Tuesday, 14 March 2017

విధ్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణి

విధ్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణి 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 14 ;  రెబ్బెన మండలం పులికుంట కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రెబ్బెన మండల తహశీల్ధార్ బండారీ రమేష్ గౌడ్ తన కుమారుడు స్మారకార్థం క్రీడా సామాగ్రిని,దుస్తులను,నోటు పుస్తకాలను అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవలక్ష్మి ముఖ్య అతిధిగా హాజారు అయ్యారు. అదే విదంగా పులికుంట రోడ్డు పాఠశాలలో  భాజపా నాయకుడు గుల్భము చక్రపాణి,శ్రీపతి,రంగు మహేష్ గౌడ్ విధ్యార్ధులు కూర్చోడానికి బెంచీలు అందజేశారు.ఈ సందర్భoగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి.తహశీల్ధార్  రమేష్ గౌడ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవచేయడం చాల సంతోషoగా ఉందని అన్నారు  ఈ కార్యక్రమంలో  మండల విద్యశాఖాధికారి  వెంకటేశ్వరస్వామి,ఆసిఫాబాద్  మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,  సర్పంచులు వెంకటమ్మ,సుశీల,నాయకులు నవీన్ కుమార్ జైస్వాల్,  చెన్న సోమశేఖర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్,చిరంజీవి గౌడ్, రాపర్తి అశోక్, ఇప్ప  భేమేష్,రంగు మహేష్ గౌడ్,శ్రీపతి,ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్,లక్ష్మి,విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment