Saturday, 4 March 2017

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేనేజర్ కు వినతి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేనేజర్ కు వినతి 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 4 ; బెల్లంపల్లి ఏరియాలోని అబ్బాపూర్ బిపిఎ ఎక్సటెన్షన్-2 ఓపెన్ కాస్ట్ లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరుతూ శనివారంనాడు ఏఐటీయూసీ ఫిట్ కమిటి ఆధ్వర్యంలో గని మేనేజర్ ఎల్.రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా ఫిట్ కార్యదర్శి ఎం.శేషశేయనరావు  మాట్లాడుతూ కాంటీన్ లో పూర్తి స్థాయి కార్మికులకు అందరికి సరిపడా నాణ్యమైన టీ,టిఫిన్,భోజనాన్ని అందించాలని కోరారు.తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చాలని ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనీ అన్నారు.క్రషర్,సైట్ ఆఫీసుల వద్ద శాశ్వత విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.షిఫ్ట్ లలో ప్లే డే లను పెంచాలని,షిఫ్ట్ లలో వాహన సౌకర్యం మెరుగుపర్చాలని సి హెచ్ పి లో ఉన్న బొగ్గు సరఫరా సమస్యలను పరిష్కాలరించాలని,లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి టి.భిక్షమయ్య,జనరల్ షిఫ్ట్ ఇంచార్జి కె.శ్రీనివాస్,నాయకులూ ఎం.సత్యనారాయణ,డి.మల్లయ్య,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment