Saturday, 18 March 2017

సింగరేణి క్రీడా కారులను ప్రోత్సహిస్తుంది ; జీఎం రవి శంకర్

సింగరేణి  క్రీడా కారులను ప్రోత్సహిస్తుంది ; జీఎం రవి శంకర్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 18  ;       సింగరేణి కార్మికుల సంక్షేమం తో పాటు క్రీడా కారుల ను ప్రోత్సహిస్తుందని జీఎం రవి శంకర్ అన్నారు శనివారం రెబ్బెన మండలం లోని శ్రీ భీమన్న స్టేడియం లో స్వర్గీయ వేణు గోపాల్ జ్ఞాపకార్థం వాలీబాల్ మరియు ఫుట్ బాల్  క్రీడా పోటీలను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జనరల్ మానెజెర్ రవి శంకర్ ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడారు సింగరేణి సంక్షేమంతో పాటు కార్మికుల మరియు వారి కుటుంబ సభ్యులకు విద్య తో పాటు  క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారిలోని నైపుణ్యాలను గుర్తించి బహుమతులు అందజేయడాం జరుగుతుంది అన్నారు.  ఈ  కార్యక్రమం స్వర్గీయ వేణు గోపాల్ స్మారకార్థం ఏర్పాటు చేయడం జరిగిందని  అన్నారు.  గత ముపై సంవత్సరాల క్రితం ఈయన మార్గం ఫీట్ లో ఓవర్ మెన్ పనిచేస్తున్నప్పుడు గ్యాస్ లీకేజీ ని గమనించి తోటి కార్మికులను కాపాడే ప్రయత్నం లో మరణించారని అందుచే జ్ఞాపకార్థం ఈ కక్రీడా పోటీలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. హుజారాబాద్,హైదరాబాద్,దేవాపూర్,గోలేటి జట్టుల మధ్య క్రీడా పోటీల జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ జె చిత్రంజన్ డీవై పీఎం రాజేశ్వర్, టిబిజికె ఎస్ నాయకులూ సద శివ, ఏఐటీయూసీ బ్రాంచ్  సేకరెట్రీ ఎస్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.     

No comments:

Post a Comment