కస్టపడి చదివి ఎంపికైన ;ఎం ఏ నదీం
హార్టికల్చర్ అధికారిగా ఎం ఏ నదీం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; జిల్లా హార్టికల్చర్ అధికారిగా నదీం ఎంపికయ్యారు . స్థానిక విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారు . రెబ్బెన గ్రామానికి చెందిన నదీం ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యాభ్యసించారు స్థానిక జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూప్ లో ఇంటర్ పూర్తి చేసారు. 2008 ఎం సెట్ లో రాష్ట్ర స్థాయిలో 40725 ర్యాంకు సాధించి వైఎస్ ఆర్ యునివేర్సిటి లో బిఎస్ సి హార్టికల్చర్ పూర్తి చేసారు. టీఎస్ పీఎస్ సి నిర్వహించిన పరీక్షల్లో 450మార్కులకు 300 మార్కులు సాధించారు 20/3/2017 టీఎస్ పీఎస్ ప్రకటించిన ఫలితాలలో ఉద్వన అధికారిగా ఎంపికయ్య్యారు. నదీంను స్థానిక ఎంపీపి సంజీవ్ కుమార్, జెడ్పిటిసి బాబురావు సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ బి శ్రీధర్, మండల్ తెరాస అధ్యక్షులు పి శ్రీధర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎం ఏ జాకీర్ ఉస్మాని, మోడెం సుదర్శన్ గౌడ్, జిల్లా ప్రైవేట్ పాఠశాల స్సంగం అధికార ప్రతినిధి దీకొండ సంజీవ్ కుమార్, బెజ్జుర్ ఏ.పి.ఓ ఎం ఏ. షాకీర్ ఉస్మాని, ఆసిఫాబాద్ ఏ.పి.ఓ చంద్ర శేఖర్, రెబ్బెన డిగ్రీ కలశాల ప్రింసిపల్ అమీర్ ఉస్మాని లు అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన వనాలు , పండ్ల తోటలు పెంపకం కోసం అభివృద్ధి చేయటానికి శాయ శక్తుల కృషి చేస్తానని ఎం ఏ నదీం అన్నారు. ఎం ఏ నయీమ్ రెబ్బెన గ్రామంలో హోటల్ నిర్వహిస్తూ పిల్లకు చదివించారు. ప్రస్తుతం నదీం ఆసిఫాబాద్ మండలంలో ఉపాధి హామీ పథకంలో ఇంజనీర్ కన్సల్టెంట్ గ విధులు నిర్వహిస్తున్నారు.
No comments:
Post a Comment