రెబ్బెనలో భూకబ్జాలపై సి ఐ విచారణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; కొమరంభీం జిల్లాలోని రెబెన మండలం లో పులికుంట గ్రామంలో 123/1 సర్వేనెంబర్ గల భూమి దొంగ రిజిస్ట్రేషన్ చేయించారని ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ కు ప్రజా పిర్యదు విభాగం లో బొమ్మినేని లక్ష్మి విన్నపించగా ఎస్ పి ఆదేశాల మేరకు మంగళవారం సి ఐ మదన్ లాల్ విచారనాలో భాగంగా హద్దులు మర్చి సర్వే నెంబర్ మర్చి దొంగ రిజిస్ట్రేషన్ చేయించినట్లు బొమ్మినేని లక్ష్మి సి ఐ మదన్ లాల్ కు సంభందిత పత్రాలు చూపించి వారి యొక్క భాదను తెలియజేసారు. సి ఐ మదన్ లాల్ ఇరువురిని పిలిచి విచారించారు. ఇట్టి విషయంన్ని రెబ్బెనకు విచ్చేసిన కలెక్టర్ చంపాలాల్ దృష్టికి తీసుకెళ్ళగా తహసీల్దార్ రెండు రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా సొంత పట్టాదారు బొమ్మినేని లక్ష్మి తన సొంత భూమిని కొంత మంది రియల్ ఎస్టేట్ దందా నడుపు తున్న వారు దొంగ పట్టాలు చేసి తమకు అన్యాయం చేస్తున్నారని ఓ పత్రిక ప్రకటలో తెలిపారు సంభందిత అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
No comments:
Post a Comment