Tuesday, 7 March 2017

పెండింగు లో ఉన్న కేసుల పరిష్కరనికి కృషి చెయ్యాలి ; జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

పెండింగు లో ఉన్న కేసుల పరిష్కరనికి  కృషి చెయ్యాలి  ; జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) మార్చి 07 ;   పెండింగు లో ఉన్న కేసుల పరిష్కరనికి  కృషి చెయ్యాలని  జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారము జిల్లా పోలీసు కార్యాలయములో జిల్లా ఎస్పీ అద్వర్యంలో  పొలిసు అదికారులతో నేరా సమిక్ష సమావేశాన్నీ నిర్వహించి  కేసుల వివరాలు తెల్సుకుని మాట్లాడారు.   గత మూడు నాలుగూ సంవత్సరాల  నుండి  పెండింగు లో ఉన్న కేసులకు ప్రధానంగా  దానికీ గల కారణాలకు అయన అడిగి, వెంటనె కేసులను పరిష్కరించాలని అదేశించారు. చాల రోజులనుండి  పెండింగ్లో  ఉన్న కేసులను త్వరితగతిన  పరిష్కరించాలని , గ్రామ పోలీసు వ్యవస్థను  మరింత  పటిష్టం  చేయలని క్రింది  స్థాయి  సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను పై అదికారులకు తెలియజెసి సమస్య పరిష్కరించేలా  చుడాలని సుచిచ్చారు.  అదేవిదంగా ఎండ కాలం కావున  జిల్లా లోని   ప్రతి మండలలో ప్రజలు రద్దీ ఉండే ప్రాంతాలలో  పొలిసు వారి తరపున  చలి వేంద్రాలు  ఎర్పాటు చేయలని అదేశించారు. మైనర్  లకు వాహనాలు నడుపుటకు అనుమతి ఇవ్వొద్దని , మైనర్లు  నడిపే   వాహనాలను ఇకపై   సీజు  చేస్తామనీ  అన్నారు.  ఈ సమవేశంలో డి ఎన్ పి లు హబీబీఖాన్,బాస్కర్, సి ఐ లు ఎన్ ఐ లు మరియు డి సి ఆర్ బి  ఎన్ ఐ రామరావు లు తదితర సిబ్బంది పాల్గోన్నారు.

No comments:

Post a Comment