Friday, 10 March 2017

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ; జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ; జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 10 ;  రెబ్బెన మండలంలోని  ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం నాడు  జిల్లా వైద్య ఆరోగ్య  అధికారి సుబ్బారాయుడు సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు రెబ్బెన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదర్శoగా తీసుకోవాలని సూచించారు.రికార్డులను తనిఖీ చేశారు.రోగులను  పరామర్శించారు.సిబ్బందితో మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని  సూచించారు.అదే విధంగా  జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ మెడికల్ దుకాణాలు మరియు ఆర్ఎంపి ప్రాక్టీషినర్స్ లు  మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన  మరియు శాఖ పరమైన చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు.ఆర్ఎంపీ,పీఎంపీలు రోగులకు ఇంజక్షన్లు  వెయ్యరాదని,గర్భిణీ స్త్రీలకు,ఫీట్స్ రోగులకు ప్రైవేట్ అర్ఎంపీలు వైద్యం అందిoచరాదని,దానికి వారు శస్త్ర చికిత్సలకు  అనర్హులు అని ఆయన తెలిపారు. ఆయన వెంట వైద్య సిబ్బంది,మెడికల్ సూపర్ వైజర్లు ఉన్నారు.



No comments:

Post a Comment