కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 11 ; మార్చ్ 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని పి ఆర్ టి యూ ఉపాధ్యాయుల సంగం కోరుతుంది శనివారం పి ఆర్ టి యూ అద్వర్యం లో రెబ్బెనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పి ఆర్ టి యూ మండల అధ్యక్షులు ఖాదర్ మాట్లాడుతు ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 15 నుండి ఒంటిపూట బడులను నిర్వహించెది అన్నారు. ఈ ఏడాది రెండు పుటలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాదని దింతో విద్ద్యార్థులు ఎండా వేడిమికి, మంచినీటికి ఇబ్భదులు పడుతున్నారు అన్నారు. ఎండా తీవ్రత అధికంగా ఉండటం వలన రెండు పూటలా నిర్ణయాన్ని ఉప సంవరించు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పి ఆర్ టి యూ మండల ప్రధాన కార్యదర్శి ఢీ రవి కుమార్, జిల్లా కౌన్సలర్ ఎస్ వెంకటేష్, అషోషన్ అధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment