Friday, 3 March 2017

రెబ్బెన పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా పాలనాధికారి

రెబ్బెన పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా  పాలనాధికారి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి3 ; ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారంనాడు రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి ఎం.చంపాలాల్ సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్ కు పాల్పడవద్దని  సూచించారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందలు లేకుండా సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ డివోను  ఆదేశించారు.త్రాగు నీరు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.కలెక్టర్ వెంట రెబ్బెన తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్ ,పరీక్షల నిర్వహణ అధికారి,కళాశాల ప్రిన్సిపాల్ కే.వెంకటేశ్వర్లు,అథియా ఖానాం,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment