వేతనతో కూడిన సెలవును ప్రకటించాలీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 26 ; అంబేత్కర్ జయంతి సందర్బంగా వేతనం తో కూడిన సెలవును ప్రకటించాలని సంక్షేమ సంఘం బెల్లంపలికి ఏరియా అధ్యక్షులు బి గోపాల కృష్ణ అన్నారు. ఆదివారం సంభందిత అధికారికి వినతి పత్రం అందజేసి సంభందించిన కర పత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఏప్రిల్ 14న అంబేత్కర్ జయంతి పురస్కరించుకొని కార్మికులకు వేతనం తో కూడిన సెలవు దినాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసారు. దీనికి తెరాస, ఏఐటీయూసీ, ఐ.న్.టి.యూ.సి, హెచ్ ఎం స్ ఐ పి టి యూ ఇతర యూనియన్ వారు ఈ నెల 27న కార్మికులు అధికారులు అందరు నల్ల బాడ్జిలు ధరించి నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి తిరుపతి, ఆర్ రమేష్, డి బాపు, జి రమేష్, జి ఎల్లయ్య , ఫై సూరయ్య , ఏ మొగిలి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment