Friday, 17 March 2017

ప్రారంభమైన పదోవ తరగతి పరీక్షలు

ప్రారంభమైన పదోవ తరగతి పరీక్షలు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 17 ;  పదోవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం అయ్యాయి.పరీక్షల కోసం రెబ్బెన మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 404 మంది హాజరు కావాల్సి  ఉండగా 403 మంది విద్యార్థులు హాజరై, ప్రశాంతంగా జరిగినట్లు ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి తెలిపారు. రెబ్బెన జిల్లా  పరిషత్,గంగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్షా తొలి రోజు విద్యార్థులు హాజరు అయ్యారు.పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయ్యింది. పరీక్షా కేంద్రాలలో తాగునీటి,మౌలిక  సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వార్డ్ మల్లయ్య తనిఖీ చేసారు.

No comments:

Post a Comment