Friday, 24 March 2017

టీ.ఆర్.ఎస్, టి.బి.జి.కె.ఎస్. వైఫల్యంతో కార్మిక కుటుంబాలల్లో ఆందోళనలు


                      టీ.ఆర్.ఎస్, టి.బి.జి.కె.ఎస్. వైఫల్యంతో కార్మిక కుటుంబాలల్లో ఆందోళనలు 



   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 24 ;    2012 లో సింగరేణిలో జరిగిన ఎన్నికలల్లో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాన ఎజెండా పెట్టుకొని ఎన్నికలల్లో గెలిచిన టిబిజికెయస్, 2014లో జరిగిన ఎన్నికలల్లో టి.ఆర్.యస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టి.ఆర్.యస్. ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలపై కాలయాపన చేయడం జరిగిందని ఎఐటియుసి గోలేటి బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య అన్నారు. గోలేటిలోని కెయల్ మహేంధ్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని ఎఐటియుసి ఆద్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేయగా సింగరేణిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనాలోచిత పద్దతులల్లో ఏకపక్షంగా వారసత్వ ఉద్యోగాలను ప్రకటించారని,వారసత్వ ఉద్యోగాలపై అవగాహన ఉన్న ఎఐటియుసి నాయకత్వం వారసత్వ ఉద్యోగాలకు 12(3) యాక్ట్ ప్రకారం ఆర్.యల్.సి. వద్ద అగ్రిమెంట్ చేసుకుంటే దీనికి ఎలాంటి ఇబ్బందులు రావాని సలహ ఇవ్వడం జరిగిందని ఆ మాటను పెడచెవిన పెట్టిన టి.బి.జి.కె.యస్. నాయకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నేడు కార్మిక కుటుంబాలను మానసికంగా ఆందోళనకు గురి చేసిందని అన్నారు. కనీస అవగాహన లేకుండా వారసత్వ ఉద్యోగాలకు ఎలాంటి చట్టబద్దత కల్పించకుండా ఉద్యోగాలను ప్రకటించడం వలన ఒక నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించడం వలన ఈ రోజు హైకోర్టు వారసత్వ ఉద్యోగాలను నిలిపివేయడం జరిగిందని అన్నారు. చట్టబద్దత కల్పించి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. సింగరేణి కార్మికుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో టి.బి.జి.కె.యస్. నాయకుల అనాలోచిత నిర్ణయం వలన కార్మిక కుటుంబాలు మానసికంగా బాధ పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టబద్దంగా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు అమలు జరిగే వరకు ఎఐటియుసి గా కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి ఆర్గనైజింగ్ కార్యదర్శి శేషు,నాయకులు సురేష్ కోరి,ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎఐవైఏఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు బోగే ఉపేందర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment