సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
మల్రాజ్ శ్రీనివాస్ రావు
నేల్గొండ సదాశివులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 11 ; సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయం లో కార్మి కులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టి బి జి కె ఎస్ కేంద్ర కార్యదర్శి మల్రాజ్ శ్రీనివాస్ రావు, టి బి జి కె ఎస్ ఉపాధ్యక్షులు నేల్గొండ సదాశివులు అన్నారు. శనివారం రెబ్బెన మండలం లోని గోలేటి టి ఆర్ ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మాట్లాడారు. 18 సంవత్సరాల తరువాత టి ఆర్ ఎస్ ప్రభుత్వం, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ప్రకటించటంతో కార్మిక కుటుంబాలలో వెలుగులు నింపాయి అన్నారు. కొందరి కుట్ర వలన కొర్టు లో కేసు వేయడం జరిగిందని అన్నారు. అట్టి కేసుని ప్రభుత్వం మరియు టి బి జి కె సి యూనియన్ తరుపున సమస్యని ఏదురుకొని వారసత్వ ఉద్యోగాలను కల్పిచేం విదంగా చేశాం అన్నారు. ఈ సమావేశం లో జె రాజు, దొర్లి 1 ఓ సి పి పిట్ కార్యదర్శి రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment