Tuesday, 28 March 2017

వారసత్వం కోసం ఏఐటీయూసీ ఆందోళనలు

వారసత్వం కోసం ఏఐటీయూసీ ఆందోళనలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 28 ;   వారసత్వ ఉద్యోగాలకు చట్ట బద్ధత కల్పించాలని కోరుతూ  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనులు మరియు డిపార్టుమెంట్ లలో మేనేజర్ లకు,అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ నాయకులూ మాట్లాడుతూ చట్ట బద్ధతతో కూడిన విఆర్ఎస్ ఉద్యోగాలను  తిరిగి ప్రవేశ పెట్టాలని,కోర్టులో వేసిన రాజకీయ పార్టీ సభ్యుల పై సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అంతక ముందు  కైరగూర ఓపెన్ కాస్ట్ లో  నిర్వహించిన ద్వారా  సమావేశంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ను దుయ్యబట్టారు.గత నాలుగు సంవత్సరాలలో కార్మికుల హక్కుల కోసం కాకుండా కార్మికులను మోసం చేయడానికే టీబీజీకేఎస్  ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చిందని అన్నారు.కార్మికులను పదే పదే మోసం చేస్తున్న టీబీజీకేఎస్ తీరును తీవ్రంగా ఆయన ఖండిoచారు.వినతి పత్రాన్ని సమర్పించిన వారిలో ఏఐటీయూసీ నాయకులూ  బయ్యా మొగిలి,ఎం.లక్ష్మి నారాయణ,శేషసేయణరావు,జగ్గయ్య,ఎస్.శ్రీనివాస్,సత్యనారాయణ,ఫిట్ కార్యదర్శులు జూపాక రాజేష్,నరసింహ్మారావు,వై.సారయ్య,జి.రమేష్,మల్లేష్,చక్రధర్,రమేష్,నరసింహ్మ సామీ,అంబెడ్కర్,దివాకర్,మదన్,భిక్షమయ్య,ఎం.సత్యనారాయణ,కిరణ్బాబు,ఎంఆర్ .చారీ,జనార్దన్ రెడ్డి,చుంచు రాజన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్,మండల ఇంచార్జి కస్తూరి రవి,జాడి సాయి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment