అభివృద్ధి ఆకర్షితులై తెరాస పార్టీ లో చేరిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 26 ; తెలంగాణ ప్రభుత్వం అమలు పెట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఇతర పార్టీ ల నాయకులూ ఆకర్షితులై తెరాస పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఎంఎల్ ఏ కోవా లక్ష్మి అన్నారు. ఆదివారం కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ తన స్వగృహములో నూతన కార్యకర్తల చేరిక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎన్నో చేసిందని రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని ఇతర పార్టీల వారు ఆకర్షితులై నూతన సభ్యత్వలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెబ్బెన మండలం లోంచి ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ సభ్యత్వాలు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కి ప్రతి ఒక్క సాయ సహకారాలు అవసరమని అందుచే నూతన సభ్యత్వాలను ఏ సమయం లో నైనా ఆహ్వానం పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాథం సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబు రావు, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ ఛారీమెన్ కుందారపు శంకరమ్మ, మండల అదేక్షుడు కోట శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోమశేఖర్ , మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్, గజ్జెల సత్యనారాయన , ఎరగటి పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment