ప్రశ్న పత్రం బయటకి వచ్చిన కేసులో నలుగురు అరెస్ట్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 28 ; రెబ్బెన మండలంలోని జడ్.పి.హెచ్. ఎస్. ఉన్నత పాఠశాలలో సోమవారం సామాన్య ద్వితీయ ప్రశ్న పత్రం చరవాణి ద్వారా బయటకి వచ్చిన కేసులో నీకొడే రవీందర్, నరహరి , రాజేష్,నాగేందర్ లను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నట్లు డీస్పీ భాస్కర్ తెలిపారు . మంగళవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు రవీందర్ పరీక్షా కేంద్రంలోలి వెళ్లి కిటికీ వద్దగల విద్యార్థి దగ్గరి గల ప్రశ్న పత్రాన్ని చిత్రీకరించి బయటకు తీసుకు వచ్చి రాజేష్ మరియు నరహరిలకు సోషల్ మీడియా ద్వారా పంపించినట్లు తెలిపారు .తదుపరి ఆ ప్రశ్న పత్రాన్ని అన్న పూర్ణ హైస్కూల్ ప్రధాన ఉపాద్యాయుడు నాగేందర్ వద్దకి తీసుకు వెళ్లి వాటి యొక్క సమాధానాలను వ్రాయించి వాటిని పరీక్షా కేంద్రానికి చేరవేశారు . గణితం పరీక్షా రోజు కూడా ఇదే విదంగా జరగగా ఎక్సమినేర్ పట్టుకొని విద్యార్థులను మందలించి వదిలేసినట్లు పేరుకున్నారు . వీరికి సంబందించిన విద్యార్థులను లేపి అడగడంతో ఆగ్రహించిన నరహరి దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టు పేరుకున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రెబ్బెన సబ్ ఇన్స్పెక్టర్ దారం సురేష్,సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అద్వర్యంలో కేసుని వేగవంతంగా విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment