Thursday, 9 March 2017

కంప్యూటర్ ఫీజును మాఫీ చేయాలనీ జి ఏం కు వినతి

కంప్యూటర్ ఫీజును మాఫీ చేయాలనీ జి ఏం కు వినతి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 09 ;  గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ఫీజును మాఫీ చేయాలనీ కోరుతూ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి  పూదరి సాయికిరణ్ గురువారం బెల్లంపల్లి ఏరియా జనరల్  మేనేజర్ రవి శంకర్ కు వినతి పత్రం అదజేసారు.ఈ సందర్బంగా పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ   సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సింగరేణి ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ఫీజును మాఫీ చేయాలనీ జీఎం ను అడిగారు.ఏ ఐ ఎస్ ఎఫ్ పోరాటఫలితంగా  ఈ విద్య సంవత్సరం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాం ప్రారంభం అయినందున గోలేటిలోని విధ్యార్ధులకు చాల మేలు జరిగిందని తెలియజేశారు. పాఠశాలలో చదివే విద్యార్థులు అంత కూడా నిరుపేద,బడుగు బలహీన వర్గాలకు చెందినవారని,వారు కంప్యూటర్ ఫీజును కట్టలేని స్థితిలో ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ ఫీజును మాఫీ చేసి విధ్యార్థులను ఆదుకోవాలని కోరారు.దీనికి సానుకూలంగా స్పందించిన జీఎం  రవిశంకర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఎడ్యుకేషన్ జీఎం తో మాట్లాడి మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  మలిశెట్టి మహిపాల్, పట్టణ అధ్యక్షులు పడాల సంపత్, పట్టణ కార్యదర్శి జాడి సాయి కుమార్ ,పాఠశాల విద్యార్థులు జీతంగుల సంజయ్,గడ్డం వంశీ,సాయి,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment