Friday, 17 March 2017

సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్క రించే వరకు ఆందోళన కార్యాక్రమలు చేపడతాం ; బోగే ఉపేందర్.


సింగరేణి కాంట్రాక్టు కార్మికులు  సమస్యలు పరిష్క రించే వరకు ఆందోళన కార్యాక్రమలు చేపడతాం ;  బోగే ఉపేందర్. 



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 17 ;  సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కరించి పేర్మినెంట్ చెసే  వరకు ఆందోళన కార్యక్రమాలు  చేపడతామని  ఎ ఐ టి యు సి బ్రాంచ్ అద్యక్యుడు బోగే ఉపేందర్ అన్నారు. శుక్రువారం రెబ్బెన మండలం లోని గోలేటి ప్రధాన రహ దారి ఫై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణి మరియు ఓపెన్ కాస్ట్ ఓబీ లలో  ఒప్పంద పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేక పోతేఆందోళన కార్యక్రమాలు  చేపడతామని .సింగరేణి లో అస్సలు ఒప్పంద కార్మికులే లేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ అనడం చాల బాధాకరం అని ఆయన  అన్నారు. అదే విధంగా హైపవర్ కమిట వేతనాలు అమలు చేయాలనీ,బోనస్ చట్టం ప్రకారమా ఒప్పంద కార్మికులకు 8.33శాతం బోనస్ చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ లలో స్థానిక నిరుద్యోగ యువతకు  అధిక ప్రాధాన్యం ఇవ్వాలని,ఒప్పంద కార్మికులకు సింగరేణి యూనియన్ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు. హెచ్ పి సి వేతనాల  గురించి బోనసులు  ఎన్ సి డబ్ల్యూ ఎ వర్తింపుల పై మరియు కాంట్రాక్ట్ కార్మికుల పర్మినేట్ చేయడం  కొరకు పర్మింట్ కోటర్స్ కల్పించాలన్నారు  ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు  కార్మికులు రాయిలా నర్సయ్య,  బండారు తిరుపతి,చల్లూరి అశోక్, రామస్వామి , మొగిలి ఐఫ్టీయూ   చంద్ పాషా  , సికిందర్  కార్మికులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment