Saturday, 4 March 2017

మహిళా దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహిస్తాం ; ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ

 మహిళా దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహిస్తాం

                                          ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 4 ; అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన మండల కేంద్రంలో 7 వ తేదీన మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెరాస మాహిళ నాయకురాలు,ఆసిఫాబాద్ మార్కెట్ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ తెలిపారు.శనివారంనాడు రెబ్బెనలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళ దినోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజారు అవుతారని తెలిపారు.ఈ నెల 7 వ తేదీన నిర్వహించే మహిళా దినోత్సవానికి  మండలంలోని మహిళలు అందరూ హాజరు అయ్యి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యురాలు పి .వనజా,స్వర్ణలత,అరుణ,తదితరులు  ఉన్నారు.    

No comments:

Post a Comment