Tuesday, 28 March 2017

బధ్యులపై చర్యలు తీసుకొవాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

బధ్యులపై చర్యలు తీసుకొవాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 28 ;  రెబ్బెన మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్. ఎస్. ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన సైన్స్ ద్వితీయ పరీక్ష పేపర్ లీకెజి ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి భధ్యులను విధుల నుండి తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఏఫ్) గా డిమాండ్ చేస్తున్నామని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు.మంగళవారం రోజున రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంవత్సరకాలం పాటు ఎంతో కష్టపడి విద్యార్థులు చదివారని,కొంత మంది సిబ్బంది వలన ప్రశ్న పత్రం బయటికి వచ్చిందనే ఆరోపణపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.పరీక్ష కేంద్రం వద్ద అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.పరీక్ష పత్రం లీకెజి ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి భద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని దీనికి విద్యాశాఖ అధికారులే పూర్తి భధ్యత వహించాలని హెచ్చరించారు.

No comments:

Post a Comment