ఏఐటీయూసీ డోర్లీ -1 ఉప ఫిట్ కార్యదర్శిగా వి.మదన్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 14 ; బెల్లంపల్లి ఏరియా డోర్లి ఉపరితల గని ఏఐటీయూసీ ఫిట్ ఉప కార్యదర్శిగా ఈపీ ఆపరేటర్ వి.మదన్ ను ఎన్నుకోవడం జరిగిందని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,డోర్లి-1 గని ఫిట్ కార్యదర్శి నర్సింహా రావు తెలియజేశారు.అదే విధంగా రిలే -A ఇంఛార్జిగా బి.శ్రీనివాస్,రిలే-B ఇంఛార్జిగా అంబాలా ఓదెలు,రిలే-C ఇంఛార్జిగా వెంకన్న,జనరల్ షిఫ్ట్ ఇంఛార్జిగా చుంచు రాజన్న,బేస్ వర్క్ షాప్ ఇంచార్జిగా చంద్రయ్య,మైన్స్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సోమవారంనాడు రెబ్బెన మండలం గోలేటిలోని కేఎల్ మహేంద్రభవన్ లో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సమస్యలు ఒక్క ఏఐటీయూసీతోనే తీరుతాయని ఆయన అన్నారు.అవగాహణ లేని టీబిజీకేఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమై,యూనియన్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలతో ద్వారా సమావేశాలు నిర్వహించే స్థితికి చేరిందని ఆయన విమర్శిoచారు.కార్మికులను మరల మోసం చేసేందుకు సిద్ధమవుతున్న టీబిజీకేఎస్ కు కార్మికులే బుద్ధి చేప్తారని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులూ బి.జగ్గయ్య,శేషు,జూపాక రాజేష్,నర్సింహారావు,చక్రధర్,కిరణ్బాబు,భిక్షమయ్య,ఎం.సత్యనారాయణ,దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment