Monday, 27 March 2017

మాస్ కాపింగ్ కు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలి

                  మాస్ కాపింగ్ కు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 27 ;     రెబ్బెన మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల్లో పదో తరగతి జీవశాస్త్రం ద్వితియా పరీక్షా జరుగుతుండగా ప్రైవేట్ పాఠశాల నిర్వహికులు చరవాణి ద్వారా ప్రశ్న పత్రాలను బయటి వ్యక్తులకు పంపించి మాస్ కాపింగ్ కు పాల్పడుతున్నట్లు  ఆసిఫాబాద్ న్యాయవాది పి.నరహరి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇట్టి విషయాన్ని రెబ్బెన సి.ఐ.,ఎస్.ఐ.,డిఈవో లకు వాట్సప్ ద్వారా తెలియజేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మాస్ కాపింగ్ కు ప్రొత్సహించిన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకొవాలని ప్రజలు కోరుతున్నారు ?

No comments:

Post a Comment