Friday, 10 March 2017

ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి రెండొవ స్థానం పట్ల హర్షం

ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి రెండొవ స్థానం పట్ల హర్షం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 10 ;  రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారంనాడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పని తీరును  తెలియజేసేందుకు గాను విడుదల చేసిన ర్యాంకులలో  కోవా లక్ష్మికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండవ స్థానం రావడం పట్ల హర్షం వ్యక్త పరుస్తున్నామని అసిఫాబాద్ ఎఎంసీ ఉపాధ్యాక్షురాలు,తెరాస మహిళ  అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ అన్నారు.  మహిళల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నియోజకవర్గాన్ని ఎప్పటికప్పుడు చుట్టేస్తూ ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో  ఎమ్మెల్యే అలుపెరగని పర్యటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకురాల్లు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment