పేదలకు వెన్నంటే ఉండే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం ; ఎమ్మెల్యే కోవా లక్ష్మి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 15 ; తెరాస ప్రభుత్వం పేదలకు వెన్నంటే ఉంటూ సంక్షేమ పథకాలను గత ప్రభుత్వాలు అందించలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు బుధవారం తహశీల్ధార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి పథకం కింద పలువురికి చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ నిరుపేదలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరెన్నో సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం అందించా లేని విధంగా అందించడం తెలంగాణ ప్రభుత్వం ఘనతే అని అన్నారు. దళితులకు, మైనారిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు . యాదవులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు ,ఒక పొట్టేలు ఇవ్వడం జరుగుతుందని 75 శాతం సబ్సిడీని ఇచ్చి ప్రభుత్వం అదుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావు ,తహశీల్ధార్ రమేష్ గౌడ్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుందారపు శంకరమ్మ ,సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మేన శ్రీధర్ ,ఎంపీటీసీ వనజ ,ఏఎంసీ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ .మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి ,నాయకులు అశోక్, చిన్న సోమశేఖర్, సుదర్శన్ గౌడ్,మడ్డి శ్రీనివాస్ ,మదనయ్య ,సురేష్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment