ఫీజ్ పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదు ; విద్యార్థుల సంరక్షకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 06 ; పాఠశాలలో విద్యార్థులని హింసించడం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు అజయ్ కుమార్ జైస్వాల్ ఓ పత్రిక ప్రకటన ద్వారా సోమవారం తెలిపారు. రెబ్బెన మండలం లోని అన్నపూర్ణ హై స్కూల్ లో ఫీజ్ కట్టలేదని విద్యార్థులను పాఠశాల ఆవరణలో నిలబెట్టడం తో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజ్ కట్టడానికి వెళ్లి చూడగా విద్యార్థులని నిలబెట్టడం చూసి ఇదేంటిదని ప్రశ్నించి ఫీజ్ కట్టి, ఫీజ్ ఏమైనా బకాయిలు ఉంటె విద్యార్థుల సంరక్షులను అడిగి తీసుకోవలని ఇలా విద్యార్థులను గంటల తరబడి నిలబెట్టడం చాల బాధాకరమని తెలిపారు. ఇదెంటిదని ఎం ఈ ఓ ని వివరణ కోరగా విద్యార్థులు ఫీజ్ గడువు ముగియడం తో ఒకే సారి ఫీజ్ కడతానికి వచ్చారని అందుకే వారు నిలబడ్డారని అయన పాఠశాల తరుపున ఒత్తాసు పలికారని ఆయన పెకొన్నారు. స్కూల్ యాజమాన్యం తో అధికారులు అందండలతోనే కొనసాగుతున్నట్లు అయన ఆవేదన వ్యక్తం చేసారు. విద్యార్థి నాయకులు ప్రైవేట్ పాఠశాలలో ఫీజ్ ల పేరట విద్యార్థులను మానసికంగా హింసించడం తగదని, ప్రైవేట్ పాఠశాల ఫీజ్ దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనతోపాటు విధ్యార్థుల తల్లిదండ్రులు బి,వెంకటరమణ, బి నరేందర్,ఎం వెంకట్స్వేర్ గౌడ్, రాజ్ కుమార్ జైస్వాల్ తదితరులు ఆరోపించారు.
No comments:
Post a Comment