కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 4 ; రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి రెబ్బెన మండల గౌతమి సమాఖ్య ఐకేపీ వీవోఏలు శనివారంనాడు కార్యాలయ ఆవరణలో పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా వీవోఏలు జిల్లా ప్రదాన కార్యదర్శి జి.భీమేష్,ఉపాధ్యక్షులు డి.తిరుపతిలు మాట్లాడుతూఐకేపీ గ్రూపుల్లో పని చేస్తున్న వీవోఏలను ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించి జీతాలు పెంపుకై కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు.గత ప్రభుత్వాలు సిఏ లను విస్మరించాయని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరు అయిన రెబ్బెన ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్,జడ్పీటీసీ ఎ.బాబూరావులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా అమలు పరుస్తు, అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షురాలు శంకరమ్మ, రెబ్బెన సర్పంచ్ పెసారు వెంకటమ్మ, గోలేటి ఎంపీటీసీ వనజ, ఏపీఎం వెంకటరమణ శర్మ తెరాస నాయకులు చెన్న సోమశేఖర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్,చిరంజీవి గౌడ్, రాపర్తి అశోక్, వీవోఏల మండల అధ్యక్షులు లింగన్న,కార్యదర్శి వెంకటేష్,శ్రీకాంత్,తిరుపతి,ప్రభాకర్,కృష్ణ,పరమేష్,రవి,రజిత,సులోచన తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment