సమ్మె పోస్టర్ల విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 11 ; సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను కోరుతూ ఈ నెల 15 నుండి జే ఏ సి అద్వర్యంలో చేబడుతున్న సమ్మె పోస్టర్లను శనివారం గోలేటి కే ఎల్ మహేంద్ర భవనంలో ఆవిష్కరించారు. కాంట్రాక్టు కార్మికుల ఏ ఐ టి సి బ్రాంచ్ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు అన్నారు. చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు అన్నారు. కార్మికుల సమస్యల పరిస్కారం కోసమె జె ఏ సి అద్వర్యం లో ఈ నెల 15 నుండి సింగరేణి వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినేట్ చెయ్యాలని సమన పనికి సమానమైన వేతనం చెల్లించాలని వైద్య సదుపాయం, ఈ ఎస్ ఐ సౌకర్యాలతో పటు తదితర పరిస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏ ఐ టీ సి కార్యదర్శి అశోక్,సాగర్, ధన్రాజ్ ఐ ఎఫ్ టి యూ బ్రాంచ్ అధ్యక్షులు తిరుపతి, శ్రీను, శ్రీకాంత్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment