విద్యార్థులను వెధిస్తే ఉరుకొం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) కాగజ్ నగర్ మార్చి 09 ; విద్యార్థులను ఫీజుల పేరిట వెధిస్తే ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ హెచ్చరించారు. గురువారం రోజున కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల తల్లి తండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేసుకుంటున్నరని,ఫీజులు మాత్రం విద్యార్థులను అడిగి వెధిస్తున్నరని అలాంటి పాఠశాలలపై,కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాసంవత్సరం ముగియక ముందే రంగు రంగుల కరపత్రాలు ముద్రించి విద్యార్థులను వారి తల్లి తండ్రులను మోసం చేస్తున్నరని అన్నారు. అసత్య ప్రచారం చేసే విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో కనీస వసతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ మండల అధ్యక్షుడు రవివర్మ,కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment