నత్త నడకన తొలగింపు పనులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 27 ; రెబ్బెన మండల్ గోలేటి గ్రామంలోని సింగరేణి కార్మిక నివాస విధుల్లో ప్రధాన దారి పై గత వారం రోజులుగా వాటర్ ట్యాంక్ దారికి అడ్డంగా పడి ఉండడంతో అటువైపుగా వెళ్లే నివాస గృహ కార్మికుల కుటుంబాలు మరియు విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు నిర్ణిత కాలంలో తీసివేయాల్సిన ట్యాంకును కాలయాపన చేయడం తో వచ్చి పొయ్యే ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నదని ప్రజలు వాపోతున్నారు ఇక నైన సంబంధిత సింగరేణి అధికారులు స్పందించి జనావాసాల్లోని సమస్యలను పట్టించుకోని త్వరిత గతిన రోడ్డుపై పడిఉన్న ట్యాంక్ ను తొలగించాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment