Wednesday, 22 March 2017

నీటి సంరక్షణ అందరి బాధ్యత ; జిల్లా పాలనాధికారి చంపాలాల్

నీటి సంరక్షణ అందరి బాధ్యత 
జిల్లా పాలనాధికారి చంపాలాల్ 

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 22 ;  సమస్త జీవకోటి  మానవాళి నీటి మీదా ఆధారపడి   జీవనం సాగిస్తున్నారని అలాంటి  నీరుని కాపాడుకోవలిసిన  భాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా పాలనాధికారి చంపాలాల్ అన్నారు ప్రపంచ జలదినోత్సవం సంధర్భంగా బుధవారం రెబ్బన మండలంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు . ప్రపంచంలో మూడువంతులు నీరు ఒకవంతు భూమి ఉనప్పటికీ త్రాగునీరు మాత్రం 0. 3% ఉన్నదని అలాంటి త్రాగునీరును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు . భావితరాలకు నీటికొరత రాకుండా ఉండాలంటే నీటిని దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవాలని సూచించారు . తెలంగాణప్రభుత్వం మిషన్ కాకతీయ ,మిషన్ భగీరథ పథకాలద్వారా భావితరాల భవిష్యత్తును దృష్టిలోఉంచుకొని కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు . జిల్లాకు అనుసంధానంగా ఉన్న రెబ్బన ఎల్లమ్మ చెరువును మినీట్యాంకుబండ్ గ ఏర్పాటు అయ్యేలా కృషిచేస్తామని ,సమీపప్రాంతంలో ఉద్యానవనం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు . ఈ సందర్భంగా నీటి ప్రతిజ్ఞను సమావేశంలో ఉన్న నాయకులు ,విద్యార్థులతో చదివించారు. ప్రతిజ్ఞ నను నీటిని సంరక్షిస్తానని పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను నీటి వినియోగంతో ఔ చైత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్క బొట్టు కూడా వృధా చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నాను జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదను గుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను విజ్ఞత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం నీరు వృధా కాకుండా చూడటంలో న కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే దానిని సంరక్షించుకునే బాధ్యత మన ఫై ఉందని ప్రతిజ్ఞ చేసారు . ఈ కారక్రమంలో జడ్పీటీసీ  అజ్మీర  బాపూరావు, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ , స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ,తహసీల్దార్ రమేష్ గౌడ్ ,వైస్ ఎంపీపీ గుడిసెల రేణుక ,సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ ,ఏపీఎం వెంకటరమణ శర్మ ,ఎపిఓ కల్పన ,తెరాస నాయకులు నవీన్ కుమార్ జైష్వాల్,చిరంజీవి గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ ,మధునయ్య ,పల్లె రాజేశ్వర్ ముదిరాజ్ సంఘ నాయకులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment