సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; ప్రభుత్వ పథకాలను ప్రజలలోనికి తీసుకెళ్లాలని గ్రామా సర్పంచ్ పెసర వెంకటమ్మ, తెరాస జిల్లా మహిళా కార్యదర్శి కుందారపు శంకరమ్మలు అన్నారు . మంగళ వారము ఆమె రెబ్బెనలో, గోలెట్ ఖైర్ గూడలో సభ్యత్వ నమోదు చేపట్టారు . అనంతరము మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వము ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని వాటిని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు . ఆసరా పథకం , షాదీ ముబారక్ , కల్యాణ లక్ష్మి , తదితర పథకాలను ప్రభుత్వం అందించిందని తెలిపారు . త్రాగు నీరు , రోడ్లు , గ్రామ గ్రామ న ఏర్పాటు చేస్తున్నట్లు , గ్రామాల అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి అని అన్నారు .
No comments:
Post a Comment