శ్రమదోపిడీకి గురిచేస్తున్నసింగరేణి యాజమాన్యం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 22 ; సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడిని దోచుకుంటూ వెట్టి చాకిరిలు చేయిస్తున్నారని ఏ.ఐ.టి.యూ.సి బ్రాంచ్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ అన్నారు. బుధవారం గోలేటి జీఎం కార్యలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేసారు. అనంతరం అయన మాట్లాడుతు జె.ఏ.సి ఆధ్వర్యం లో నిరవధిక సమ్మెలు 8వ రోజు గడుస్తున్నా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకిరీలు చేయిస్తూ కనీసం వేతనం చెల్లించకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. గుర్తింపు కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేసారు సహాయ కార్యదర్శి కె. సాగర్ గౌడ్, తిరుపతి, రాజేష్, చంద్రయ్య, బి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment