Tuesday, 28 March 2017

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఏస్పీ

 పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఏస్పీ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 28 ;   కొమురం  బీమ్ జిల్లాలోని మొత్తం 34 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా  6.570 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నట్లు జిల్లా విద్య అధికారి రఫీక్ అన్నారు . పరీక్షా మొదలుకొని ఇప్పటి వరకు పరీక్షా నిర్వహణ ప్రైవేట్ విద్య సంస్థల ఉపాధ్యాయుల మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల కనుసన్నల్లోని డొల్ల తనానికి అద్దం పడుతోంది. పరీక్షా జరుగుతున్నా కాలంలో ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో  ఉపాధ్యాయులే సహకరిస్తున్నారన్న అపవాదులు లేకపోలేదు. రెండురోజుల్లో ముగియనున్న పదోతరగతి పరీక్షల్లో రెబ్బెన మండల్ లోని ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా ప్రాథమికోన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రంలోని అవకతవకలు వెలుగులోకి వచ్చాయి . పరీక్షా కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నివాస గృహాలకు అనుకోని ఉండడంతో పోకిరీలు గోడలపై నుండి చిట్టీలు అందిస్తున్నారన్న విషయమై జిల్లా పోలీస్ అధికారికి తెలియడంతో స్వయంగా డీఏస్పీ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ విషయమై పరీక్ష జరుగుతున్నా సమయంలో పరీక్షా కేంద్రం చుట్టూ ప్రక్కల తిరుగుతూ చిట్టీలు అందిస్తున్న , పరీక్షా పేపర్ లీక్ కి సహకరించిన వారిని అదుపులోకి తీసుకోని విచారించి తదుపరి కేసు విచారణ పై పూర్తి చర్యలు తీసుకుంటామన్న జిల్లా పోలీస్ అధికారి డిఎస్పీ భాస్కర్ తెలిపారు.

No comments:

Post a Comment