కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; తెలంగాణ జాగృతి వ్వవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భముగా తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షుడు రంగు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రెబ్బన అతిధి ఆవరణ గృహం లో జన్మదిన వేడుకలు జరిపారు . ముందుగా కేక్ కట్ చేసి కవితక్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షుడు రంగు మహేష్ గౌడ్ మాట్లాడుతూ యూవతకు ఉపాధి తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తూ అన్నిరంగాలలో మహిళలకు ఉపాధి కల్పిస్తూ అందరికి మైలు రాయి గా నిలిచింది అన్నారు. అలాగే మన రాష్టం లోనే కాకా ఇతర రాష్టాలలోను మన సంప్రదాయాలను తెలియజేయడానికి కృషి చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ,సుదర్శన్ గౌడ్ ,సోమశేఖర్ , ఎం శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, పర్వతాలు, మహిళా నాయకురాలు బోయిని శంకరమ్మ ,బొంగు దేవక్క , పద్మ , ఆత్రం లక్ష్మి , గన్న లక్ష్మి , కుమ్మరి రాజక్క , పొసక్క పాల్గోన్నారు.
No comments:
Post a Comment