Wednesday, 8 March 2017

సమ్మె నోటీసు సమర్పించిన కాంట్రాక్టు కార్మికులు

సమ్మె నోటీసు సమర్పించిన కాంట్రాక్టు కార్మికులు 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 08 ; కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15 వ తేది నాటి నుండి సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులు అందరు కాంట్రాక్టు కార్మికుల జేఏసి తలపెట్టిన నిరవధిక సమ్మె లో పాల్గొనాలని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మికుల బ్రాంచ్ అధ్యక్షులు బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని డోర్లి-ఓపెన్ కాస్ట్ 1 మేనేజర్ ఉమాకాంత్ కు సమ్మె నోటీసు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులూ ఆహుక్,గణపతి,సోహెల్ ఖాన్,బాసాని తిరుపతి,బండారి తిరుపతి, సంపత్, బ్రహ్మం, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment