరుపతి, బీజేపీ దళితమోర్చ అధ్యక్షులు రాంటెకి భీం రావు, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు ఖండ్రి విశాల్ ,దీపక్ ,విజయకుమార్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. 

శ్రామికుల హక్కుల సాధన ఏ ఐ టి యూ సి తోనే సాధ్యం : అంబాల ఓదెలు

శ్రామికుల హక్కుల సాధన ఏ  ఐ టి యూ సి తోనే  సాధ్యం : అంబాల ఓదెలు

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 30 ;   శ్రామికుల హక్కుల సాధన ఏ  ఐ టి యూ సి తోనే  సాధ్యం అని  ఏ  ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి  అంబాల ఓదెలు అన్నారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటిలోనే కేఎల్   మహేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం శ్రమించే కార్మిక  సంఘం   ఏ  ఐ టి యూ సిమాతృసమేనని రాబోయే సింగరేణి కార్మిక ఎన్నికలలో అందరు తమ యూనియన్ నే సమర్ధించాలని కోరారు.  ప్రస్తుతమున్న టి జి బి కే ఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ,వారసత్వఉద్యోగాలపై అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తూ,జాతీయ యూనియన్లను తప్పుపట్టుతున్నాయని తెలిపారు. కార్మిక హక్కులకోసం పోరాడే  ఏ  ఐ టి యూ సి ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఖైర్గుడా పిట్ కార్యదర్శి జూపాక రమేష్, నాయకులూ జాడి తిరుపతి, సురేంకురి తదితరులు పాల్గొన్నారు.

సి పి ఎస్ రద్దుకై ఉపాధ్యాయుల సామూహిక సెలవు

సి పి  ఎస్ రద్దుకై ఉపాధ్యాయుల సామూహిక సెలవు

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 30 ;  పి  ఆర్ టి యూ    టి ఎన్   రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో జరిగే ఆందోళనలోపాల్గొనేందుకై  రెబ్బెన మండల లోని ప్రాధమిక,ప్రాధమికోన్నత ఉపాధ్యాయులు ,పి  జి హెచ్ ఎం లు సెప్టెంబర్ ఒకటైన సామూహిక సెలవు పెట్టనున్నారని రెబ్బెన పాఠశాలలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని  మండల  పి  ఆర్ టి యూ అధ్యక్షులు రాపెల్లి సత్తెన్న ,ప్రధాన కార్యదర్శి దుర్గం అనిల్ తెలిపారు.

Tuesday, 29 August 2017

సీ పి ఎస్ విధానం రద్దుచేయాలి ; పి ఆర్ టి యూ

సీ పి ఎస్ విధానం రద్దుచేయాలి ; పి ఆర్ టి యూ

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 29 ; ఉపాధ్యాయులందరు  సెప్టెంబర్ ఒకటిన సామూహిక సెలవు పెట్టి రెబ్బెన  మండల విద్యాధికారి కార్యాలయం ముందు సి పి  ఎస్ విధానం రద్దుకై నిరసన తెలపాలని   జిల్లా అధ్యక్షులుశ్రీనివాసరావు,జిల్లా ప్రధానకార్యదర్శి ప్రకాష్ లు  అన్నారు , మంగళవారం  పి ఆర్ టి యూ మండల సర్వసభ్య సమావేశం రెబ్బెన హైస్కూల్ లో  జరిగిన సమావేశంలో  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి  ఆర్ ట్ యూ సిద్ధాంతాలు,నియమావళి,పనితీరు మెచ్చి తెలంగాణ యూ టి ఎఫ్ రెబ్బెన కార్యదర్శి తూలీసింగ్ పి  ఆర్ ట్ యూ ట్ ఎస్ జిల్లా అధ్యక్ష్య,ప్రధానకార్యదర్సులా సమక్షంలో పి ఆర్ ట్ యూ  టి ఎస్ సభ్యత్వంతీసుకోవంజరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాద్యులు జనార్దన్, జిల్లాభాద్యులుః ఖదీర్, సదానందం, మండల కార్యదర్శ కురుసేనగా శ్రీనివాస్, పి  జి హ్ ఎం లు సాంబమూర్తి, రాము,కార్యవర్గ సభ్యులు రమేష్ రెడ్డి, మల్లేష్, పాల్గొన్నారు.

నిమజ్జనం, శోభ యాత్ర లకు బందోబస్తు ను పకడ్బంది గా నిర్వహించాలి ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్


నిమజ్జనం, శోభ యాత్ర లకు బందోబస్తు ను పకడ్బంది గా నిర్వహించాలి ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 29 ; గణపతి నవరాత్రుల సందర్భంగా ,నిమజ్జనం,శోభాయాత్ర ల బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం కాగజ్ నగర్  టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖి చేసిన జిల్లా ఎస్పి స్టేషన్ యొక్క  పరిసరాలను పరిశీలించి, స్టేషన్  నిర్వహణ పని తీరు ను గమనించారు మరియు గణపతి నవరాత్రుల దృష్ట్యా తీసుకుంటున్న భద్రత చర్యల గురుంచి అడిగి తెలుసుకున్నారు, కాగజ్ నగర్ రూరల్ మరియు పట్టణం లో శోభ యాత్ర , నిమజ్జనం జరిగే ప్రాంతాల  రూట్ మ్యాప్ ను జిల్లా ఎస్పి పరిశీలించారు, శోభ యాత్ర ల లో డి.జే లను వాడవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా బాణసంచ కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ,నిమజ్జనం జరిగే ప్రదేశాల వద్ద ముందస్తు గా అప్రమత్త తో వుండాలని నిమజ్జనం జరిగే ప్రదేశాల వద్ద గజ ఈతగాళ్ళను , లైటింగ్ , జెనరేటర్ మరియు  క్రేన్ లను ముందస్తు గా అందుబాటులో ఉంచుకోవాలని  జిల్లా ఎస్పి ఆదేశించారు,  ,ఎలాంటి అవాంచనియ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను తిసుకోవాలని జిల్లా ఎస్పి ఆదేశించారు. జిల్లా ప్రజలు ప్రశాంతముగా సోదరబావం తో పండుగ లు నిర్వహించుకొని పోలీసులకు సహకరించాలి అని జిల్లా ఎస్పి కోరారు. ఈ కార్యక్రమం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్పి సీసీ  దుర్గం శ్రీనివాస్ , కాగజ్ నగర్ టౌన్ సి ఐ  వెంకటేశ్వర్,రూరల్ సిఐ  ప్రసాద్ రావు, టౌన్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ,రూరల్  ఎస్సై రాజేష్ కుమార్,పిఆర్.ఓ మనోహర్ లు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు

  రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు 

    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 29 ; రెబ్బెనలోనిమండలంలోని సింగిల్ గూడా  గ్రామానికి వెళ్లేదారి కిరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను జేసీబీ సహాయంతో తోలగించి గ్రామానికి రోడ్ సౌకర్యం మెరుగుపరిచినట్లు రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, సింగల్ విండో చైర్మన్ మధునయ్య  తెలిపారు.

సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో కుట్టుశిక్షణాకేంద్రం

సింగరేణి  సేవాసమితి    ఆధ్వర్యంలో కుట్టుశిక్షణాకేంద్రం
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 29 ; బెల్లంపల్లి ఏరియా  సింగరేణి  సేవ సమితి ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రంలో కుట్టుశిక్షణ కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఏరియా డి జి ఎం పర్సనల్ జె  కిరణ్ తెలిపారు.శిక్షణకాలం ఆరు నెలలుంటుందని ఆసక్తిగల రెబ్బెనలోని మహిళలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపాడు. గోలేటి టౌన్షిప్ లో తైలారింగ్,బ్యూటిషన్, ఫాషన్ డిజైన్ కోర్స్ లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆసక్తిగల సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబసభ్యులు (మహిళలు) తమ దరఖాస్తులను జి ఎం  పర్సనల్ డిపార్ట్మెంట్ నందు 04-09-2017 లోపు అందచేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Monday, 28 August 2017

ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు

ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు 


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 28 ;   అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సభ్యత్వాన్ని రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ లు  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు సభ్యత్వ రశీదును అందించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,విద్యార్థులు పాల్గొన్నారు.  

ఫిర్యాదు లపై తక్షణం స్పందించాలి-జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్


 ఫిర్యాదు లపై   తక్షణం స్పందించాలి-జిల్లా ఎస్పి  సన్ ప్రీత్ సింగ్

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 28 ;    పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి  ఫిర్యాదు పై  తక్షణం స్పందించి బాధితులకు సాంత్వన చేకూరే చర్యలు చేపట్టాలని  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు, సోమవారం  జిల్లా కేంద్రం లోని  స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో జిల్లా ఎస్పి  ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదు విబాగామునకు  ఎక్కువగా భూ తగాదా సమస్యలు రావటం జరిగింది , ప్రజా ఫిర్యాదు లొ ఆసిఫాబాద్ కు చెందిన  మొహమ్మద్  బారఖని   మొహమ్మద్ బిన్ అహ్మద్ లు  తాము నివాసం ఉంటున్న స్థలమును ఖాళి చేయాలి అని  దౌర్జన్యము న  కు దిగుతున్నారని ఫిర్యాదు ను జిల్లా ఎస్పి గారికి అందించింది  మరియు ఐలవేని తిరుపతి చిర్రకుంట ఆసిఫాబాద్ గ్రామస్థుడు తమ యొక్క వారసత్వం గా వస్తున్న భూమి యొక్క పంపకం  గొడవల వల్ల తమ యొక్క బందువులు అన్యాయము గా తమ పైన దాడి కు దిగుతున్నారని ప్రజా ఫిర్యాదులో జిల్లా ఎస్పి గారి కు  ఫిర్యాదు ను అందించారు. ఫిర్యాదు ల పైన స్పందించిన జిల్లా ఎస్పి గారు  ఫిర్యాదుల పై తక్షణం చర్య తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్పి సీసీ  దుర్గం శ్రీనివాస్ , ఎస్బి ఎసై లు శివకుమార్ ,ఎన్.ఐ.బి. ఎసై శ్యామ్ సుందర్,డిసీఆర్బీ ఎసై రాణాప్రతాప్ , జిల్లా పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కేదార సూర్యకాంత్,ఇంతియాజ్ , పిఆర్.ఓ మనోహర్ లుమరియు ఫిర్యాదుల విభాగం అధికారిని సునీతగార్లు పాల్గొన్నారు.  

విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణి

విద్యార్థులకు విద్య సామాగ్రి పంపిణి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 28 ; రెబ్బెన మండలంలోని పులికుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు రెబ్బెన వాస్తవ్యులు  ఐన  వ్యాపారి భరత్ కొడియర్ మరియు వారి కుటుంబ సభ్యులువిద్యార్థులకు అవసరమైన పుస్తకాల సంచులు,  నోటుపుస్తకాలు,పెన్నులు,పెన్సిళ్లు, పంపిణి చేశారు. వారు మాట్లాడుతూ  పేద విద్యార్థులు  అందరు చదువుకునేలా విద్యార్థుల సౌకర్యార్ధం విద్య సామాగ్రి తదితర వస్తువులు అందిస్తూ విద్యావ్యాప్తికి తమవంతు  విధిగా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానఉపాధ్యాయుడు శ్రీనివాస్, పాఠశాల కమిటీ చర్మన్ టి పోశన్న, గ్రామస్తులు బి పోచమల్లు, ఇ  సుధాకర్, బి లక్ష్మి మరియు ఉపాధ్యాయురాలు ఇ స్వప్న తదితరులు పాల్గొన్నారు. 

Sunday, 27 August 2017

సీపీఎస్ మహాధర్నా గోడప్రతులు విడుదల

సీపీఎస్ మహాధర్నా గోడప్రతులు విడుదల 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 27 ;      హైదరాబాద్ లో చేపట్టనున్న సీపీఎస్ మహా ధర్నా గోడప్రతులను  రెబ్బన జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం సీపీఎస్ టి ఈ ఏ -టీఎస్ నాయకులూ గోడ ప్రతులను  విడుదల చేసారు.  ఈ సందర్బం గ వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1 న తలపెట్టిన మహాధర్నానుఁ విజయవంతం చేయాలనీ కోరారు సీపీఎస్ ని రద్దు  చేసి పాత    పిన్షన్ విధానాన్ని అమలు చెయ్యాలన్నారు ఈ మహా ధర్నాను సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమం లో సీపీఎస్ టి ఈ ఏ-ట్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి శివ రామ కృష్ణ ,రాష్ట్ర ఉప అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు దుర్గం లింగయ్య ,మండల ఉపాధ్యక్షులు ఎం శ్రీకాంత్,కార్యదర్శి మధుకర్ ,పిఆర్ టీయూ జిల్లా కార్యదర్శి ఖాదర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్,వినోద్,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి జాగృతి జిల్లా కన్విన్నార్ గా పోటు శ్రీధర్ రెడ్డి

రెడ్డి జాగృతి జిల్లా కన్విన్నార్ గా   పోటు  శ్రీధర్ రెడ్డి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 27 ;      కొమురం బీమ్ జిల్లా రెడ్డి జాగృతి కన్వీనర్ గా    పోటు  శ్రీధర్ రెడ్డి ని నియమించడం జరిగిందని రెడ్డి జాగృతి జిల్లా ఇంచార్జ్ ఎర్రం తిరుపతి తెలిపారు .  ఆదివారం  రెబ్బన అతిథి గృహం లో రెడ్డి బంధువుల  సమక్షం లో ఎన్నుకున్నామని ఈ సమక్షం లో కో కన్వీనర్  గా కే సమ్మిరెడ్డి,ఎర్ర మనోహర్ రెడ్డి,అమర్నాధ్ రెడ్డి,కే వెంకట్ రెడ్డి,లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐదు వేల కోట్ల రూపాయలతో రెడ్డి కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలన్నారు. పెద విద్యార్థుల కోసం రెడ్డి రెసిడెన్షియల్  హాష్టళ్ళని ఏర్పాటు చెయ్యాలని రైతులు ప్రమాదం  లో మరణిస్తే  ఐదు లక్షల  రూపాయిలు మంజూరు చేయాలన్నారు ఆరోగ్య శ్రీ కార్డుని వర్తింపజేయాలన్నారు ఈ కార్యక్రమం లో టీ సతీష్ రెడ్డి,జి సాయికిరణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 22 August 2017

శాంతి,మత సామరాస్యములే ప్రగతికి రథచక్రాలు – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

శాంతి,మత సామరాస్యములే ప్రగతికి రథచక్రాలు – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 22 ;   శాంతి, మత సామరస్యములే సమాజ ప్రగతికి  రథచక్రములని  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్  ప్రేమల  గార్డెన్స్  ఫంక్షన్ హాల్ లో జిల్లా మత పెద్దల సమక్షం లో జిల్లా ఎస్పి అద్యక్షతన రానున్న పండుగల  నేపద్యం లో శాంతి సమావేశం ను నిర్వహించారు, ఈ శాంతి సమావేశము లో జిల్లా ఎస్పిమాట్లాడుతూ శాంతి తో పండుగలు  ఆనందోత్సాలతో  జరుపుకోవాలని జిల్లా ఎస్పి ఆకాంక్షించారు, అందుకు పోలీస్ శాఖ కు సహకరించినట్లైతే  ఉత్సవ నిర్వహకులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా  ముందస్తు చర్యలు తీసుకుంటారని అందుకే ప్రతి వినాయక మండప నిర్వాహకులు తప్పని సరిగా సమీప పోలీస్ స్టేషన్ నందు వివరాలు తెలిపినట్లితే ముందస్తు ప్రణాళిక తో అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తారని జిల్లా ఎస్పి తెలిపారు.  మత పెద్దలు  మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా శాంతి కాముకమమైన జిల్లా అని ఇక్కడ పలు  మతాల వారు సోదరభావం తో ఉంటారని ఇక్కడ ఎలాంటి మతప్రమేయ శక్తులకు తావు లేదని, తాము పరస్పర సహకారం తో జిల్లా లొ పండుగలను నిర్వహించుకుoటామని తెలిపారు. జిల్లా లో గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ వంటి పండుగలు శాంతియుత వాతావరణం లో జరిగేలా  జిల్లా లో 4 అంచెల భద్రత ను ఏర్పాటు చేశామని తెలిపారు.

మట్టితో చేసిన వినాయకులనే పూజిద్దాం బెల్లంపల్లి ఏరియా సింగరేణి జి ఎం

మట్టితో చేసిన వినాయకులనే పూజిద్దాం  బెల్లంపల్లి ఏరియా సింగరేణి  జి ఎం 


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 22 ;      మట్టితో చేసిన వినాయక ప్రతిమాలానే పూజిద్దామని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జి ఎం కే రవిశంకర్ అన్నారు. ఈ నెల 24 న మట్టితో చేసిన వినాయక ప్రతిమలను గోలేటిలో ఉచితంగా పంపిణి చేయనున్నట్లు డీజీఎం పర్సనల్ జ్.కిరణ్ తెలిపారు. మట్టివినాయక ప్రతిమాలానే పూజించలని అవగాహనకల్పించడానికి గోలేటిలో ఈ నెల 24న విద్యార్థులు,యోగాసభ్యులు, కార్మికులు, అధికారులు, సేవాసభ్యులతో   ర్యాలీ  నిర్వహించనున్నట్లు తెలిపారు. గోలేటి ప్రజలు ఈ విషయంలో సహకరించాలని కోరారు. 

శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి ; రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్

శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి
                                 రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ 


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 22 ;  గణేష్‌ ఉత్సవాలను  శాంతియుతంగా,సామరస్యంగా జరుపుకోవాలని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలుచుకున్న నిర్వాహకులతో సీఐ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరిగేలా,వినాయకుల నిమజ్జనం రోజున నిమజ్జన కార్యక్రమంలో సంయమనంతో నడుచుకోని,ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.చట్టానికి లోబడి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.ఎవరైనా సరే నిబంధనలను  అతిక్రమించినట్లైతే  వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామరస్యంగా వినాయక నిమజ్జనం జరిగిందన్నారు. మండపాలల్లో ఏర్పాటు చేసే విద్యుత్తు దీపాలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, కో ఆప్షన్ సభ్యుడు జాకిర్ ఉస్మాని, గంటు మేర, చిరంజీవి ,మోడెమ్ సుదర్శణగౌడ్, మద్ది శ్రీనివాస్, శంకర్, జాబి, రాజాగౌడ్, తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు

Sunday, 20 August 2017

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఢిల్లీకి తరలిన నాయకులూ

ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఢిల్లీకి తరలిన నాయకులూ 


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 20 ;   తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరపార్క్ ధర్నా చౌక్ ను ఒక వేదికగా చేసుకున్నమని,గతం నుండి అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేయడానికి ధర్నా చౌక్ వేదికగా ఉండేదని అలాంటి ధర్నా చౌక్ ను ఎత్తివేయడానికి టి.ఆర్.ఎస్. ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజా ఉద్రమాలను అణచివేయడానికి కెసిఆర్ కుట్రలు పన్నుతున్నడాని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ లు ఆరోపించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పరిరక్షణ కోసం ఢిల్లీలో సోమవారం రోజున జంతర్ మంతర్  వద్ద జరుగు ధర్నాకు వెళ్ళడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి జిల్లా కన్వీనర్ రమేష్ నాయకులు రాకేష్, రమేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు..

నూతన సాంకేతికత లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహం అందిస్తాం ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

నూతన సాంకేతికత లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి   ప్రోత్సాహం అందిస్తాం ;  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్


   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 20 ;  జిల్లా లో  ప్రారంబించిన నూతన సాంకేతికత లో  ప్రతిభ కనబరిచిన సిబ్బందికి   నెల నెల   ప్రోత్సాహకాలు అందిచి వారిని ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు, సి.సి.టి.ఏన్.స్ జిల్లా  లో ప్రవేశ పెట్టిన అప్పటినుంచి , ఇప్పటి వరకు,సి.సి.టి.ఏన్.స్ నమోదు,వినియోగం మరియు  సి.సి.టి.ఏన్.స్ యొక్క ప్రగతి ను జిల్లా ఎస్పి పర్యవేక్షించారు, అందులో బాగముగా ఈస్గం పోలీస్  స్టేషన్ నుంచి బబ్బెర శేఖర్ పీ.సి-3257 ను జిల్లా ఎస్పి ఎంపిక చేసి నగదు బహుమతి  వేయి రూపాయలను ప్రోత్సాహకము ను అందించి అబినంధించారు.జిల్లా లో ఆధునిక సాంకేతికతను అందుబాటులో తిసుకువస్తున్నామని దానికి అనుగుణముగా ప్రజలకు సేవలు నిత్య నూతనముగా మార్పుచేయబడి  సేవలు సరళ తరం  అవుతాయని జిల్లా ఎస్పి తెలిపారు .ఈ కార్యక్రమము లో  డిఎస్పి  హబీబ్  ఖాన్ , జిల్లా లోని సి.ఐ లు , ఎసై లు జిల్లా ఐ.టి కోర్ సిబ్బంది జే. శ్రీనివాస్, మాణిక్  రావు ,రమేష్,పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్య కాంత్ , యం.డి.ఇంతియాజ్, పాస్ పోర్ట్ కార్యాలయ అధికారి మురళి , ఫింగర్ ప్రింట్  విబాగము అధికారులు ఏ. తిరుపతి , మరియు పీ.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.     

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి ; జిల్లా పోలీస్ అధికారి

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి ;  జిల్లా పోలీస్ అధికారి 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 20 ; గణేష్ ఉత్సవాలని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్ పి  సన్ ప్రీత్ సింగ్ ఆదివారంనాడు సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవడానికి పలు సూచనలు చేస్తూ నిర్వాహకులు ఈ క్రింది సూచనలను   తప్పకుండ పాటించాలని కోరారు.  గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, రోడ్డు పైన ఇరుకుగాఉండే వివాదాస్పద ప్రాంత లలో మండపాలు ఏర్పాటు చేయవద్దు అని, గణేశ్ నవరాత్రి ఉత్సవ మండపం ను సురక్షిత మైన వస్తువుల తో నిర్మించుకోవాలని, జంతువులు వంటివి రాకుండా నిర్వాహకులు జాగ్రత్త పాటించాలి. మండపం లో నిర్వాహకులు లేదా వాలుంటీర్  లు ఎల్లపుడూ అందుబాటులో ఉం డి వారి ఫోన్ నెంబర్ రాత పూర్వకంగా గా స్థానిక పోలీసు స్టేషన్లో అందించాలి. బలవతంగా ఎవరి వద్ద చందాలు వసూలు చేయవద్దని, పెద్ద గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు భద్రత కారణాల దృష్ట్యా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు, విద్యుత్తు కు పెర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని ,విద్యుత్ ప్రమాదం జరుగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి మండపం వద్ద పోలీసులు యొక్క పాయింట్ బుక్ ఉంచుకోవాలని ముందస్తుగా జిల్లా లో చేయు ర్యాలీ లకు,ఊరేగింపులు కు అనుమతి తప్పనిసరి పొందాలన్నారు, సుప్రీం కోర్టు డీ జే వాడకం పూర్తిగా నిషేధం వుననందున డీ జే వాడరాదని సాధారణ బాక్స్ టైప్ స్పీకర్ లను వాడాలని,పరిమిత డిసిబెల్ లను మించి సౌండ్ పెట్టవద్దు అని తెలిపారు. ముఖ్యముగా వందుతులను నమ్మవద్దు అని అలాంటివి ఎవరు అయినా ప్రచారం చేస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలి  అని ప్రజలందరూ సంతోష మైన వాతావరణం లో పండుగలు జరుపుకునే లా అందరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. 

Saturday, 19 August 2017

నూతన ఆధునిక విచారణ పద్దతులు అవలంబించడం యే నిజమైన పురోగతి - జిల్లా సన్ ప్రీత్ సింగ్

నూతన ఆధునిక విచారణ పద్దతులు అవలంబించడం యే నిజమైన పురోగతి - జిల్లా సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ;  కేసుల పురోగతి కోసం నూతన అదునిక విచారణ విధానాలు అవలంబించినప్పుడే నిజమైన పురోగతి కనిపిస్తుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శనివారం స్థానిక AR హెడ్ క్వార్టర్ లోని పోలీస్ సమావేశ మందిరం లో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు,మొదటగా జిల్లా ఎస్పీ హరితహరం లో పోలీస్ లు నాటిన మొక్కల వివరాలు సబ్ డివిజన్ , సర్కిల్,పోలీస్ స్టేషన్ ల వారి గా పరిశీలించి నియమిత లక్ష్యం ను చేరుకునే విధంగా పని చేయాలని నాటిన మొక్కలను ఖచ్చితంగా సంరక్షించుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు.జిల్లా లో గణేశ్ ఉత్సవాలు, బక్రీద్ వంటి పండుగలు శాంతియుత వాతావరణం లో జరిగేలా 4 అంచెల భద్రత ను ఏర్పాటు చేయాలని   సమావేశం లో ఎస్పీ తెలిపారు అవి 1 స్టాటిక్ బందోబస్తు,2 సున్నిత ప్రాంతా లలో పికెట్ , 3మొబైల్ పార్టీ లను,4 స్త్రైకింగ్ ఫోర్స్. సున్నిత మైన ప్రదేశాలు గురుంచి ఎప్పటికప్పుడు సమా చారం తెలపాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు అంతేకాక అక్రమపశువుల సంత లు ఏర్పాటు చేసేవారిని, .అక్రమ రవాణా చేసేవారిని నిఘా తో అరికట్టాలని సూచించారు.రానున్న పండుగలకు జిల్లా మొత్తం ప్రణాళిక బద్దమైన పటిష్ట బందోబస్తు  ను ఏర్పాటు చేశామని తెలిపారు. 

కిలిమంజారో పర్వతం అధిరోహించిన విద్యార్థిని అబినందించిన ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

  కిలిమంజారో పర్వతం అధిరోహించిన విద్యార్థిని అబినందించిన ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ; మొట్టమొదటి సారి తెలంగాణా నుంచి ఆసిఫాబాద్ జిల్లా గిరిజన పాటశాల ల తరుపున  సౌత్ ఆఫ్రికా లోని కిలిమంజారో  పర్వతం ను అధిరోహించిన విద్యార్ధి నాయిని మల్లేష్  (14 సంవత్సరాలు) ను  శనివారం స్థానిక జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లొ  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  శాలువా తో సత్కరించి మెమోంట్ అందచేసి ఘనముగా సత్కరిచారు. నాయిని మల్లేష్ 14 సంవత్సరాలు ల వయసుల్లో దృడ సంకల్పం తో అత్యున్నత శిఖరం ను అధిరోహించడం చాల ఆనందం గా వుందని , భవిష్యతు లొ కూడ ఎవరెస్ట్  వంటి పర్వతాలను  అధిరోహించి జిల్లా కు మరియు రాష్ట్ర నకు  మంచి పెరు  తీసుకు రావాలని , మల్లేష్ ఆదర్శం తో  విద్యార్థులు అందరు అత్త్యున్నతo గా ఎదగాలని  జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము లొ  డిఎస్పి హబీబ్ ఖాన్ ,జిల్లా  సి ఐ లు మరియు ఎసై లు , స్వరోస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉషన్న, లక్ష్మన్ దాస్ , హేమంత్ షిండే , చైతన్య ,శ్రినివాస్ మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.   

మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ అమలుతీరుపై డి ఎం హెచ్ ఓ పరిశీలన

మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ అమలుతీరుపై  డి ఎం హెచ్ ఓ  పరిశీలన 



కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ;  ప్రతిఒక్క విద్యార్థికి    మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ తప్పనిసరిగా వేయాలని డి ఎం హెచ్ ఓ సుబ్బరాయడు అన్నారు. ఈ ప్రక్రియ  అమలు తీరును పరిశీలించడానికి ఈ రోజు  డి ఎం హెచ్ ఓ     సుబ్బారాయుడు రెబ్బెన మండలంలో  ఆకస్మికంగా తనిఖీ చేసారు. మండలంలోని ఫాసిగం, గంగాపూర్ గ్రామాలలోని పాఠశాలలో వాక్సినేషన్ ప్రక్రియను గమనించారు.రెబ్బెన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం    వైద్యురాలు డాక్టర్ నాగమణి,  ,సిబ్బంది, ఆయన వెంట ఉన్నారు.

నంబాల పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ

 నంబాల పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ 


     కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ;   రెబ్బెన మండలం నంబాలగ్రామంలోని  ప్రభుత్వ సెకండరీ పాఠశాలకు విద్యార్థుల ఉపయోగార్థం వాటర్ ఫిల్టర్ ను నంబాల గ్రామా వాస్తవ్యులైన హిమాకర్ వారి తల్లిదండ్రులైన రత్నం పోశయ్య మల్లు బాయి  ల  జ్ఞాపకార్ధం వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ కె ప్రసాద్ తెలిపారు..గతంలోకూడా విద్యార్థుల సౌకర్యార్ధం బెంచీలు,తదితర వస్తువులు అందిస్తూ విద్యావ్యాప్తికి తమవంతు కృషిచేస్తున్నారని తెలిపారు. పడవ తరగతి పరీక్షలలో ప్రధమస్థాయిలో ఉత్తీర్ణులైన ముగ్గురికి నగదు ప్రోత్సహకాలు ,మరియు పెదవిద్యార్థులకు పుస్తకాలూబ్యాగులు  పంపిణి చేస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో  పాఠశాలా కమిటీ అధ్యక్షులు దెబ్బతి సత్యనారాయణ ,  రత్నం సుబ్బారావు,  మరియు పాఠశాలఅధ్యాపకులు ,తదితరులు పాల్గొన్నారు. 

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ;   ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా రెబ్బెనలోని ఫోటో మరియు విడియోగ్రాఫేర్లు స్థానిక అతిధి గృహములో కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం రెబ్బెన ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ సంగం అధ్యక్షులు అశోక్ ,మాట్లాడుతూ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా పండ్లపంపిణీ కార్యక్రమంచేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మొగిలి, ఉపాధ్యక్షలు కుమారస్వామి, ప్రధానకార్యదర్శి ఆసన్న,  కోశాధికారి ప్రకాష్, , కార్యవర్గసభ్యులు,  మల్లేష్ రాజు, తిరుపతి, సంజీవ్, రవి, సాయి, గణేష్,   తదితరులు పాల్గొన్నారు.

Friday, 18 August 2017

మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్

మీజిల్స్  రుబెల్లా వాక్సినేషన్ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;   రెబ్బెనలోని  సాయి విద్యాలయంలో శుక్రవారం  మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ విద్యార్థులకు ఇవ్వటం  జరిగింది. ఈ కార్యక్రమంలో  ,రెబ్బెన ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది,పావని, సంతోష్, ప్రవీణ్,ప్రమీల ,రాధా, హెల్త్ సూపెర్వైజార్లు ప్రమీల,రాధా, వనిత, తులసి, సుకన్య ,ఆశలతతోపాటు ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్ ఉన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మిక తనిఖీ

జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మిక  తనిఖీ

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;     జిల్లావిద్యాశాఖాధికారి రెబ్బెనమండలంలోని ప్రాధమికోన్నత పాఠశాల ఖైర్ గాం  ,పులికుంట ,ప్రాధమిక పాఠశాలా, సింగరేణి ఉన్నతపాఠశాల, మరియు సెయింట్ ఆగ్నెస్ పాఠశాల గోలేటిలను ఈ రోజు ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తెలుగు,ఇంగ్లీష్,మరియు లెక్కలు బాగా నేర్చుకోవాలని హితవు పలికారు. జిల్లావిద్యాశాఖాదికార్రితోపాటు మోడల్ ఆఫీసర్ ఎం ఏ  జబ్బార్,మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర స్వామి తదితరులు ఉన్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ  జయంతి  


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;   శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367వ జయంతి పురస్కరించుకొని జయంతిని శుక్రవారం రోజున రెబ్బెన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు అతిధి గృహంలో  గౌడ కులస్థులు  ఘనంగా  నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్,రెబ్బెన మండల ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్  ముఖ్య అతిధిగ పాల్గొని  మాట్లాడుతూ  ఆనాటి మొగలుల కాలంలో పంటల పై వేసే పన్ను కంటే కళ్ళు పై వేసే పన్ను అధికంగా ఉండేదని ఆనాడు బిసి కులాలు దళిత వర్గాలు ఏకం చేసి జమిందారులు,సుబెదరులకు  ఎదురుతిరిగి పోరాటం చేసిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నది అని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కేసరి ఆంజనేయులుగౌడ్,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,రెబ్బెన ఉపసర్పంచ్ బొమినేని శ్రీధర్ కుమార్,జిల్లా కార్యదర్శి కొయ్యడ రాజగౌడ్,గౌడ  కులస్థులు చిరంజీవి గౌడ్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి నారాయణ గౌడ్,కిష్టాగౌడ్,వీరమల్లుగౌడ్,టి.మహేష్ గౌడ్,శాంతి గౌడ్,జి.భార్గవ్ గౌడ్,తిరుపతిగౌడ్,వివిధ కుల సంఘాల నాయకులు కడ్తల మల్లయ్య,రాపాళ్ళ శ్రీనివాస్,ఇప్ప భీమయ్య,బొంగు నరసింగ రావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సీపీఐ నాయకులు

 విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన  సీపీఐ నాయకులు 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 18 ;     రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు కింద పడి చనిపోయిన సాయికుమార్ అనే  విద్యార్థి తల్లిదండ్రులను,కుటుంబాన్ని సీపీఐ మాజీ శాసన సభ పక్ష నేత  గుండ మల్లేష్ శుక్రవారంనాడు రెబ్బెనకు  వచ్చి పరామర్శించారు.ఉన్నత చదువులు చదివి కుటుంబానికి అసరగా ఉంటాడు అనుకునే సమయంలో ఇలా జరగడం చాలా బాధకారమని అన్నారు.బాధిత కుటంబానికి భరోసానిచ్చారు.గుండ మల్లేష్ తో పాటు ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్షుడు ఎస్.తిరుపతి,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.జగ్గయ్య,గుండ మాణిక్యం,ఏఐఎస్ఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,మండల కార్యదర్శి రాయిళ్ల నర్సయ్యలు ఉన్నారు.

Thursday, 17 August 2017

బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో హరిత హారం

బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో హరిత హారం 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 17 ;   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్నిబెల్లంపల్లి ఏరియా  సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రెబ్బెన మండలంలోని గోలేటి క్రాస్ రోడ్ వద్దనున్న సి ఎస్ పి  ప్రాంగణంలో మొక్కలు నాటే  కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా   ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి జిల్లా పాలనాధికారి చంపాలాల్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్   సన్ ప్రీత్ సింగ్ లు  హాజరై విద్యార్థులతో కలసి  మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ   మొక్కలను నాటడంలో విద్యార్థులు ముందుండాలని,అదే విధంగా నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరు పోసి సంరక్షించడంలో కూడా శ్రద్ధ పెట్టాలని అప్పుడే   సమస్త మానవాళికి ప్రాణవాయువు లభిస్తుందని  అన్నారు. మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే  అవి రేపటికి వృక్షాలు అవుతాయని,వాటితో  ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు.మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణగ  మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్నాథం సంజీవ్ కుమార్,జిల్లా ప్రాదేశిక సభ్యులు అజ్మీర బాబురావు,సర్పంచ్ పెసరు వెంకటమ్మ,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్,యంపిడిఓ సత్యనారాయణ  సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ జి రవిశంకర్, ,మండల   విద్యాధికారి వెంకటేశ్వర స్వామీ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గండం శ్రీనివాస్, ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ, మండలంలోని  సర్పంచులు,ఎంపిటిసి లు ,విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ

పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి  భూమిపూజ 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 17 ;  నూతనముగా నిర్మించతలపెట్టిన రెబ్బెన  పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి  ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి,  జిల్లా పాలనాధికారి చంపాలాల్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్   సన్ ప్రీత్ సింగ్ లు గురువారం  భూమిపూజ చేసారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి నాందిగా చిన్నజిల్లాలను ఏర్పాటు,చేసి వాటికి అవసరమైన అన్నివసతుల కల్పనలో భాగంగా స్వంత భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.   ఈ కార్యక్రమానికి రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్, జడ్పీటీసీ బాబురావు,ఎం పి ట్ సి  సంజీవకుమార్  ఆసిఫాబాద్ మార్కెట్ చైర్మన్ గండం శ్రీనివాస్ ,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,  స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.

Wednesday, 16 August 2017

అధికారుల అలసత్వంతో జరగని సర్వసభ్య సమావేశం

అధికారుల అలసత్వంతో జరగని సర్వసభ్య సమావేశం 
      కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 16 ;   ప్రజాసమస్యలపై ప్రతి మూడు నెలలకి ఒకసారి జరగవలసిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం అధికారుల అలసత్వంతో  ఈ రోజు  జరగలేదని ఎం పి  టి సి కోవూరు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ  మండలాధ్యక్షుడు   గంగాపూర్ సర్పంచ్  ముంజం శ్రీనివాస్, సహకార సంగం అధ్యక్షుడు  గాజుల రవీందర్,లు అన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తూ సమావేశం 16న మధ్యాహ్నం  11 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా  రెండు గంటలవరకు ఎవరు రాలేదని ,ఇక ముందైనా బాధ్యతతో సమావేశాలను నిర్వహించి ప్రజా సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. 

బీజేపీ ఆసిఫాబాద్ మండల కార్యవర్గ సమావేశం

  బీజేపీ ఆసిఫాబాద్ మండల కార్యవర్గ సమావేశం 
 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 16 ; బీజేపీ ఆసిఫాబాద్ మండల కార్యవర్గ సమావేశంబుధవారంనాడు ఆసిఫాబాద్ కార్యాలయంలో జరిగింది. ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు కాండ్రే విశాల్ మాట్లాడుతూ మండల కమిటీ సభ్యులు మరియు ప్రతి కార్యకర్త సైనికుడిగా  పనిచేసి బీజేపీ బలోపేతానికి కృషిచేయాలని,అన్నారు. ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో గుండా శంకర్, కాండ్రే  నిర్మల, బండారి గాయత్రీ, ఎం గోపాల్, ఎం మొందన్న, తదితరులు పాల్గొన్నారు. 

మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్

  మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 16 ; విద్యార్థిని విద్యార్థులకు మీజిల్స్ రుబెల్లా  వాక్సిన్ లు  ప్రభుత్వ ఆదేశాలమేరకు రెబ్బెన ప్రభుత్వ ఉన్నతపాఠాశాల లోగురువారం వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో వేయడం జరుగుతుందని పాఠశాలb ప్రధానోపాథ్యాయరాలు స్వర్ణలత  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థుల తల్లితండ్రులు తమ తమ పిల్లలు పాఠశాలకు గైర్హాజర్ కాకుండా చూడాలని కోరారు.

మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా

 మండల  ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా 
   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 16 ; రెబ్బెన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారంనాడు జరగవలసి ఉండగా  సభ్యుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేయడం జరిగిందని  ఎం పి  పి  కర్నాథం సంజీవ్  కుమార్  తెలిపారు.ఉదయం 11 గంటలకు సమావేవం జరగవలసి   సభ్యులు హాజరు కానందువలన సమావేశం వాయిదాపడిందని  తెలిపారు. 

Tuesday, 15 August 2017

గోలేటి సింగరేణి జి ఎం కార్యాలయంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు



 గోలేటి సింగరేణి జి ఎం  కార్యాలయంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 15 ;    బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయంలో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జనరల్ మేనేజర్ కే .రవిశంకర్ ప్రెతాకావిష్కరణ గావించి ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలంగ  లభించిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలని,చేసే ప్రతిపనిని నిబద్దతతో నిర్వహించాలని తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏరియా ఉత్తమ కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. అవార్డులు అందుకున్నకార్మికులు ఖైర్గుడా ఓపెన్ కాస్ట్  కోడూరి రమేష్ ఎఎపి ఆపరేటర్,ఎస్ రమేష్ ఫిట్టర్, దొర్లి ఓపెన్ కాస్ట్  మంద రాములు  ఈ పి  ఆపరేటర్, ఎస్ రమణారెడ్డి ఈ పి  ఎలక్ట్రికల్, ,బె పి ఏఓపెన్ కాస్ట్  2 ఎక్స్టెన్షన్ ఎస్ గిరీష్ చంద్ర ఈ పి  ఆపరేటర్ ఆర్ శ్రీనివాస్ ఫిట్టర్, , ఉత్తమ  ఉద్యోగిగా  ,కోరుట్ల యాదగిరి  ఈ పి  ఆపరేటర్ ను బెల్లంపల్లి ఏరియా నుండి సెలెక్ట్ చేసి కొత్తగూడెం సెంట్రల్ ఫంక్షన్కు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో అధికారులు కార్మికులు పాల్గొన్నారు.

71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

71వ స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకలు

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 15 ;       71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెబ్బెన మండలంలోని మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో  ఎంపీపీ కార్నధం సంజీవ్ కుమార్ తహశిల్దార్ కార్యలయంలో తహశిల్దార్  రమేష్ గౌడ్ రక్షకభటన నిలయం లో ఎసై  నరేష్ కుమార్ , గ్రామపంచాయితీ లో సర్పంచ్ పెసరి  వెంకటమ్మ,గౌతమి సమైక్య కార్యాలయం లో ఎపిఎం వెంకటరమణ ,సహకారసంఘం కార్యాలయం లో చేర్మెన్ గాజుల రవీందర్ లు   జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రధానరహదారుల లో ప్రాబాధ బేరి నిర్వహించి జెండా పండుగను ఘనంగ జరుపుకున్నారు. మరియు తదితర ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయం లో ఈ సందర్భంగా ప్రజలకు 71వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ  ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్, జడ్పిటిసి బాబురావు,మార్కెట్ వైస్ చేర్మెన్ కుదరపు శెంకరమ్మ, వైస్ ఎంపిపి గుడిశల రేణుక  రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ ,,ఎపిఓ కల్పన, సింగల్ విండో చైర్మన్  మధునయ్య  ,వెంకటేశ్వరగౌడ్    తదితర ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

Monday, 14 August 2017

బి ఆర్ అంబెడ్కర్ సంఘం మండల స్థాయి సమావేశం

బి ఆర్ అంబెడ్కర్ సంఘం మండల స్థాయి సమావేశం 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 14 ;    ఆసిఫాబాద్ లో జరుగు బి ఆర్ అంబెడ్కర్ సంఘం  జిల్లా  ప్రత్యేక సమావేశమునకు సన్నాహకంగా  మండల స్థాయి సమావేశం సోమవారంనాడు రెబ్బెన లోని అతిధి గృహంలో జరిగింది. ఈ సమావేశంలో నాయకులు  మాట్లాడుతూ సమస్త దళితులూ,నేతకాని,మెహర్ ,బౌద్ధ ,మరియు వగలి బాంధవులు 19-08-2017 నాడు జరిగే జిల్లా ప్రత్యేక సమావేశమునకు హాజరై జయప్రదంచేయాలని కోరారు.  ఈ  సమావేశంలో లుంబిని దీక్షభూమి వార్షికోత్సవ కార్యక్రమం పై చర్చ మరియు ఎస్ సి వర్గీకరణపై నిరసన కార్యక్రమం కలెక్టరేట్ ముట్టడి మొదలగు కార్యక్రమంలను జయప్రదంచేయుటకై మండలం లోని దళిత బంధువు అందరు తప్పక హాజరు కావాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ అధ్యక్షులు అశోక్ మహార్కర్ ,సభ్యులు ఆత్మారాం పెరుగు, పుల్లయ్య కాంబ్లీ, వినీష్  ఉపిరి ,శ్యామరావు దుర్లే , జిమిది భగవాన్ ,దుర్గం సోమయ్య, డోంగ్రే రాంచందర్ ,దుర్గం విజయ్ తదితరులు పాల్గొన్నారు.  

జిల్లాలో డిగ్రీ కళాశాలకై పోరాడుదాం

జిల్లాలో డిగ్రీ కళాశాలకై పోరాడుదాం

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 14 ;   ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,ఐటీఐ,పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసే వరకు పోరాడుదామని జెఎసి జిల్లా కన్వీనర్ రమేష్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఉపేందర్ తెలియజేశారు. సోమవారం రోజున ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గీతం పాఠశాలలో జెఎసి ఆద్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధకారమని అన్నారు. ఆదివాసులు,గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో ఉన్నత విద్య లేకపోవడం వలన చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నరాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదవాలంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వేళ్ళాల్సి వస్తుందని అన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే విద్య అభివృద్ధి చెందాలని అన్నారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసిన మండలల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే డిగ్రీ కళాశాల కొరకు అన్ని విద్యార్థి,యువజన,కుల,ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య,సాయి,ప్రణయ్,మొండయ్య,రాజు తదితరులు పాల్గొన్నారు...

ఉత్తమ కార్మికులను సన్మానించనున్న యాజమాన్యం

ఉత్తమ కార్మికులను సన్మానించనున్న యాజమాన్యం 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 14 ;  విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి ఉత్తమ కార్మికులుగా ఎంపికైన కార్మికులను నేడు 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ పాల్గొని  అవార్డులు అందించి,సన్మానించనున్నారు.కాగా కైరీగూర ఓపెన్ కాస్ట్  నుండి ,ఈపీ ఆపరేటర్  కె.రమేష్,  ఎం. రాములు, ఎస్. రమణారెడ్డి ,ఎస్ గిరీష్ చంద్ర ,ఆర్ . శ్రీనివాస్ లను ఎంపిక చేసినట్టు డి వై పి ఎం బి. సుదర్శనం తెలిపారు బెల్లంపల్లి ఏరియా నుండి ఉత్తమ  ఎన్  సి  డబ్ల్యూ ఏ  ఉద్యోగులుగా  శ్రీ కోరుట్ల యాదగిరిని ఎంపిక చేసినట్టు తెలిపారు సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెం లో  సి అండ్ ఎం డి   చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు గోలేటిలోని సింగరేణి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కుమారి జంగంపల్లి చందనను ఉత్తమ  మెరిటోరియస్ విద్యార్థినిగా  ఎన్నుకోవడం జరిగిందని గోలేటిలో జరుగు స్వతంత్ర వేడుకలలో ప్రశంస పత్రాన్ని అందచేస్తామని తెలిపారు.

Saturday, 12 August 2017

సోమవారం డయల్ యువర్ జీఎం


సోమవారం డయల్ యువర్ జీఎం 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 12 ;   బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్ షిప్ లోని ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తేదీ 14-08-2017 సోమవారం రోజున  డయల్ యువర్ జీఎం కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామని,ఏరియాలోని ఉద్యోగులు,కార్మికులు,వారి కుటుంభ సభ్యులు  వారి వారి నసమస్యల పరిష్కారం కోసం ఫోన్ చేసి నేరుగా జీఎం దృష్టికి సమస్యలు తీసుకురావచ్చని ఏరియా అధికార ప్రతినిధి తెలిపారు.ఫోన్ ద్వారా సంప్రదించడానికి 08735-231100 కు డయల్ చెయ్యాలని కోరారు.ఈ అవకాశాన్ని వీనియోగీచుకోవాలి అని తెలిపారు. 

ఎన్నికల హామీలను తెరాస అమలు చేయాలి ; సిపిఐ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్

ఎన్నికల హామీలను తెరాస అమలు చేయాలి
            సిపిఐ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 12 ;    రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని సిపిఐ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రోజున గోలేటిలోని కెఎల్ మహేంధ్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు దళితులకు మూడు ఎకారాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, జిల్లాకు సూపర్ స్పెషలిటి హస్పిటల్ ను మంజూరు చేస్తామని చెప్పి నేటి వరకు ఒక్క హమీ అమలు చేయలేదని అన్నారు. దేశంలో దళితులపై దాడులు జరుగుతున్న బిజెపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నిన్న కామారెడ్డిలో జెఎసి ఆద్వర్యంలో తలపెట్టిన అమరవీరుల స్పూర్తి యాత్రలో టి.ఆర్.ఎస్. నాయకులు కార్యకర్తలు జెఎసి నాయకులపై,ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నమని అన్నారు. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు దిగితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నిరసనలు తెలిపెందుకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని ఆ హక్కులను కాలరాయడం సరికాదని అన్నారు. నెరెళ్ళలో జరిగిన సంఘటనలో పోలీసుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణ శంకర్,జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,జిల్లా నాయకులు జగ్గయ్య,ఉపేందర్,నర్సయ్య,ఒదేలు,గణేష్,తిరుపతి,పిడుగు శంకర్ తదితరులు పాల్గొన్నారు...

విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాము ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాము 
                   ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 12 ;     అఖిల భారత విద్యార్ధి సమాఖ్య  ఏఐఎస్ఎఫ్ 82 వ ఆవిర్భావ దినోత్సవం  సందర్బంగా  రెబ్బెనలో    ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,అసిఫాబాద్ లో డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,వాంకిడి లో డివిజన్ అధ్యక్షుడు బావునే వికాస్ లు  ఏఐఎస్ఎఫ్ జెండాను  ఆవిష్కరిoచారు.అనంతరం వారు  మాట్లాడుతు      విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని  అన్నారు.బ్రిటిష్ పరాయి పాలకుల చెర నుంచి మాతృ భూమి విముక్తికై  సాగిన వీరోచిత పోరాటంలో పిడికిలి బిగించి స్వాతంత్య్రం మా జన్మ హక్కు అని చాటి 1936 ఆగష్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని లక్నో పట్టణంలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ను స్థాపించడం జరిగిందని అన్నారు. దేశంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస విద్యను ప్రైవేటీకరణ,కాషాయీకరణ,కార్పొరేటీకరణ చేసే ప్రయత్నాలు  చేస్తున్నాయని అలాంటి విధానాలకు ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుందని అన్నారు.రాష్ట్రంలో తెరాస పాలన నియంత పాలనను తలపిస్తుందని,ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి అక్రమ కేసులు పెట్టి ఇబబంధులకు గురి చేస్తున్నారని అన్నారు.ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండ ఈ పాలకులు నిర్లక్షం ప్రదర్శిస్తున్నారని అన్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన,అసిఫాబాద్,వాంకిడి మండలాల కార్యదర్శులు పర్వతి సాయికుమార్,గడ్డల ప్రణయ్,తిరుపతి,మహేష్,జె.సాయి,జె.సంజయ్,సిరికొండ రాజుకుమర్, అన్వార్,సాగర్ తదితరులు పాల్గొన్నారు. 

Friday, 11 August 2017

ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి సిగ్గుచేటు ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడి సిగ్గుచేటు ; 
               ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 11 ;   కామారెడ్డిలో జెఎసి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అమరవీరుల స్పూర్తి యాత్రలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై తెరాస నాయకులు దాడి చేయడం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డిలో శాంతియుతంగా నిర్వహిస్తున్న అమరవీరుల స్పూర్తి యాత్రలో పాల్గొన్న వారిపై రాళ్ళతో,కోడి గుడ్లతో,కూర్చిలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చరని ఈ దాడిలో ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కోశాధికారి పృథ్వి తీవ్రంగా గాయపడ్డారని, పృథ్వికి ఎలాంటి హనీ జరిగిన రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగం ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి  ఒక్క పౌరునికి ఉందని,ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నరని అన్నారు.సభలో తెరాస . నాయకులు, కార్యకర్తలు గుండాలుగా వ్యవహరించి దాడి చేయడం తెరాస యొక్క విధానం బయటపడిందని అన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ,అక్రమంగా అరెస్టులు చేసి,కేసులు బనాయించడం చూస్తుంటే కేసీఆర్ నియంత పాలన కనపడుతుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన మాత్రమే కొనసాగించాలని,నియంతల వ్యవహరిస్తున్నడని అన్నారు.తెరాస నాయకుల దాడిలో గాయపడిన  పృథ్వికి ఏం జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.దాడి  చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి  పూదరి సాయికిరణ్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి నర్సయ్య,ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవీ,మండల కార్యదర్శి పర్వతి  సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు..

పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి ; జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్


పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి  జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్ 
 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 11 ;   కుమురం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ లు ప్రజలకు ఎల్లవేళలా ఆందుబాటులో ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారి  సన్ ప్రీత్ సింగ్ అన్నారు.శుక్రవారం జిల్లాలో  స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన ఏ వెంకటేశ్వర్ కాగజ్ నగర్ టౌన్ సి.ఐగా,వాంకిడి సి.ఐగా విధులు  నిర్వర్తించిన ఎన్.ప్రసాదరావు  కాగజ్ నగర్ రూరల్ సి.ఐగా జిల్లా పోలీస్ కార్యాలయంలో  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు జిల్లాలో   శాంతిభద్రతలను కాపాడాలని,అందుకు  పర్యవేక్షణలో నూతన సాంకేతికతను సమర్ధవంతంగా ఉపయాగించుకోవాలని  సూచించారు.ఈ కార్యక్రమంలొ కాగజ్ నగర్ డిఎస్పి హబిబ్ ఖాన్,పరిపాలనాధికారి  ప్రహ్లద్, సీనియర్ అసిస్టెంట్ లు ఇంతియాజ్,సూర్య కాంత్,ఎస్పి సి.సి డి.శ్రినివాస్ లు పాల్గొన్నారు.

Thursday, 10 August 2017

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం 
   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 10 ; ఆగస్ట్ 1వ తేదీన ఆసిఫాబాద్ మండలం  చిన్న రాజూర గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వాజిద్ అనే వ్యక్తీ కుటుంబానికి 6500/-రూపాయల ఆర్ధిక సహాయాన్ని అసిఫాబాద్ యువజన సంఘాల జేఏసీ నాయకులూ అందించారు.అలాగే వారి కుటుంబానికి ఎలాంటి సహాయం అవసరం ఉన్న ఆసిఫాబాద్ యువజన జేఏసీ  సహాయ పడడానికి సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు ప్రతాప్ కుమార్,అనుమండ్లా సాయి క్రిష్ణ,కార్తీక్,అమర్,రాకేష్, రాజేందర్,సాయి,సంజీవ్,రాజ్ కుమార్,ఖజా మోయినోద్దిన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

దేశ వ్యాప్తంగా ఉచిత విద్యను అమలుపర్చాలి : ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

దేశ వ్యాప్తంగా ఉచిత విద్యను అమలుపర్చాలి :
            ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 10 ;    విద్యారంగంలో  నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిర్విరామంగా పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య,(ఏఐఎస్ఎఫ్)జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు.గురువారంనాడు గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ గోలేటి పట్టణ సమావేశానికి ముఖ్య అతిధిగా రవీందర్ పాల్గొని మాట్లాడుతు ఏఐఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలనీ అన్నారు.రాష్ట్రంలో,దేశంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాల్సి ఉన్నదని,విద్య విధానంలో కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రవేశపెట్టాలని,ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత విద్యను అందించాలని  అన్నారు.కానీ ఈ ప్రభుత్వాలు విద్య వ్యవస్థను కార్పోరేట్,ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించి విద్యను వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు.విద్యా వ్యాపారీకరణ,కాషాయీకరణ,ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అమలు పర్చాలని డిమాండ్ చేశారు.డిగ్రీ చదువులో డిటెన్షన్ విధానాన్ని అమలు పర్చాలని తెరాస ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెంటనే డిటెన్షన్ విధానాన్ని విరమించుకోవాలని అన్నారు.పెండింగ్ లో ఉన్నా బోధనారుసుములు,ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.కొమురం భీం ఆసిఫాబాద్  జిల్లా ఏర్పడి 10నెలలు గడుస్తున్నా జిల్లా కేంద్రంలో ఐటిఐ,డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలల మాటే లేదని,కళాశాలలను వచ్చే విద్య సంవత్సరంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఏఐఎస్ఎఫ్ పోరాటాల ఫలితంగా సాధించుకున్న రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన  భవనం పూర్తి అయ్యి  మూడు  సంవత్సరాలు అయినప్పటకి,దానికి విద్యుత్,వివిధ సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభం చేయడంలో ఇప్పటి అధికారులు,ప్రజాప్రతినిధులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.విద్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు సాగుతుందని అన్నారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రెబ్బెన మండల అధ్యక్షులు ఎం.మహిపాల్,కార్యదర్శి పర్వతి సాయికుమార్,గోలేటి పట్టణ అధ్యక్షులు పడాల సంపత్,కార్యదర్శి జాడి సాయికుమార్,నాయకులు రాజేష్,రాజ్ కుమార్,కృష్ణ,సంజయ్,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.