రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులో అన్యాయం
ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,49,446 కోట్ల రూ..ల్లో విద్యారంగానికి 12,705 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని KG to PG ఉచిత విద్యకు కేటాయింపుల్లో నిధులు కేటాయించకపోవడం విశ్వవిద్యాలయాల విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ,ఫీజు రీయింబర్స్ మెంట్ కు కావలసిన 3 వేల కోట్లు కేటాయించకపోవటం, గత ఆంధ్ర పాలకులు ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే చాలా దారుణంగా ఈ బడ్జెట్ ఉందని ఈ బడ్జెట్ వల్ల విద్యారంగానికి ఒరిగింది ఏమి లేదని ,రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 10 శాతానికి మించి కేటాయింపులు జరగడం లేదని ఈ బడ్జెట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కుమురం భీం జిల్లా సమితి పక్షాన తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత ప్రవేశ పెట్టిన 4వ బడ్జెట్ లో కూడా విద్యారంగానికి నిరాశ మిగిలిందని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శతబ్ది ఉత్సవాలకు కేవలం రెండు వందల కోట్లు కేటాయించడం దారుణమని, విశ్వవిద్యాలయాల సమగ్ర అభివృద్ధికి ఐదు వందల కోట్లు అవసరం ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, విశ్వవిద్యాలయాల విద్యార్థుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతుందని కె.జి టూ పి.జి. ఉచిత విద్యకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కేవలం గురుకులాల ఏర్పాటు ద్వారానే కె.జి. టూ పి.జి. సాధ్యం కాదని ప్రత్యేకంగా దాని అమలుకు యబై వేల కోట్లు కేటాయించవలసిన అవసరం ఉందన్నారు.పెండింగ్ స్కాలర్ షిప్స్ రియింబర్స్ మెంట్ కు ఈ విద్యాసంవత్సరానికి కలిపి మూడు వేల కోట్లు అవసరం ఉండగా కేవలం 1,939 కోట్లు మాత్రమే కేటాయించారని పూర్తి స్థాయిలో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ చూస్తే దళితులను,గిరిజనులను,బి.సి.,మైనారిటీలను విద్యకు దూరం చేసే విధంగా ఉన్నదని,గత బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయి ,నాయకులు ప్రశాంత్ ,శరత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment