Friday, 3 March 2017

సివిల్ డిపార్టుమెంట్ లో ఏఐటీయూసీ ద్వారా సమావేశం

సివిల్ డిపార్టుమెంట్ లో ఏఐటీయూసీ  ద్వారా సమావేశం 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి3 ;  బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సివిల్ డిపార్ట్ మెంట్ లో శుక్రవారంనాడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ద్వారా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడడం ఒక్క ఏఐటీయూసీతోనే సాధ్యమని,కార్మికుల సమస్యలపై అవగాహణ లేని టీబీజీకేఎస్ కార్మిక సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు.బెల్లంపల్లి ఏరియా ప్రాతినిధ్య సంఘం ఐన తాము ఏఐటీయూసీగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం,కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసి,కార్మికుల సౌకార్యార్థం గోలేటిలోని భీమన్న క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్,స్విమ్మింగ్ ఫూల్,క్రీడాకారులు,యువకుల కోసం పవర్ జిమ్ వంటివి ఏర్పాటు కోసం ఏఐటీయూసీ తీవ్రంగా కృషి చేసిందని అన్నారు.వుడెన్ షటిల్ కోర్ట్,కార్మిక వాడల్లో అంతర్గత తయారు రోడ్లు వేయాలడానికి,కొత్తగా వాటర్ పైప్ లైన్స్,ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందన్నారు.ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ల పై కాంటీన్ లను నూతనికరించి,మెరుగైన సదుపాయాలు,మూత్రశాలలు,సమావేశపు మందిరాలు.నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.కార్మికులు వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో మరింత సౌకర్యాలు కల్పించడంలో ఏఐటీయూసీ చిత్త శుద్ధితో ఉందని అన్నారు.సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అమలుకై హైకోర్టు లో ఏఐటీయూసీ ఇంప్లీడ్ ఫిటిషన్ దాఖలు చేసిందని అన్నారు.తప్పకుండ సింగరేణి కార్మికుల వారసులకు వారసత్వ ఉద్యోగాలు అమలు జరుగుతాయని అన్నారు.కార్మికుల హక్కుల కోసం,సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో సివిల్ డిపార్టుమెంట్ ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి బి.చక్రధర్,ఆర్గనైజింగ్ కార్యదర్శిలు బి.జగ్గయ్య,కె.కిరణ్ బాబు,ఎం.సత్యనారాయణ,నాయకులు వీరన్న, దోబీల మల్లయ్య,ఆకుల రాయలింగు,సుధాకర్,తిరుపతి,శంకర్,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment