Wednesday, 8 March 2017

మార్కెట్ కమిట ఉపాధ్యక్షురాలికి సన్మానం

మార్కెట్ కమిట ఉపాధ్యక్షురాలికి సన్మానం 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 08 ; అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నాడు ఆసిఫాబాద్ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షురాలు కందారపు శంకరమ్మను రెబ్బెనలోని తన నివాసంలో స్థానిక శివ సాయి మహిళా మండలి సభ్యులు,మహిళ నాయకురాళ్లు  శాలువా కప్పి  సన్మానించారు.అదే విధంగా మెమొంటోను ఆమెకు సభ్యులు అందజేశారు .ఈ సందర్బంగా  మహిళా సమితి సభ్యులు మాట్లాడుతూ శంకరమ్మ మహిళల అభివృద్ధికి ఎంతగానో  కృషి చేస్తుందని కొనియాడారు.భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి మహిళా అభివృద్ధికి మరింత కృషి చేయాలనీ అన్నారు. ఈ సందర్భoగా సన్మాన గ్రహీత శంకరమ్మ మాట్లాడుతు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళలు మని, ఎం.జ్యోతి,బి.సునీత,ఆర్.లక్ష్మి,పద్మ,స్రవంతి,మౌనిక,సరిత,జయలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment