సంబురంగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 07 ; :మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాల ద్వారా మహిళలకు అత్యధికంగా లబ్ద్ధి చేకూరుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. మంగళవారము రెబ్బెన అదితి గృహం ఆవరణలో ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ అద్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిధులుగా వారు పాల్గొని మాట్లాడారు.మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం చాల సంతోషకరం అని అభినందించారు.అదే విధంగా మహిళలు విద్యా పరంగా,రాజకీయంగా ఎదగాలని,ఎన్నో మహిళా దినోత్సవాలు జరుగుతున్న,మహిళల పట్ల అత్యాచారాలు,గృహ హింసను అరికట్టలేక పోతున్నామని అన్నారు, సమాజముల్లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు చట్ట సభల్లో ప్రతిపాదనలు అమలుచేయాలని, మహిళలు ఆత్మసైర్థంతో ముందుకు నడవాలని సూచించారు.నేడు మహిళలు చట్టాల విషయంలో కొంత వెనుకబడి ఉన్నారని చట్టాల అమలు చేయడానికి మహిళలు ఐక్యంగా ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హింసకే ప్రోత్సహిస్తున్నాయని రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, బ్రూణహత్యలు పెరుగుతున్నాయే తప్ప వాటినుంచి మహిళలను రక్షించడంలో చట్టాలు విఫలమయ్యాయని అన్నారు మహిళల భద్రతతోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు.కేసీఆర్ ప్రభుత్వం స్త్రీలకోసం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పధకం ద్వారా విద్యార్థినులు,మహిళల పట్ల రోడ్ల పై వేధింపులు,అరాచకాలు తగ్గుముఖం పడ్డయని అన్నారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజారు అయిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుతం వచ్చాక ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఘనత కే సి ర్ అని గత ప్రభుత్వ్యాలు చేయలేని పనులు కేసీర్ తోనే సాధ్యమని అన్నారు .అంతకు ముందు అంబెడ్కర్ విగ్రహం నుండి ర్యాలీ గ సభ ప్రాంగణానికి ఎమ్మెల్యే,మహిళలలతో చేరుకున్నారు.అనంతరం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు,నృత్యాలు,కోలాటం అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో, కాగజ్ నగర్ మార్కెట్ చైర్మన్ పద్మ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆసిఫాబాద్ మార్కెట్ చైర్మన్ గంధం శ్రీనివాస్, హసీల్ధార్ బండారి రమేష్ గౌడ్, మండల పరిషత్ ఉపాద్యక్షురాలు గుడిసెల రేణుక, వైస్ . పి . పి, సర్పంచులు వెంకటమ్మ ,సుశీల ,లక్ష్మి బాయి ,ఎంపీటీసీ పర్లపల్లి వనజ, , అంగన్వాడీ కార్యకర్తలు సుమలత , స్వర్ణ లత , చంద్రకళ ,ప్రమీల, శుష్మ, భారతి, పలు గ్రామాల సర్పచులు సులోచన ,లక్ష్మిబాయి, ఎం పి టి సి లు వనజ,మల్లేశ్వరి, సువర్ణ ,సుజాత ఆశ కార్యకర్తలు ,ఐకేపీ మహీళలు తధీతర మహీళలు ఉన్నారు. త జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్, మల్రాజ్ శ్రీనివాస్ రావు,కోఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని, సింగల్ విండో డైరెక్టర్లు మధునయ్య, సత్యనారాయణ, గుడిసెల వెంకన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment